మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ పక్కన కలెక్టర్ ప్రావీణ్య
వరంగల్: బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని మహేశ్వరీగార్డెన్, రైల్వే గేట్ శాంతినగర్‌లోని రాజశ్రీగార్డెన్‌లో రెవెన్యూశాఖ, సీ్త్ర శిశు సంక్షేమ, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో వేర్వేరుగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, విద్యార్థికి 4జీ మొబైల్, దివ్యాంగులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఇంటికి సంక్షేమ ఫలాలు అందించే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బలహీన వర్గాల ప్రజల మొహా ల్లో చిరునవ్వులు చూడటమే సీఎం రేవంత్‌రెడ్డి ధ్యేయమన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు ఇక్బాల్ అహ్మద్, బండి నాగేశ్వర్‌రావు, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారి శారద, కార్పొరేటర్లు, నేతలు కొత్తపెల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాశ్ పాల్గొన్నారు.
ప్రైవేట్ ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..
ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, రిజిస్ట్రేషన్ యాక్ట్‌లో భాగంగా ప్రైవేట్ ఆస్పత్రులు, అప్రూవల్, మెటర్నల్ డెత్ సర్వేలెన్స్ రిపోర్ట్‌పై బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
మాతృ, శిశుమరణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గర్భిణులు ఆస్పత్రుల్లో నమోదు చేసుకున్న వెంటనే వారికి నిరంతరం సేవలందించాలని చెప్పారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ గోపాల్‌రావు, డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ నిర్మల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment