నిప్పుతో చెలగాటం.. పాక్ కు కుక్క చావే
Breaking News
చెప్పి మరీ నటిని ఇబ్బంది పెడుతున్నారు
Published on Sat, 04/19/2025 - 18:52
సోషల్ మీడియా ఉపయోగించడం ఏమో గానీ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు హ్యాకింగ్ బారిన పడుతుంటారు. నటీనటులు ట్విటర్ అకౌంట్స్ ఎప్పటికప్పుడు హ్యాక్ అవుతూనే ఉంటాయి. తాజాగా తమిళ నటి ఖుష్బూని హ్యాకర్స్ తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఖుష్బూ తరచుగా ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఓ ఫొటో పోస్ట్ చేయగానే.. సన్నగా మారడానికి ఇంజెక్షన్ తీసుకున్నారా? అని ఓ నెటిజన్ అన్నాడు. దీంతో అతడి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.
తాజాగా ఖుష్బూ ఫోన్ నంబర్ ఎలా తెలిసిందో ఏమో గానీ యూకేకి చెందిన కొందరు హ్యాకర్స్.. నీ ట్విటర్ ఖాతాని హ్యాక్ చేస్తున్నాం అని ఖుష్బూ వాట్సాప్ కే మెసేజ్ పంపించారు. ఈమె ట్విటర్ ఖాతా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన సమాచారాన్ని హ్యాకర్స్ పోస్ట్ చేస్తున్నారు. దీంతో తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులని ఖుష్బూ ఆశ్రయించింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది.
(ఇదీ చదవండి: నాన్న కల నెరవేర్చిన తెలుగు డైరెక్టర్.. కొత్త ఇల్లు)
Tags : 1