Breaking News

తెలంగాణ మంత్రి దగ్గర రూ.55 లక్షల అప్పు: రాజ్‌తరుణ్‌ మాజీ ప్రేయసి లావణ్య

Published on Sat, 04/19/2025 - 19:23

హీరో రాజ్‌ తరుణ్‌ (Raj Tarun), అతడి స్నేహితుడు శేఖర్‌ బాషా వల్ల తనకు ప్రాణహాని ఉందని లావణ్య (Lavanya) ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ శనివారం నాడు నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయకపోతే పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే ప్రాణాలు విడుస్తానంది. మీడియాతో లావణ్య మాట్లాడుతూ.. ఇటీవల నాపై కొందరు దాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిన్న రాత్రి నలుగురు వ్యక్తులు నా ఇంటిపైకి వచ్చారు. భయంతో బతుకున్నాను. నా ప్రాణం పోయాక చర్యలు తీసుకుంటారా? ఆ ఇంటి కోసమే నాపై ఇలా దాడి చేస్తున్నారు.

రూ.55 లక్షల అప్పు
నిజానికి ఆ ఇంటిపై తెలంగాణ మంత్రి బంధువుల దగ్గరి నుంచి రూ.55 లక్షలు అప్పు తీసుకున్నాం. నాలుగేళ్లవుతోంది.. రెండేళ్లుగా మా గొడవల వల్ల వడ్డీ చెల్లించడం లేదు. కాస్త గడువు ఇవ్వమని అడుగుతూ వచ్చాం. నిన్న సాయంత్రం వారు మాకు ఫోన్‌ చేశారు. వారం రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే ఇల్లు ఆక్రమించుకుంటామన్నారు. అందుకు నేను ఒప్పుకున్నాను. రెండుమూడురోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తాను. ఇకపోతే ఆ మంత్రి పేరు నేను చెప్పలేను. నాలుగురోజుల్లో ఇల్లు ఆక్రమించుకోవడానికి వస్తారు. అప్పుడు మీకే తెలుస్తుంది.

పరువు పోతుందని ఆగా..
ఒకవేళ రాజ్‌తరుణ్‌.. అప్పిచ్చిన వ్యక్తికి రూ.55 లక్షలు ఇచ్చినా సరే ఆ ఇంటిని మళ్లీ రాజ్‌తరుణ్‌కు ఇవ్వకూడదని కోరతాను. ఎందుకంటే ఆ ఇంట్లో నా వాటా కూడా ఉంది. ఇప్పటికే రాజ్‌ ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ కావడంతో అతడిపై కేసులు కూడా వేసేందుకు సిద్ధమయ్యారు. పరువు పోతుందని ఇంతకాలం ఈ విషయం బయటకు చెప్పలేదు అని లావణ్య పేర్కొంది.

చదవండి: శంకర్‌దాదా ఎంబీబీఎస్‌.. ఆమె జీవితాన్నే మార్చేసింది!

Videos

Bolla Brahmanaidu: సంబంధం లేని వ్యక్తులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు..

Revanth Reddy: రోడ్డు మీదకొచ్చే ముందు.. యాక్సిడెంట్స్ మర్డర్స్ తో సమానం

టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ పై అంబటి రియాక్షన్

ABN ఆఫీస్ ఏదురుగానే ABN పత్రికను కాల్చేసిన YSRCP నేతలు

ఈ సంక్రాంతికి డాన్స్ వేస్తారా? రిపోర్టర్ ప్రశ్నకు అంబటి సెటైర్లు

Rayana Bhagya: ఏ ఇంట్లో సంక్రాంతి లేదు పేదలకు పండగ లేకుండా చేశావ్

మన శంకర వరప్రసాద్ గారు హిట్టా.. ఫట్టా

అమితాబ్ కు తన గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన హార్దిక్ పాండ్యా

ప్రతి ఉద్యోగికి కోటి ప్రమాద బీమా...రేవంత్ రెడ్డి వరాల జల్లు

Uttam Kumar: పోలవరంపై సంచలన కామెంట్స్..సుప్రీంలో తెలంగాణ దావా!

Photos

+5

ప్రముఖ నటుడికి సన్మానం.. హాజరైన మీనా (ఫోటోలు)

+5

ఒకే ఫ్రేమ్‌లో నమ్రత, లక్ష్మీ ప్రణతి (ఫోటోలు)

+5

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత మరింత కళగా సమంత (ఫోటోలు)

+5

బుల్లితెర నటులు 'ఇంద్రనీల్, మేఘన'ల గృహప్రవేశం (ఫోటోలు)

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)