ఎవరినీ వదిలిపెట్టం - 40 రోజుల్లో ఛార్జిషీట్
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద జరిగిన ప్రయివేట్ వోల్వో బస్సు ప్రమాద ఘటనపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని సీఐడీ ఛీఫ్ కృష్ణ ప్రసాద్ చెప్పారు. 40 రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేస్తామన్నారు. 15 నిమిషాల్లోనే 45 మంది దుర్మరణం చెందారని తెలిపారు. పాలెం దుర్ఘటనపై సీఐడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టం అని కృష్ణ ప్రసాద్ చెప్పారు. ఇద్దరి అరెస్టులతోనే సరిపెట్టుకోం అన్నారు. చట్టపరంగా ఉన్న అంశాల్ని పరిశీలిస్తున్నామన్నారు. వోల్వో బస్సు బాడిబిల్డింగ్ లోపాలు, రోడ్డు ఇంజినీరింగ్ లోపాలు,అధికారుల నిర్లక్ష్యం , వీటన్నింటిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఐటీసీ, ఎంవీ యాక్ట్ కింది నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.