ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ | Pamarru MLA Kaile Anil Kumar Voluntary Corona Medical Testing | Sakshi
Sakshi News home page

స్వచ్ఛందంగా ఎమ్మెల్యే కరోనా పరీక్షలు

Published Sat, Apr 18 2020 8:54 AM | Last Updated on Sat, Apr 18 2020 9:10 AM

Pamarru MLA Kaile Anil Kumar Voluntary Corona Medical Testing - Sakshi

సాక్షి, కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ స్వచ్ఛందంగా కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నెగెటివ్‌ వచ్చింది. ఆయన శుక్రవారం  ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి పరీక్షలు చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. గత 20 రోజులుగా ప్రజల్లో నిరంతరం తిరుగుతూ నియోజకవర్గ పరిధిలోని కూచిపూడిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌​ సెంటర్లకు వెళ్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకున్నానని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ తెలిపారు. 

ఇక శుక్రవారం కొత్తగా నమోదైన నాలుగు కేసులతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 52కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 38 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 572కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా బారినపడి ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది మరణించారు. 35 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 523 గా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement