ప్రభుత్వ రంగ బ్యాంక్– ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పద్మజ చంద్రూ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్లోబల్ మార్కెట్స్ విభాగానికి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆమె... తాజాగా ఇండియన్ బ్యాంక్ సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టారని గురువారం బ్యాంక్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే పది ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఎండీ, సీఈఓలను నియమించగా... ఈ జాబితాలో ఇండియన్ బ్యాంక్ సీఈఓగా పద్మజ ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment