స్నాప్ ఇంక్ (ఫైల్ ఫోటో)
అమెరికన్ టెక్నాలజీ, సోషల్ మీడియా కంపెనీ అయిన స్నాప్ తన ఉద్యోగులపై వేటు వేస్తోంది. ఇప్పటికే ఇంజనీరింగ్, కంటెంట్ ఉద్యోగులను తీసేసిన ఈ కంపెనీ, మరికొంత మంది ఉద్యోగులను తీసేయాలని నిర్ణయించింది. అయితే ఈ సారి అడ్వర్‌టైజింగ్ వైపు ఈ వేటు ఉండనున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా వంద మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. గతేడాది చివరిలో తమ టీమ్స్‌ను జాగ్రత్తగా పరిశీలించాలని స్నాప్ సీనియర్ లీడర్లను ఆదేశించామని స్నాప్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
తమ వ్యాపారాల్లో నిలకడగా వృద్ధి సాధించడానికి తమ టీమ్‌ల మధ్య సన్నిహిత సహకారాలు ఏర్పరచడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. స్నాప్‌చాట్ యాప్‌ను నిర్వహించే స్నాప్ ఈ నెల మొదట్లోనే 120 మంది ఇంజనీర్లను తన కంపెనీ నుంచి తీసేసింది. అడ్వర్‌టైజింగ్ బిజినెస్‌లను అభివృద్ధి చేసుకోవడానికి, కొత్త ఉత్పత్తులను విడుదల చేయడం కోసం స్నాప్ ఎక్కువగా అడ్వర్‌టైజింగ్ స్టాఫ్‌ను నియమించుకుంది. ప్రస్తుతం వీరిలో కొంతమంది ఉద్యోగులను స్నాప్ తీసేస్తోంది. గత ఏడాది క్రితం స్నాప్ ఐపీఓకి వచ్చిన తర్వాత, కంపెనీ వరుసగా మూడు క్వార్టర్ల నుంచి రెవెన్యూ వృద్ధిలో నిరాశపరుస్తూనే వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment