విషాదం: ఆన్‌లైన్‌లో విషసర్పాన్ని ఆర్డరిస్తే! | Chinese Woman Dies With Online Delivered Poisonous Snake | Sakshi
Sakshi News home page

విషాదం: ఆన్‌లైన్‌లో విషసర్పాన్ని ఆర్డరిస్తే!

Published Mon, Jul 23 2018 3:39 PM | Last Updated on Tue, Sep 18 2018 7:36 PM

Chinese Woman Dies With Online Delivered Poisonous Snake - Sakshi

బీజింగ్‌ : ఎవరైనా పాము పేరు చెబితనే వామ్మో అంటూ పరుగులు తీస్తారు. కానీ చైనాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం పాము వైన్‌ను తయారు చేసుకుని సేవిస్తారు. ఈ క్రమంలో ఓ యువతి ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లో అత్యంత విషపూరిత పామును బుక్‌ చేసుకుని.. ఆపై అదే పాముకాటుకు గురై దుర్మరణం చెందింది. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. చైనాలోని షాంగ్జీ ఏరియాకు చెందిన 21 ఏళ్ల యువతికి స్నేక్‌ వైన్‌ తాగాలనిపించింది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. చైనాలో కొన్ని ప్రాంతాల్లో పలురకాలుగా స్నేక్‌ వైన్‌ను తయారుచేసుకుని ఇష్టంగా తాగుతారు. ఈ క్రమంలో కొన్నిరోజుల కిందట ఆ యువతి ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ ఝువాన్‌ఝువాన్‌లో ఓ విష సర్పాన్ని ఆర్డరిచ్చింది. తన ఇంటికి వచ్చిన పామును వైన్‌ ఉన్న పాత్రలో వేసింది. అయితే ఆ పాము ఎలాగోలా తప్పించుకుని పాత్రనుంచి బయటకొచ్చింది. ఆపై విష సర్పం కాటువేయడంతో యువతిని మృతిచెందినట్లు ఆమె తల్లి తెలిపారు. 

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఆ ఇంటి సమీపంలోనే పామును పట్టుకుని తీసుకెళ్లారు. కాగా, ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లు మాధ్యమంగా విష సర్పాలు, క్రూర జంతువులను విక్రయించడం నేరమని పోలీసులు పేర్కొన్నారు. కానీ కొన్ని చిన్న ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌ అధిక సంపాదన కోసం ఇంకా ఇలాంటి జంతువులను విక్రయిస్తున్నారని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement