కొలంబో : ముస్లిం వ్యతిరేక అల్లర్లు చెలరేగి మత ఘర్షణలకు దారి తీయగా, ఎమర్జెన్సీ తర్వాత శ్రీలంకలో ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది. అయితే ఘర్షణలకు కారణమైన సంస్థ ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. (ఘర్షణలకు కారణం ఏంటంటే...)
మహసన్ బాలకాయ అనే సంస్థ ముస్లింలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు, వీడియోలు పోస్టు చేయటంతో అల్లర్లకు చెలరేగాయి. ఆ సంస్థే త్వరలో రాజకీయ అరంగ్రేటం చేయనున్నట్లు ప్రకటించింది. ‘సింహళీయుల గౌరవాన్ని కాపాడే రాజకీయ పార్టీలు ఇప్పటిదాకా లేవు. అందుకే మిగతా సింహళ సంస్థలను కలుపుకుని మహసన్ బాలకాయ పేరిట పార్టీని స్థాపించబోతున్నాం. ఇప్పటికే ఎన్నికల అధికారికి పార్టీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాం’ అని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించారు.
కాగా, మహసన్ బాలకాయ సంస్థపై మత ఘర్షలతోపాటు ముస్లింలకు చెందిన స్థలాలను కబ్జా చేసిందంటూ పలు కేసులు ఉన్నాయి.
క్యాండీ జిల్లాలో 70 శాతం ఉన్న సింహళ బౌద్ధులకు, 10 శాతం ఉన్న ముస్లింలకు మధ్య మార్చి6వ తేదీన అల్లర్లు చెలరేగటం.. అవి మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించటంతో ఎమర్జెన్సీని విధించింది శ్రీలంక ప్రభుత్వం. చివరకు పరిస్థితి సర్దుమణగటంతో మార్చి 18న అత్యవసర పరిస్థితిని ఎత్తేసినట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment