న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత కార్యదర్శి రాజీవ్ టోప్నో ప్రపంచ బ్యాంకులో కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు సీనియర్ సలహాదారుగా సేవలందించనున్నారు. అతనితో పాటు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)లో పని చేస్తున్న పలువురు అధికారులకు ఇతర పదవులను కేటాయిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామక కమిటీ (ఏసీసీ) గురువారం ఆమోద ముద్ర వేసింది. మొత్తంగా ఐదుగురు అధికారులను విదేశీ వ్యవహారాలు చూసుకునేందుకు కేటాయించింది. కాగా 2009లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ టోప్నో ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ ఆఫీసర్‌గా నియమితులు అయ్యారు. ఆ తర్వాత 2014లో ప్రధానిగా ఎన్నికైన మోదీ రాజీవ్ టోప్నోను తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు.
ఇక 1999 బ్యాచ్ ఐఏఎస్ అధికారి బ్రజేంద్ర నవనీత్ జెనీవాలోని ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత అంబాసిడర్‌గా దేశం తరపు శాశ్వత ప్రతినిధిగా నియామకమయ్యారు. 1993 ఐఏఎస్ బ్యాచ్ అధికారి రవికోటను వాషింగ్టన్‌లో భారత ఎంబసీ మంత్రిగా ఏసీసీ నియమించింది. లేఖన్ తక్కర్‌ను బీజింగ్‌లో భారత రాయబార కార్యాలయంలో ఎకనామిక్ కౌన్సిలర్‌గా, హెచ్ అతేలీని ఆసియా బ్యాంకులో ఈడీకి సలహాదారుగా, అన్వర్ హుస్సేన్ షేఖ్‌ను ప్రపంచ వాణిజ్య సంస్థలో పర్మినెంట్ మిషన్ ఆఫ్ ఇండియా కౌన్సిలర్‌గా నియమించింది. (ప్రధాని సలహాదారులుగా రిటైర్డ్ ఐఏఎస్‌లు)
Comments
Please login to add a commentAdd a comment