సంబరాలు..అదిరేలా | Sakshi
Sakshi News home page

సంబరాలు..అదిరేలా

Published Thu, Jun 2 2016 2:08 AM

సంబరాలు..అదిరేలా

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం
ప్రతి గ్రామానికీ రూ.6వేలు మంజూరు ఉదయం జెండావిష్కరణ
అనంతరం మిఠాయిల పంపిణీ పరేడ్ మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు
అమరవీరుల స్థూపాన్ని పూలమాలలతో అలంకరించిన అధికారులు
విద్యుత్ దీపాలతో వెలుగులీనుతున్న ప్రభుత్వ కార్యాలయాలు

 
జెడ్పీసెంటర్ /మహబూబ్‌నగర్ క్రైం:
తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పడి రెండేళ్లు పూర్తిచేసుకుని మూడో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసింది. అందులో భాగంగానే  జిల్లా యంత్రాంగం గురువారం గ్రామగ్రామానా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తిచేసింది. వారంరోజుల నుంచి జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య వారోత్సవాలను నిర్వహించారు. ఇప్పటికే గ్రామపంచాయతీ కార్యాలయాలకు సున్నాలు వేయడంతోపాటు విద్యుత్‌దీపాలతో సుందరంగా అలంకరించారు. ప్రజల కు శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.

నేడు నిర్వహించే కార్యక్రమాలు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భం గా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో పలు కార్యక్రమలు చేపట్టనుంది. ఉద యం దేవాలయాలు, మసీదులు, చర్చీలను సందర్శించడం. తెలంగాణ అమరవీరుల స్థూపాలను సందర్శించి నివాళులు అర్పించడం. తెలంగాణ సాధన లో అమరులైన వారి కుటుంబాలను కలిసి వారికి భవిష్యత్‌పై భరోసా కల్పించడం, గ్రామ పంచాయతీ భ వనం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. కార్యక్రమంలో గ్రామ యువకులు, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళ లు పాల్గొనే విధంగా ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. జాతీ య జెండా ఆవిష్కరణ అనంతరం మి ఠాయిలు పంపిణీ చేయనున్నారు. ఆస్పత్రిలో రోగులు, వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు పండ్లు పంపిణీ చేయనున్నా రు. ఈ కార్యక్రమాలు నిర్వహించేం దుకు ప్రతిగ్రామానికి రూ.ఆరువేల చొప్పున ప్రభుత్వం మంజూరుచేసింది.


పరేడ్ మైదానం సిద్ధం
వేడుకలకు జిల్లా పరేడ్ మైదానం సిద్ధమైంది. బుధవారం జిల్లా పోలీస్‌శాఖ నుంచి పరేడ్ మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అవతరణ వేడుకలలో పాల్గొనడానికి వచ్చే ప్రజ లకు, ఇతర అధికారుల కోసం ప్రత్యేక టెంట్‌లు, ఇతర ప్రభుత్వ పథకాలను ప్రత్యేక స్టాల్స్, మంత్రులు, అధికారు లు ప్రసంగించేందుకు ప్రత్యేక వేదికను తయారు చేశారు. అదేవిధంగా అవతర ణ వేడుకల్లో చేయడానికి పోలీస్ సిబ్బం ది కవాతు నిర్వహించారు. ఎస్పీ, జెడ్పీ, కలెక్టరేట్ , అంబేద్కర్ భవనం, హౌ సింగ్, ఇతర కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. జిల్లాలోని వివిధ పట్టణాల ప్రధాన కూడళ్లను రం గురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పండగ వాతావరణం నెలకొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement