-
Israel-Hamas war: అల్–షిఫా నుంచి 31 మంది శిశువుల తరలింపు
ఖాన్ యూనిస్: అల్–షిఫా ఆసుపత్రిలోని హృదయ విదారక దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించాయి. ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న ఆ ఆసుపత్రిలో శిశువుల దీన స్థితిని చూసి ప్రజలు చలించిపోయారు. వారి ప్రాణాలు కాపాడాలని ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇజ్రాయెల్ సానుకూలంగా స్పందించింది. శిశువుల తరలింపునకు అంగీకరించింది. నెలలు నిండకుండా పుట్టిన 31 మంది శిశువులను అల్–షిఫా హాస్పిటల్ నుంచి దక్షిణ గాజాలోని మరో ఆసుపత్రికి తరలించారు. వారిని పొరుగు దేశమైన ఈజిప్టుకు చేర్చి, మెరుగైన చికిత్స అందించనున్నట్లు గాజా ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఇంకా చాలామంది రోగులు, క్షతగాత్రులు, సామాన్య జనం ఇంకా అల్–షిఫా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం వారిని బయటకు వెళ్లనివ్వడం లేదు. ఇక్కడ ప్రాణాధార ఔషధాలు, ఆహారం, నీరు, విద్యుత్ లేకబాధితులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అత్యవసర చికిత్స అవసరమైన శిశువులను అల్–షిఫా నుంచి అంబులెన్స్‌ల్లో దక్షిణ గాజాలోని రఫా హాస్పిటల్‌కు తరలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ చెప్పారు. జబాలియా శరణార్థి శిబిరంపై క్షిపణుల వర్షం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అల్–షిఫా ఆసుపత్రిని పూర్తిగా దిగ్బంధించింది. సాధారణ జనావాసాలతోపాటు పాఠశాలలు, శరణార్థి శిబిరాలపైనా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై శనివారం అర్ధరాత్రి నుంచి దాడులు కొనసాగించింది. పదుల సంఖ్యలో జనం మరణించినట్లు తెలుస్తోంది. ఉత్తర గాజా నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం పదేపదే హెచ్చరిస్తోంది. హమాస్ మిలిటెంట్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నామని, సాధారణ ప్రజలకు నష్టం వాటిల్లకూడదన్నదే తమ ఉద్దేశమని వెల్లడించింది. ఉత్తర గాజాలో ప్రస్తుతం తమ దళాలు చాలా క్రియాశీలకంగా పని చేస్తున్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో గాజాలో ఇప్పటిదాకా 12,000 మందికిపైగా మృతిచెందారు. మరో 2,700 మంది శిథిలాల కింద గల్లంతయ్యారు. బందీల విడుదలకు యత్నాలు గాజాలో హమాస్ చెరలో దాదాపు 240 మంది బందీలుగా ఉన్నారు. వారిలో ఇప్పటిదాకా నలుగురి బందీలను మిలిటెంట్లు విడుదల చేశారు. మరో ఇద్దరు బందీల మృతదేహాలు ఇటీవల్ అల్–షిఫా ఆసుపత్రి సమీపంలో లభ్యమయ్యాయి. మిగిలిన బందీల విడుదలకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్, అమెరికాతోపాటు పర్షియన్ గల్ఫ్ దేశమైన ఖతార్ చొరవ తీసుకుంటున్నాయి. ఖతార్ ప్రతినిధులు హమాస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. బందీలను క్షేమంగా విడుదల చేయాలని కోరుతున్నాయి. -
సొమ్మసిల్లి పడిపోయిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఆస్పత్రిలో చేరిక
జెరుసలేం: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యాహు(73) శనివారం అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరారు. టెల్‌అవీవ్‌లోని షెబా ఆస్పత్రిలో నెతన్యాహుకు చికిత్స అందిస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిపింది. ఇంతకు మించి వివరాలు వెల్లడించలేదు. ఇంటి దగ్గర ఉండగా సొమ్మసిల్లి పడిపోవడంతో నెతన్యాహును ఆస్పత్రికి తీసుకెళ్లారంటూ ఇజ్రాయెల్ వార్తా వెబ్సైట్ ఒకటి పేర్కొంది. ఆయన బాగానే ఉన్నారని, ఆస్పత్రిలో నడుస్తున్నారని కూడా తెలిపింది. అయితే, ఈ వార్తలు అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. ఇజ్రాయెల్‌లో సుదీర్ఘకాలం దాదాపు 15 ఏళ్లుగా నెతన్యాహు అధికారంలో కొనసాగుతున్నారు. -
'ఉస్మానియా' నుంచి రోగుల తరలింపుపై పరిశీలన
ఉస్మానియా ఆస్పత్రి వార్డులను, అందులోని రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించేందుకు గల అవకాశాలను సర్కారు పరిశీలిస్తోంది. ఉస్మానియా ఆస్పత్రికి త్వరలో కొత్త టవర్స్‌ను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి శుక్రవారం ఉదయం నాంపల్లి ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి సౌకర్యాలు, వసతులపై అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆయన మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రిని పరిశీలించారు. సాయంత్రం ఆయన వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని పరిశీలించనున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
పరిపూర్ణం.. కోన సంబరం
ఉపాధికి మెండైన పాలి‘టెక్నిక్’
● ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లె యువకుడు మృతి ● ఒక్కగానొక్క కుమారుడి మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ● దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకారం
షోకాజ్ నోటీసులను ఉపసంహరించండి
ట్రాన్స్‌కో వర్క్ ఆర్డర్లు పూర్తి చేయాలి
కౌంటింగ్‌పై అవగాహన తప్పనిసరి
● మగబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు ● ఆస్పత్రి వద్ద ధర్నా.. పోలీసులకు ఫిర్యాదు
న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ
● మరో పదిరోజుల్లో ఓట్ల లెక్కింపు ● ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ ● జూన్ 4వ తేదీన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
వైభవం.. వసంతోత్సవం
తప్పక చదవండి
- గిరికీలు కొట్టిన హెలికాప్టర్
- విస్తృతంగా పోలీసుల తనిఖీలు
- Lok Sabha Election 2024: గురుగ్రాంలో ముక్కోణం
- Lok Sabha Election 2024: బీజేడీకి సవాల్!
- హింస పన్నాగంతోనే అధికారుల బదిలీ
- Lok Sabha Election 2024: మహిళా ఎంపీలు 9 మందే!
- ఆ పచ్చ ‘సీఐ’ పై చర్యలేవి?
- Lok Sabha Election 2024: లోక్‌సభ బరిలో ప్యాడ్ ఉమన్
- జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
- మేడిగడ్డ కింద అగాధం!
Advertisement