-
ఓటీటీల్లో ఒక్క రోజే పది సినిమాలు.. ఆ రెండే కాస్తా స్పెషల్!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. అసలే వేసవి సెలవుల కాలం. ఇక ఫ్యామీలీ అంతా సినిమా చూసేందుకు ఓటీటీలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ శుక్రవారం థియేటర్లలోనూ టిల్లు స్క్వేర్, కలియుగం పట్టణంలో లాంటి చిత్రాలు సందడి చేసేందుకు వస్తున్నాయి. మరోవైపు ఓటీటీల్లో ఏయే చిత్రాలు వస్తున్నాయోనని సినీ ప్రియులు ఆరా తీస్తున్నారు. ఈ వీకెండ్లో టాలీవుడ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్స్పెక్టర్ రిషితో పాటు అభినవ్ గోమటం నటించిన మస్తు షేడ్స్ ఉన్నాయి రా స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈ రెండు కాస్తా అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నాయి. అంతే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలు ఆసక్తికర చిత్రాలు స్ట్రీమింగ్కు రెడీ అయ్యాయి. మరి ఏయే సినిమా ఏ ఓటీటీల్లో వస్తుందో మీరు ఓ లుక్కేయండి. ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన సినిమాలివే.. అమెజాన్ ప్రైమ్ ఇన్స్పెక్టర్ రిషి (వెబ్ సిరీస్) - మార్చి 29 మస్తు షేడ్స్ ఉన్నాయి రా(టాలీవుడ్ సినిమా)- మార్చి 29 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పట్నా శుక్లా (హిందీ చిత్రం) - మార్చి 29 మధు (డాక్యుమెంటరీ) - మార్చి 29 రెనెగడె నెల్ల్ (వెబ్ సిరీస్) - మార్చి 29 ద బ్యూటిఫుల్ గేమ్ - మార్చి 29 నెట్‌ఫ్లిక్స్ ది బ్యూటిఫుల్ గేమ్ (హాలీవుడ్) - మార్చి 29 హార్ట్ ఆఫ్ ది హంటర్ (హాలీవుడ్) - మార్చి 29 ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో (హిందీ) - మార్చి 30 బుక్ మై షో ది హోల్డోవర్స్ (హాలీవుడ్) - మార్చి 29 జియో సినిమా ఎ జెంటిల్మెన్ ఇన్ మాస్క్ (వెబ్ సిరీస్) - మార్చి 29 -
ఓటీటీకి వచ్చేస్తోన్న టాలీవుడ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌తో ఇటీవల అభిమానులను అలరించిన టాలీవుడ్ నటుడు అభినవ్ గోమఠం. తన కామెడీ పంచులతో సినీ ప్రియులను అలరించారు. మహి వీ రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ సూపర్‌హిట్‌గా నిలిచింది. తాజాగా అభినవ్ హీరోగా నటించిన చిత్రం మస్తు షేడ్స్ ఉన్నయ్ రా. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 29 నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇవాళ అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’మూవీ రివ్యూ
ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెబుతా, సేవ్ టైగర్ చిత్రాల్లో కమెడియన్‌గా పాపులారిటీ సంపాందించుకుని, తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న నటుడు అభినవ్ గోమఠం. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా. వైశాలి రాజ్ హీరోయిన్. కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకపంపై తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్, సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట సినిమాపై ఆసక్తిని పెంచింది. నేడు(ఫిబ్రవరి 23) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇన్నాళ్లు కమెడియన్‌గా అందరిని నవ్వించిన అభినవ్.. హీరోగా ఏ మేరకు ఆకట్టుకున్నాడు? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. మనోహర్ అలియాస్ మను(అభినవ్ గోమఠం) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. చిన్నప్పుడే మంచి పెయింటింగ్ ఆర్టిస్ట్‌గా పేరు సంపాదించుకుంటాడు. పెద్దయ్యాక తనకు వచ్చిన కళనే వృత్తిగా మార్చుకుంటాడు. ఒక అమ్మాయితో పెళ్లి కూడా ఫిక్సవుతుంది. అయితే డబ్బులు లేవని, పెయింటింగ్ ద్వారా వచ్చే ఆదాయం సంసారానికి సరిపోదని.. పెళ్లికి ఒకరోజు ముందు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో ఆ అమ్మాయి లేచిపోతుంది. మరోవైపు మను క్లాస్మేట్, రిచ్ ఫ్యామిలీకి చెందిన రాహుల్(అలీ రెజా)..అతన్ని హేళన చేసి మాట్లాడుతాడు. దీంతో మను ఎలాగైనా బాగా సెటిల్ కావాలనుకుంటాడు. సొంత ఊళ్లోనే ఓ ఫ్లెక్సీ ఫ్రింటింగ్ షాపు పెట్టి బాగా డబ్బు సంపాదించాలనుకుంటాడు. అందుకోసం అప్పు చేసి స్నేహితుడు శివ(మొయిన్ మహ్మద్) అదేగ్రామానికి చెందిన మరొక వ్యక్తి(నిజల్ గళ్ రవి)తో సహాయంతో ఊర్లో ఫెక్సీ ఫ్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అయితే ఆదిలోనే మనుకి ఎదురుదెబ్బ తాకుతుంది. కొన్ని కారణాల వల్ల అతని బిజినెస్ మధ్యలోనే ఆగిపోతుంది. అసలు మను ప్రింటింగ్ బిజినెస్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది? పరువు కోసం మను ఆడిన ఓ అబద్దం అతన్ని ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టింది?మను బిజినెస్‌ను దెబ్బతీయాలని రాహుల్ ఎందుకు ప్రయత్నించాడు? చివరకు మను అనుకున్నట్లుగా ప్రింటింగ్ షాపు పెట్టి డబ్బులు సంపాదించాడా లేదా? ఉమాదేవి(వైశాలి రాజ్)తో మను ప్రేమ కథ సంగతేంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘మస్ట్ షేడ్స్ ఉన్నాయి రా?’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని నమ్ముకొని ముందుకు సాగితే విజయం వరిస్తుంది. కానీ చాలా మంది తమలోని టాలెంట్‌ని గుర్తించకుండా ఏవోవే ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోవడమే కాకుండా.. అసమర్థులుగా మిగిలిపోతున్నారు.అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని తెరకెక్కించిన చిత్రమే ‘మస్తు షేడ్స్ ఉన్నాయి రా’. టాలెంట్ ఉండి ఆర్థికంగా బలహీనంగా ఉన్న యువకులు పడే ఇబ్బందులు ఏంటి? ఆర్థికంగా బలంగా లేకపోతే సొంతవాళ్లతో పాటు ఇతరులు మనల్ని ఎలా చూస్తారు? తదితర అంశాలన్నీ ఈ చిత్రంలో చర్చించాడు దర్శకుడు. టాలెంట్ ఉన్నవాడికి ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎంతమంది ఇబ్బంది పెట్టినా..ఏదో ఒక రోజు పెద్ద స్థాయికి ఎదుగుతాడు అనేది ఈ సినిమా ద్వారా మరోసారి గుర్తు చేశారు. మను చిన్ననాటి ఎపిసోడ్‌తో చాలా సరదాగా కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత పెళ్లి కూతురు లేచిపోవడం.. మను గురించి ఊరంతా మాట్లాడుకోవడం.. అవమానానికి గురైన మను ఫ్లెక్సీ ఫ్రింటింగ్ పెట్టాలని నిర్ణయం తీసుకోవడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. అయితే బిజినెస్ కోసం మను చేసే ప్రయత్నాలు.. ఫోటో షాప్ నేర్చుకోవడం.. ఈక్రమంలో ఉమాదేవితో ప్రేమాయణం ఇవ్వన్నీ రోటీన్‌గా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో ఎమోషనల్‌గా.. చివరి 15 నిమిషాలు ఉత్కంఠంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం సింగిల్ పాయింట్ చుట్టే తిరగడం, ఎమోషనల్ సన్నివేశాలు సాదా సీదాగా ఉండడం మైనస్. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కి వెళ్తే ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ కొంతవరకు అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. తనదైన కామెడీ టైమింగ్‌తో మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు అభినవ్ గోమఠం. ఆయన వేసే పంచులు బాగా ఆకట్టుకుంటాయి. అయితే ఇన్నాళ్లు తెరపై చూసిన దానికి పూర్తి భిన్నంగా అభినవ్ని చూపించాడు దర్శకుడు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు మనోహర్ పాత్రలో అభినవ్ ఒదిగిపోయాడు. కమెడియన్‌గా మాత్రమే కాదు.. సీరియస్ పాత్రల్లోనూ అభినవ్ చక్కగా నటిస్తాడనేది ఈ సినిమా ద్వారా తెలియజేశాడు. ఉమాదేవిగా వైశాలి రాజ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో స్నేహితుడు శివగా మెయిన్ చక్కగా నటించాడు. తెరపై చాలా చలాకీగా కనిపిస్తాడు. రవి పాత్రకు తమిళ నటుడు నిజల్ గళ్ న్యాయం చేశాడు. తరుణ్ భాస్కర్ ఎమ్మెల్యేగా గెస్ట్ రోల్ చేశాడు. హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో లావణ్య రెడ్డి పర్వాలేదు అనిపించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నికల్‌గా ఈ సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన లాంగ్ స్పెషల్ అట్రాక్షన్. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా
"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్
మీడియాకు థ్యాంక్స్ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే?
బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!
గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..
పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..
కుందనపు బొమ్మలా ప్రియాంకా జైన్ ఫొటోలు
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
పిఠాపురం: సీఎం జగన్ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
తప్పక చదవండి
- బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement