PAMARRU
-
పామర్రు టీడీపీలో రచ్చకెక్కిన ఇసుక టెండర్ల వివాదం..
సాక్షి, కృష్ణా: ఓ వైపు మద్యం మాఫియాను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ఇసుక మాఫియాకు గేట్లు ఎత్తేసింది. ఉచితం పేరుతో ఇసుకను బంగారంలా మార్చింది చాలదన్నట్లు.. మరింతగా దోపిడీ చేసేందుకు రహస్యంగా పెద్ద స్కెచ్చే వేసింది. జనమంతా పండుగ సందడిలో ఉంటే.. సందట్లో సడేమియాలా ఇసుక రీచ్‌లను తను అనుకున్న వారికి హస్తగతం చేసింది. ఎటువంటి ఇసుక పాలసీ లేకుండానే 70 లక్షల టన్నులకంటూ 108 ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద వాటిని ఖరారు చేసేసింది.తాజాగా కృష్ణా జిల్లా పామర్రు టీడీపీలో ఇసుక టెండర్ల వివాదం రచ్చకెక్కింది. ఇసుక టెండర్ కోసం టీడీపీ నేతలు మధ్య తగాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇసుక టెంబర్ బెదిరింపు వీడియో ఒకటి కలకలం రేపుతోంది. బెనర్జీ అనే టీడీపీ నేతకు ఇసుక టెండర్ వేయొద్దంటూ ఎమ్మెల్యే వర్గం నేత సురేష్ బెదిరింపులకు పాల్పడినట్లు ఇందులో ఉంది. ఇసుక టెండర్లలో ఎవ్వరూ పాల్గొనకూడదని సురేష్ హుకుం జారీ చేశారు. ఇసుక టెండర్ వేసిన బెనర్జీని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారు. ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడించిన వీడియో లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. -
ఓటమిపై పామర్రు ఎమ్మెల్యే రియాక్షన్
-
మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్
-
ఆంధ్రప్రదేశ్‌లో మానవ వనరులపై 73 వేల కోట్ల రూపాయల మూలధన పెట్టుబడి పెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన... జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 708 కోట్ల రూపాయలు జమ...ఇంకా ఇతర అప్డేట్స్
-
పామర్రులో జగనన్న .. విద్యాదీవెన నిధుల విడుదల (ఫొటోలు)
-
CM Jagan Pamarru Meeting: జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
పెత్తందారులతో మనం క్లాస్ వార్ చేస్తున్నాం
-
అనిల్ లా ప్రతి ఎమ్మెల్యే ఉంటే... సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
పిల్లలకు మంచి చేస్తున్న మనపై చంద్రబాబు అండ్ కో యుద్ధం చేస్తుంది
-
పేద పిల్లల కోసమే ‘జగన్నాథ’ రథం: పామర్రులో సీఎం జగన్
సాక్షి,కృష్ణాజిల్లా: చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని, ఇందుకోసమే జగన్నాథ రథం కదులుతోందని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో రూ.708.68 కోట్ల ‘జగనన్న విద్యా దీవెన’ నిధులను బటన్ నొక్కి పిల్లలు, తల్లుల జాయింట్ ఖాతాల్లోకి సీఎం జగన్ విడుదల చేశారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ పెద్ద చదువులు చదువుకునేందుకు అవసరమైన పూర్తి డబ్బును పిల్లల తల్లులకు ఇచ్చి తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే కార్యక్రమమే విద్యాదీవెన అని తెలిపారు. ‘రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతున్న 93 శాతం మంది పిల్లలు 9 లక్షల 44వేల 666 మందికి జగనన్న ప్రభుత్వమే ఫీజులు కడుతోంది. ఏ పేదవాడు కూడా చదువుల కోసం అప్పులపాలు కాకూడదని మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలతో పాటు మిగిలిన కులాల వారిని స్కీమ్‌కు అర్హులుగా చేసేందుకు ఆదాయపరిమితిని 2 లక్షల దాకా పెంచాం. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగి 93 శాతం మందికి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మంచి చేయగలుగుతున్నాం. గతంలో ఇంతే ఫీజులు కడుతాం.. ఇంత కంటే ఎక్కువ కట్టం.. మీ చావులు మీరు చావండి అన్నారు. ఈ పరిస్థితిని మారుస్తూ ప్రస్తుతం త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ మూడు నెలలకు సంబంధించిన ఫీజులు తల్లుల ఖాతాలో వేస్తూ ఫీజులు కట్టిస్తున్నాం. కేవలం ఫీజులే కాకుండా వసతి దీవెన కార్యక్రమాన్ని తీసుకువచ్చి పిల్లలకు బోర్డింగ్ ఉచితంగా అందిస్తున్నాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత 57 నెలలుగా విద్యాదీవెన, వసతి దీవెన అందిస్తున్నాం. 57 నెలల్లో 29 లక్షల మందికి రూ.12 వేల కోట్లు.. అక్టోబర్,నవంబర్, డిసెంబర్ క్వార్టర్‌కు సంబంధించిన రూ.708 కోట్ల రూపాయలను తల్లుల ఖాతాలోకి ఈ వేదిక నుంచి నేరుగా పంపిస్తున్నాం. వీటితో కలుపుకుని గత 57 నెలలలో 29 లక్షల 60 వేల మందికి రూ.12వేల609 కోట్ల రూపాయలను విద్యా దీవెన కింద జమ చేశాం. జగనన్న వసతి దీవెన ద్వారా రూ.4275 కోట్లు చెల్లించాం. ఈ ఏప్రిల్‌లో విడుదల చేయనున్న నిధులను కూడా కలిపితే రెండు పథకాల మీద పెట్టిన మొత్తం రూ.18 వేల కోట్ల రూపాయలు అని చెప్పేందుకు గర్వపడుతున్నా. ఒక్క విద్యారంగంలో స్కీములకే ఐదేళ్లలో రూ.73 వేల కోట్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాథమిక స్థాయి నుంచి పెద్ద చదువుల వరకు విద్యా రంగంలో పెద్ద మార్పులు తీసుకువచ్చాం. విద్యా రంగంలో 57 నెలల కాలంలో కేవలం పథకాల మీద రూ.73 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాం. పేదరికం నుంచి బయటికి రావడానికి చదువు ఒక్కటే అస్త్రమని నమ్మి మానవ వనరుల మీద పెట్టుబడి పెడుతున్నాం. పేదింటి పిల్లలు ఇంజినీర్లు, డాక్టర్లు, పెద్ద పెద్ద కంపెనీ సీఈవోలుగా చేయాలని, పేదల తలరాతలుగా మారాలని ఈ 57 నెలల కాలంలో అడుగులు వేస్తూ వచ్చాం. మేం చేసిన మార్పుల వల్ల విద్యా విధానంలో ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రతి ఒక్కరూ గమనించాలి. 3 ఏళ్ల పిల్లల నుంచి 23 ఏళ్లలోపు పిల్లలు శతమానంభవతి అనే విధంగా మరో 100 ఏళ్లు జీవించాల్సిన జనరేషన్. ఈ జనరేషన్ పోటీపడేది ప్రపంచస్థాయిలో. గత 30 ఏళ్లలో చదువులు మారిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే సరిపోదు. ప్రస్తుతం క్వాలిటీ చదువులు కావాలి. ఇది గమనించాను కాబట్టే పెద్ద పెద్ద స్థానాల్లో పిల్లలు ఉద్యోగాలు సంపాదించే విధంగా అడుగులు వేస్తూ వచ్చాం. ఒకటవ తరగతిలో మనం వేసే విత్తనం 15 ఏళ్లలో చెట్టవుతుంది. పిల్లలకు మంచి భవిష్యత్తుండేలా పోటీ ప్రపంచంలో లీడర్లుగా ఎదగాలని కార్యక్రమాలు చేపట్టాం. ఇందులో భాగంగానే ప్రాథమిక విద్య నుంచి మొదలుపెడితే ఉన్నత చదువుల దాకా గొప్ప మార్పులు తీసుకువచ్చాం. నాడు నేడుతో ప్రభుత్వ బడులను ప్రక్షాళన చేశాం. ఇంగ్లీష్ మీడియంతో పాటు స్కూళ్లలో సీబీఎస్, ఐబీ సిలబస్ తీసుకువచ్చాం. ఇంగ్లీష్ మీడియం అంటే యుద్ధమే చేస్తున్నారు.. ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకు రావాలని ఆరాట పడితే చంద్రబాబు, రామోజీరావు, పవన్‌కళ్యాణ్‌తో యుద్ధం చేయాల్సి వస్తోంది. వీళ్లెవ్వరి పిల్లలు తెలుగు మీడియంలో చదవడం లేదు. ప్రభుత్వ బడుల్లో పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం పెడితే మాత్రం నానా యాగీ చేసి మన మీద యుద్ధమే చేస్తున్నారు. పెత్తందారులైన వారికో ధర్మమట.. మీకో ధర్మమట.. వారికో బడులట.. మనకో బడులట.. వారి పిల్లలకు ఒక చదువుట.. మనకు ఒక చదువులట.. పెత్తందారులు వారట.. పనివాళ్లం మనమట.. పరిశ్రమలు వారివట.. కార్మికులం మనమట. వారి పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు. పిల్లలకు జగన్ ట్యాబులిస్తే మాత్రం ఏవేవో చూస్తూ వారు చెడిపోతున్నారని యాగీ చేస్తారు. మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలన్న వారి మనస్తత్వానికి ఇవన్నీ నిదర్శనంగా నిలుస్తున్నాయి. విద్యారంగంలో పెత్తందారులకు పేదలకు మధ్య క్లాస్ వార్ జరుగుతోంది. డబ్బులున్నవాళ్లకు, డబ్బు లేని వాళ్లకు ఒక యుద్ధం జరగుతోంది. మీ అన్నగా మీ తరపున విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చాం. ఈ అడుగులు పడకపోతే కూలీల పిల్లలు కూలీలుగానే, పేదల పిల్లలు, పేదలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ విప్లవం, తిరుగుబాటు జరగాలి. పేద పిల్లల కోసమే జగన్నాథ రథం కదులుతోంది.. చంద్రబాబు ఆయన మనుషులు, పెత్తందారుల భావజాలాల మీద తిరుగుబాటుగానే విదేశీ విద్యాలయాల్లోని కోర్సులు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది. మూడవ తరగతిలోనే మన ప్రభుత్వ బడుల్లో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకువచ్చాం. మూడవ తరగతిలోనే టోఫెల్ ఓరియెంటేషన్ కాన్సెప్ట్ తీసుకువచ్చాం. బై లింగ్విల్ టెక్స్ట్ బుక్స్ తీసుకువచ్చాం. బైజూస్ కంటెంట్‌ను పేద పిల్లకు అందించాం. పిల్లలు డిజిటల్ యుగాన్ని శాసించాలని 8వ తరగతిలోనే పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చాం. నాడునేడుతో స్కూళ్ల రూపు రేఖలు మార్చాం. ప్రతి ఏటా అమ్మ ఒడి కింద తల్లులకు ప్రోత్సాహం కింద రూ.15వేల రూపాయలు ఇస్తున్నాం. స్కూలుకు వెళ్లే పిల్లలకు గోరుముద్ద కింత పౌష్టికాహారం అందిస్తున్నాం. ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం. ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లలు, మన కాలేజీ పిల్లలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడింది మన కళ్లతో మనమే చూశాం. ఇదంతా ఈ 57 నెలల్లోనే కనిపిస్తోంది. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ఈ 57 నెలల్లోనే వంద శాతం ఫీజులు, వసతి ఖర్చులు చెల్లిస్తున్నాం. విదేశీ యూనివర్సిటీల్లో ఒక్కొక్కరికి రూ.కోటి 25 లక్షల ఫీజు.. ప్రపంచస్థాయిలో టాప్ 50 ర్యాంకుల్లో ఉన్న 330 కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే పిల్లలకు రూ.కోటి 25 లక్షల దాకా ఫీజులు కడుతున్నాం. ఈ నాలుగేళ్ల పాలనలోనే కరిక్యులమ్‌లో మార్పులు తీసుకువచ్చి జాబ్ ఓరియెంటెడ్‌గా మార్చాం. సర్టిఫైడ్ ఆన్లైన్ కోర్సులు తీసుకువచ్చాం. చదువుల్లోకి ఏఐ, ఎంఎల్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ తీసుకువచ్చాం. మన కాలేజీల్లో డిగ్రీలు చదవడం వల్ల మనకు ఇబ్బందులు రాకూడదని సబ్జెక్ట్‌లో మార్పులు తీసుకువచ్చి ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చాం. మన కరిక్యులమ్‌లో భాగంగా ఎంఐటీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకమనిక్స్‌లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి కోర్సులు తీసుకువచ్చాం. విదేశీ విద్యాలయాల వల్లే చదువులు చెప్పి వాల్లే సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. పేదరికం సంకెళ్లను పేద పిల్లలు తెంచుకోవాలనే విద్యారంగంలో మార్పులు తీసుకువచ్చాం. దీంతో వచ్చే పది పదేహేనేళ్లలో ఎంఎన్సీలలో ఉద్యోగాలు వచ్చి బతుకులు, తలరాతలు మారతాయి. చంద్రబాబునాయుడు 14 ఏళ్లు సీఎంగా చేసి ఆయన చేసిన మంచి ఏమిటో చేయాలని ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వ బడికి చంద్రబాబు చేసిన మంచేమిటని అడిగితే ఎవరికీ ఏదీ గుర్తుకు రాదు. పేదపిల్లలు, వారి చదువుల కోసం చెబితే ఏదీ గుర్తుకు రాదు. ఆయన చేసిన చెడు మాత్రం గుర్తుకు వస్తుంది. ప్రభుత్వ బడిని నీరుగార్చింది చంద్రబాబే.. ప్రభుత్వ బడిని నీరుగార్చించి చంద్రబాబునాయుడు. తన కార్పొరేట్ సంస్థలు నారాయణ, చైతన్యలను పోషించింది చంద్రబాబునాయుడు. పిల్లలకు ప్రభుత్వ బడుల్లో ఎలాంటి ఆహారం అందుతుందో అనేదానిపై కనీసం ధ్యాస పెట్టిన పాపాన చంద్రబాబునాయుడు పోలేదు. నాడు,నేడు, అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, కరిక్యులమ్లలో మార్పులు బాబు హయాంలో ఏవీ లేవు. 14 ఏళ్లు సీఎంగా చేసినపుడు రైతులకు, గ్రామాలకు, అవ్వాతాతలకు, చదువుకుంటున్న పిల్లలకు చంద్రబాబు మంచి చేసిన పాపాన పోలేదు. ఈరోజు మారీచులతో మేం యుద్ధం చేస్తున్నాం. జగన్ అనే ఒక్కడు తప్పుకుంటే జరిగే నష్టమేమిటో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పిల్లల చదువులుండవు, ఇంఘ్లీష్ మీడియం ఉండదు. పిల్లలను పట్టించుకునే పరిస్థితే ఉండదు. ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య శ్రీ ఉండవు. వ్యవసాయం గాలికిపోతుంది. రైతన్న చిన్నాభిన్నమవుతాడు. వాళ్లు చెప్పేఅబద్ధాలను నమ్మకండి. రాబోయే రోజుల్లో ప్రతి ఒంటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తామని చెప్తారు. మీ ఇంట్లో మాత్రం ఎవరు మంచి చేశారో ఆలోచన చేయండి. మీకు మంచి జరిగి ఉంటే మీ అన్నకు తోడుగా ప్రతి ఒక్కరు సైనికుల్లా ఉండండి’ అని సీఎం జగన్ కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పామర్రు ఎమ్మెల్యే అనిల్‌కుమార్, ఉన్నతాధికారులు, కలెక్టర్ పాల్గొన్నారు. -
పామర్రులో జగనన్న విద్యాదీవెన, విద్యార్థుల్లో ఉరకలెత్తిన ఉత్సాహం (ఫొటోలు)
-
Live: పామర్రులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ
-
నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ
సాక్షి, అమరావతి/పామర్రు : రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు అక్టోబరు–డిసెంబరు–2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణాజిల్లా పామర్రులో బటన్‌నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జమచేయనున్నారు. దీంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేస్తోంది. పేద విద్యార్థులు పెద్ద చదువులకు వెళ్లాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు పూర్తి ఫీజులను క్రమం తప్పకుండా త్రైమాసికాల వారీగా చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తోంది. వీటితో పాటు భోజన, వసతి ఖర్చులకు ఇబ్బందిపడకుండా జగనన్న వసతి దీవెనను అందిస్తోంది. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున రెండు విడతల్లో జమచేస్తోంది. ఇలా విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ 57 నెలల కాలంలో రూ.72,919 కోట్లు ఖర్చుచేసింది. నేడు పామర్రుకు సీఎం వైఎస్ జగన్ రాక.. జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రజలకు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కృష్ణాజిల్లా పామర్రు రానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కనే ఉన్న సభాస్థలిని గురువారం మంత్రి జోగి రమేష్ స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. శుక్రవారం ఉ.10 గంటలకు సీఎం తాడేపల్లి నుంచి బయల్దేరి 10.30 గంటలకు పామర్రుకు చేరుకుంటారు. 10.50 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేస్తారు. సభానంతరం స్థానిక పార్టీ నేతలతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. మ.1.55కు తాడేపల్లి చేరుకుంటారు. -
సామాజిక జైత్ర యాత్ర.. జై జగన్ నినాదాలతో హోరెత్తిన పామర్రు
సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర సాగింది. మధ్యాహ్నం ప్రియా టవర్స్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం బస్సు యాత్ర ప్రారంభమైంది. భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. మంత్రులు జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, కొలుసు పార్ధసారధి, ముస్తఫా, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పాల్గొన్నారు. సాయంత్రం పామర్రు సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభలో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ, సామాజిక సాధికార యాత్ర ఎందుకు అవసరమో మనం తెలుసుకోవాలన్నారు. అనేక మంది ఉద్ధండులు సామాజిక రుగ్మతలు పోవాలని ఉద్యమాలు చేశారన్నారు. ఏపీ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరతీసిన వ్యక్తి సీఎం జగన్. కోట్లు వెచ్చించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధికి కృషి చేశారు’’ అని మంత్రి నాగార్జున పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి పోటీ చేశారు. 600కు పైగా హామీలిచ్చి మోసం చేశాడు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు.. ఎస్సీలను ఘోరంగా అవమానించాడు. పేదలకు ఆరోగ్యం,ఇంగ్లీషు మీడియం చదువు కల్పించిన మహోన్నతమైన వ్యక్తి సీఎం జగన్. చంద్రబాబును బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలెవరూ నమ్మొద్దు. సీఎం జగన్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. బీసి, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలు ఐక్యతగా ఉండాలి. సీఎంకు మనం అండగా నిలిచి.. మళ్లీ గెలిపించుకోవాలి’ అని మంత్రి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు. ఏపీలో జైత్ర యాత్ర: ఎంపీ మోపిదేవి సామాజిక సాధికారత గతంలో మాటల్లోనే విన్నాం.. కానీ సామాజిక సాధికారత అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్ అని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. సీఎంకు కృతజ్ఞతగా రాష్ట్రంలో జైత్ర యాత్ర సాగుతోంది. సీఎం కుర్చీలో దగ్గర్నుంచి మన కోసమే ఆలోచన చేసిన వ్యక్తి జగన్. సీఎం పేరు ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది. బీసీ కులాల నుంచి నలుగురిని రాజ్యసభకు పంపించారు. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా ప్రతీ ఒక్కరికీ సాధికారత దక్కింది’’ అని ఎంపీ మోపిదేవి పేర్కొన్నారు. మీది షణ్ముఖ వ్యూహమైతే.. మాది జగనన్న వ్యూహం: మంత్రి జోగి రమేష్ దేశంలో సామాజిక న్యాయం అమలు చేసిన ఏకైక సీఎం మన జగనన్న. సీఎం జగన్‌ను దించడం కోసం ఒకడు షణ్ముఖ వ్యూహం అంటాడు. ఛీటర్స్ అంతా చేరి వ్యూహం పన్నుతున్నారు. సీఎం జగన్‌కు వ్యూహాలతో పనిలేదు. జగనన్నకు ఊపిరిగా మేం ఉన్నాం.15 రోజులకోసారి టీడీపీ, జనసేన పార్టీ కార్యాలయాల్లో మీటింగ్‌లు పెట్టి ఏం సాధిస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ, కాపు సోదరుల దెబ్బకు మీరు తుడిచి పెట్టుకుపోతారు. జగనన్న కటవుట్ వేస్తేనే పామర్రు పోటెత్తింది. జగనన్న వస్తే ఆ సునామీలో మీరంతా కొట్టుకుపోతారు. మీది షణ్ముఖ వ్యూహమైతే.. మాది జగనన్న వ్యూహం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం పదవుల్లో అవకాశం కల్పించిన ఒకే ఒక్కడు జగన్. ఏపీకి 25 ఏళ్లు జగనన్నే సీఎంగా ఉంటాడు.. ఇది చరిత్ర నా ప్రాణం ఉన్నంత వరకూ సీఎం జగన్ వెంటే.. ఎమ్మెల్యే కైలే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ సీఎం జగన్ వెంటే ఉంటానని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యుల వల్లే నేను ఈ స్థాయికి ఎదిగా.. ఎప్పటికీ పామర్రు ప్రజలకు రుణపడి ఉంటా. ఎస్సీలు నీట్‌గా ఉండరన్న వ్యక్తి చంద్రబాబు.. బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు. .కానీ జగన్ మాత్రమే నా ఎస్సీ, బీసీ,మైనార్టీ అంటూ మనల్ని అక్కున చేర్చుకున్నారు.. ఊరికి ఇద్దరు బాగుపడితే చాలనుకుంటాడు చంద్రబాబు..ఊరంతా బాగుపడాలని కోరుకునేది వైఎస్ జగన్. ప్రత్యర్ధులకు కైలే మాస్ వార్నింగ్.. పామర్రు ప్రజల కోసం నేను ఎన్ని మెట్లు అయినా దిగుతా. కొందరు అనవసరంగా ఇక్కడ రాజకీయం చేయాలని చూస్తున్నారు. వంగవీటి మోహనరంగా హత్య జరిగినపుడు ఎవరు ఎక్కడ ఉద్యోగంలో ఉన్నారో నాకు తెలుసు. మీ ఇంట్లో పిల్లోడు ఏడ్చినా కైలే కారణమని చెప్పడం మానుకోండి. నేను జీతానికి పనిచేయడం లేదు. పామర్రు ప్రజలకు సేవ చేసేందుకే పనిచేస్తున్నా -
వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర.. 12వ రోజు షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. ఈరోజు(గురువారం) సామాజిక సాధికారిత బస్సుయాత్ర అనకాపల్లి, పామర్రు, కావలి నియోజకవర్గాల్లో జరుగనుంది. అనకాపల్లిలో మంత్రి అమర్నాథ్ ఆధ్వర్యంలో సాధికార యాత్ర కొనసాగనుంది. ఉదయం గం. 10:30 ని.లకు మారేడుపూడిలో యాత్ర ప్రారంభం కానుంది. మారేడుపూడి నుంచి తేగడ గ్రామం వరకూ భారీ ర్యాలీగా బస్సుయాత్ర జరుగనుంది. 11 గంటకు తేగడ గ్రామంలో జగనన్న హౌసింగ్ కాలనీని పరిశీలించనున్నారు. 12 గంటలకు తేగడలో ఏపీ మోడల్ స్కూల్ పరిశీలన, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వైఎస్సార్సీపీ నాయకులు మీడియా సమావేశం ఉంటుంది. అనంతరం తేగడ గ్రామం నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకూ భారీ బైక్ ర్యాలీ ఉండనుంది. మూడ గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కృష్ణాజిల్లా పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రియా టవర్స్ వద్ద నాయకుల ప్రెస్ మీట్.. గం. 2:30ని.లకు ప్రియా టవర్స్ వద్ద నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. గం. 3:30 ని.లకు పామర్రు సెంటర్లో బహిరంగ సభ ఉండనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మంత్రి జోగి రమేష్, ఎంపీ నందగం సురేష్ సురేష్, ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి తదితరులు పాల్గొననున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో విలేకర్ల సమావేశం ఉంటుంది. ఈ కార్యక్రమం అనంతరం ఒంగోలు బస్టాండు సెంటర్లోని అబ్దుల్ కలాం విగ్రహానికి వైఎస్సార్సీపీ నేతలు నివాళులు అర్పించనున్నారు. ఆపై దర్గాని సందర్శించి, మార్కెట్ సెంటర్ వరకూ పాదయాత్ర ఉండనుంది. సాయంత్రం గం. 4:30కి మార్కెట్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. -
మైనర్‌పై అఘాయిత్యం.. బాధిత కుటుంబానికి అండగా ఏపీ ప్రభుత్వం
సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రు మండలం నిభానుపూడికి చెందిన మైనర్ బాలిక కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. అత్యాచారానికి గురై బలన్మరణానికి పాల్పడ్డ బాలిక కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు హోంమంత్రి తానేటి వనిత, మంత్రి జోగి రమేష్, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ సోమవారం బాలిక కుటుంబాన్ని పరామర్శించి.. ప్రభుత్వం తరపున ఆమె తల్లిదండ్రులకు పదిలక్షల రూపాయల చెక్కును అందజేశారు. బాధాకరమైన ఘటనలు రాజకీయం చేయొద్దు! హోంమత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మైనర్ బాలిక అత్యాచారానికి గురవ్వడం, ఆమె చనిపోవడం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి పరిస్థితులు మరెవరికీ రాకూడదని విచారం వ్యక్తం చేశారు. ఈ కేసును పోలీసులు వేగంగా దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారని తెలిపారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, విచారణ పూర్తయ్యాక నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఇలాంటి బాధాకరమైన ఘటనలను అనవసరంగా రాజకీయం చేయొద్దని కోరారు. వేగంగా స్పందించిన సీఎం ఏ కుటుంబంలో ఇలాంటి దురృష్టకర సంఘటన జరగకూడదని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. త్వరతగతిన విచారణ పూర్తిచేసి నిందితులకు శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాలిక మృతి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించారని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పేర్కొన్నారు. వెంటనే పదిలక్షల రూపాయలు సహాయం ప్రకటించడంతో పాటు హోంమంత్రిని పంపించారని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సీఎం జగన్ ఆదేశాలిచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు, మైనర్ బాలిక కుటుంబానికి ప్రభుత్వం తరపున, స్థానిక ఎమ్మెల్యేగా తాను అండగా ఉంటామని.. నేరం చేసిన వారు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్ష పడేలా చేస్తామని తెలిపారు,. బాలిక మృతిపై సమగ్ర దర్యాప్తు పామర్రుకు బాలిక ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కృష్ణా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీకి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై వార్తా పత్రికలలో వెలువడిన కథనాలను సుమోటోగా స్వీకరించినట్టు ఆమె తెలిపారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేట్టాలని కోరారు. ఈ సందర్భంగా కేసు విచారణా వివరాలను ఎస్పీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌కు వివరించారు. సీసీటీవీ ఫుటేజ్ వివరాలను వెల్లడించారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని 15 రోజులలో చార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తామని వాసిరెడ్డి పద్మకు సీపీ తెలిపారు. నిందితులకు కరిన శిక్ష పడే వరకు విచారణ వేగవంతంగా పూర్తిచేయాలని వాసిరెడ్డి పద్మ కోరారు. కేసును చేధించిన పోలీసులు పామర్రు మండలంలో మైనర్ బాలిక మృతి కేసును పోలీసులు చేధించారు. అత్యాచారం చేయడం వల్లే అవమానంతో బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. నిమ్మకూరు హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న నిభానుపూడి గ్రామానికి చెందిన బాలిక (14)ను.. ప్రేమపేరుతో లోకేష్ (20) అనే యువకుడు దగ్గరయ్యాడు. ఈనెల 20వ తేదీన స్కూల్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బాలిక బయటకు వచ్చింది. అయితే స్కూల్‌కు వెళ్లకుండా లోకేష్‌తో ఉయ్యూరు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఉయ్యూరులోని ఓ లాడ్జిలో తన బంధువైన నరేంద్రతో కలిసి బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు లోకేష్. అత్యాచారం తర్వాత బాలికను నిభానుపూడి సమీపంలో వదిలిపెట్టాడు. అయితే అవమానం భరించలేక కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది బాలిక. అదే రోజు తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల అరెస్ట్ నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. బాలిక మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే 8 బృందాలతో దర్యాప్తు చేపట్టామన్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కాలువలో మైనర్ బాలిక మృతదేహం లభ్యమైంది. నిందితులు లోకేష్, నరేంద్ర, రాజేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల పై 376(B),376(VA),342, ఐపీసీ సెక్షన్,13 పోక్సో, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుల పై రౌడీ షీట్లు తెరుస్తామని ఎస్పీ జాషువా తెలిపారు. అతి త్వరలో ఛార్జిషీట్ నమోదు చేసి నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
తలరాత మార్చే చైతన్యదీప్తి.. గడప గడపలో నూతన శోభ!
అద్దె చెల్లించాల్సిన బాధ తప్పి సొంత ఇంట్లో ఉన్నామనే సంతోషం ఉందని నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతున్నప్పుడు చాలామంది మహిళలు చెబుతున్నారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. నూతన సంవత్సర శోభ పల్లె గడప తొక్కిందని చెప్పడానికి ఇది కేవలం ఒక ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్రంలో కోకొల్లలుగా మనకు కనిపిస్తున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగు పడటమే నిజమైన అభివృద్ధి అని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం... పాలనను ప్రజల గడప వద్దకు తీసుకెళ్లింది. సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కరోనా విపత్తు సృష్టించిన ఆర్థిక అల్లకల్లోలం నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తూనే... పేదల జీవితాలకు ఆసరాగా నిలబడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వం అందుకుంటున్న ప్రతి పథకం లోనూ ప్రజలకు ప్రస్పుటంగా కనిపిస్తోంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ప్రజల గుమ్మం ముందుకు వెళుతున్న క్రమంలో.. పేదల జీవితాల్లో వస్తున్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సొంతింటి కల నెరవేరిన అక్కాచెల్లెమ్మల కళ్లల్లో, ఎవరి మీదా ఆధార పడకుండా ఒకటో తేదీ వేకువనే అందుతున్న పెన్షన్‌తో గౌరవంగా బతుకుతున్న అవ్వాతాతల ముఖాల్లో, ఆసరా–చేయూతతో తన కాళ్ల మీద నిలబడి ఆత్మగౌరవంతో జీవిస్తున్న అక్కల ఆత్మీయ పలకరింపుల్లో, పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికి అండగా నిలిచిన ‘అమ్మఒడి’ అందుకుంటున్న చెల్లెమ్మల సంతోషంలో, అన్నం పెడుతున్న అమ్మను గౌరవించడాన్ని బాధ్యతగా తీసుకొని ఇంటి ముందుకు ప్రభుత్వం పంపించిన వాహనం నుంచి బియ్యం తీసు కుంటున్న మహిళల మోముల్లో, వ్యవసాయాన్ని పండగ చేయడానికి అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాల సేవలు అందుకుంటున్న రైతన్నల ఆనందంలో... ఒకరేమిటి... ఊరిలో అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతున్న సంతృప్తిలో కొత్త సంవత్సరం శోభ కనిపిస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో పడుతోంది. మిల్లర్లు, దళారుల బెడద లేకుండా మద్దతు ధరకు రైతులు ధాన్యం విక్రయిస్తున్నారు. ఊరికే కొత్త రూపుతెచ్చిన గ్రామ సచివాలయాలు... ప్రజల ముంగిటకు పాలనను తీసుకొచ్చి ప్రజల అవసరాలు తీర్చి వారి ముఖాల్లో సంతోషానికి కారణంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందుబాటులోకి రావడంతో నూతన సంవత్సరం శోభ ఇనుమ డిస్తోంది. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో లక్ష మందికి ఒకేసారి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగులు తమ ఇళ్లతో పాటు వారు పనిచేస్తున్న సచివాలయం పరిధిలోని ఇళ్లకూ నూతన సంవత్సరం శోభను తీసుకురావడానికి, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన సందేశాన్ని మోసుకెళ్లడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్ ఈ జనవరి 1 నుంచి రూ. 2,750 పెంచారు. పెన్షన్ పెంపుతో 64 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. రైతు భరోసాను అర కోటి మందికి పైగా రైతులకు అందిస్తున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద దాదాపు 4 లక్షల మంది అక్కాచెల్లెమ్మలు లబ్ధి పొందుతున్నారు. జగనన్న చేదోడు 3 లక్షల మందికి, జగనన్న తోడు దాదాపు 5.5 లక్షల మందికి... ఇలా చెప్పుకొంటూపోతే, పల్లె గడపలో ప్రభుత్వం నుంచి పథకాలు అందుకోని వారు ఉండరనే చెప్పాలి. అందుకే ప్రగతిపథం వైపు అడుగులేస్తున్న ప్రతి ఇంటి గడపలో నూతన సంవత్సరం శోభ కనిపిస్తోంది. చదువు ఒక్కటే పేదల తలరాత మారుస్తుందని నమ్మిన ప్రభుత్వం ఇది. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే దృఢ సంకల్పం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఉండటం వల్లే ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చి... అందులో బైజూస్ పాఠాలు అందిస్తున్నారు. ఒకప్పుడు కేవలం కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమయిన ఇలాంటివి ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో సాకారం కావడం.. రాజ్యాంగం ఇచ్చిన సమాన అవకాశాలు పొందే హక్కును రక్షించడమే. నాణ్యమైన చదువులతో పైకొస్తున్న ప్రతి విద్యార్థి.. ఒక తరం తలరాత మార్చే చైతన్యదీప్తి. ఈ వెలుగులతో కొత్త సంవత్సరం శోభ పల్లె గడప తొక్కింది. (క్లిక్ చేయండి: బాబోయ్! హ్యాండిల్ విత్ కేర్...) - కైలే అనిల్ కుమార్ ఎమ్మెల్యే, పామర్రు, కృష్ణా జిల్లా -
టెక్సాస్‌లో ముగ్గురు కృష్ణా జిల్లా వాసుల మృతి
పామర్రు : అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లా పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన తానా బోర్డు సభ్యుడు డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య వాణిశ్రీ, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. దీంతో కురుమద్దాలిలో విషాదఛాయలు నెలకొన్నాయి. కురుమద్దాలి గ్రామానికి చెందిన కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ గుంటూరు మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. ఉన్నత చదువుల నిమిత్తం 1995లో అమెరికా వెళ్లారు. చదువు అనంతరం అక్కడే వైద్యుడిగా స్థిరపడ్డారు. పీడియాట్రిక్ కార్డియో వాసు్క్యలర్ సర్జన్, అనస్తీషియాలజిస్ట్‌గా మంచి పేరుపొందారు. ఆయన భార్య వాణిశ్రీ ఐటీ ఉద్యోగి కాగా, పెద్ద కుమార్తె వైద్య విద్య, రెండో కుమార్తె 11వ తరగతి చదువుతున్నారు. కుమార్తెలు ఆదివారం కళాశాల వద్దకు వెళ్లగా, వాణిశ్రీ కారులో వారిని ఇంటికి తీసుకుని వస్తుండగా టెక్సాస్‌లోని వాలర్ కౌంటీ వద్ద వారి కారును ఓ వ్యాను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాణిశ్రీ, ఆమె ఇద్దరు కుమార్తెలు మరణించారు. భార్యాపిల్లలను కోల్పోవడంతో డాక్టర్ శ్రీనివాస్ ప్రస్తుతం షాక్‌లో ఉన్నారు. ఈ విషయం తెలిసిన కురుమద్దాలి గ్రామస్తులు విచారం వ్యక్తంచేశారు. డాక్టర్ శ్రీనివాస్ తండ్రి కొడాలి రామ్మోహన్రావు ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత విజయవాడలో స్థిరపడ్డారు. -
టీడీపీ నేతల హంగామా
సాక్షి, మచిలీపట్నం/పామర్రు/గుడివాడ టౌన్/సాక్షి ప్రతినిధి, విజయవాడ : గొడవలు సృష్టించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే వ్యూహంలో భాగంగా టీడీపీ నేతలు ఆదివారం ప్రయాణికులను, పోలీసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ బాబు ఇటీవల తీవ్ర స్థాయిలో చేసిన విమర్శలను మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని శుక్రవారం విలేకరుల సమావేశంలో ఖండించారు. ఆ విమర్శలు నచ్చకుంటే ప్రతి విమర్శలో లేక ఫిర్యాదో చేయకుండా పామర్రు, గుడివాడలో నానా హంగామా చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తదితరులు కృష్ణా జిల్లా కేంద్రమైన బందరు నుంచి తమ అనుచరులుతో గుడివాడ వెళ్లేందుకు పామర్రు చేరుకున్నారు. అక్కడ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు బోడెప్రసాద్, మాజీ ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్, టీడీపీ నేత వర్ల రామయ్య తదితరులు వారికి జత కలిసి హైడ్రామాకు తెరలేపారు. గూడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలింపు శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా పోలీసులు టీడీపీ నేతలను పామర్రు వద్ద అడ్డుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని గుడివాడ డీఎస్పీ సత్యానంద్ వారిని కోరారు. అయినా వారు ఒప్పుకోకుండా కార్లలో రహదారిపై భీష్మించుకుని కూర్చున్నారు. వాహనాల రాకపోకలకు టీడీపీ నేతలు అంతరాయం కలిగించారు. కార్ల వెలుపల ఉన్న వారు రహదారిపై నానా హంగామా చేశారు. మహిళా కార్యకర్తలు పోలీసులను నెట్టుకుంటూ రచ్చచేశారు. పోలీసులు వారందరినీ గూడూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా గుడివాడలో ఆ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ రావి వెంకటేశ్వరరావు, నేతలు కాగిత కృష్ణ ప్రసాద్, బోడె ప్రసాదు, జయమంగళం వెంకటరమణ పోలీస్‌స్టేషన్‌కు ర్యాలీగా బయలుదేరారు. మధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. పెయిడ్ ఆర్టిస్టులను తరిమికొడతాం పామర్రులో టీడీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ మండిపడ్డారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై అవాకులు, చవాకులు పేలితే టీడీపీ నాయకులు, పెయిడ్ అరిస్ట్‌లను తరిమి కొడతామని హెచ్చరించారు. సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని మండిపడ్డారు. సీఎంను ఇష్టానుసారం దుర్భాషలాడటం తప్పని తెలియదా? అని ప్రశ్నించారు. గుడివాడకు వెళ్లడానికి దమ్ము లేక పామర్రులో ప్రజలను ఇబ్బంది పెట్టడం మీ చేతగానితనమని.. డ్రామాలు, నాటకాలు మానుకోవాలని హితవు పలికారు. -
మూడేళ్ల సుపరిపాలనకు సాక్ష్యాలెన్నో!
కరోనా కష్టకాలంలో అర్ధరాత్రి అపరాత్రి ఫోను మోగితే గుండె జల్లుమనేది! కరోనా పేషెంట్లకు బెడ్లు కావాలంటూ నా నియోజక వర్గం నుంచి బాధితులు ఫోన్లు చేస్తూ ఉండేవారు. బెడ్ల కోసం ప్రభుత్వాసుపత్రికి అర్ధ రాత్రి పరుగులు తీసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వరదలా కరోనా పేషెంట్లు వస్తూ ఉన్నా... ప్రభుత్వాసుపత్రులు నిండిపోతున్నా... అదనంగా బెడ్లు ఏర్పాటు చేస్తూ... ప్రాణాలు చేతబట్టుకొని వస్తున్న పేషెంట్లను కాపాడటానికి సిబ్బంది రాత్రీ, పగలూ తేడా లేకుండా కష్టపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతరాయంగా కరోనా పేషెంట్లకు సేవలు అందడం వెనక పాలకుడు జగన్మోహన్రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి, తపన ఉన్నాయి. పాలకుడు చిత్తశుద్ధితో, నిజాయితీగా కష్టపడితే, ప్రజ లను ప్రేమిస్తే... విపత్కర పరిస్థితులను అధిగమించే శక్తి, సామర్థ్యం వ్యవస్థలకు వస్తుందని నిరూపించిన సందర్భం అది! గత ప్రభుత్వపు నిర్లక్ష్యపు జబ్బుతో చేష్టలుడిగిన ప్రభుత్వ ఆసుపత్రులకు జగన్ ముఖ్యమంత్రి కాగానే కాయకల్ప చికిత్స మొదలు పెట్టారు. ఫలితంగానే పేద ప్రజల ప్రాణాలను కరోనా విలయం నుంచి కాపాడటంలో ప్రభుత్వ ఆసుపత్రులు సఫలీకృతం అయ్యాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సరైన ప్రాధమ్యాలు గుర్తించడంలోనే సగం విజయం ఉంటుంది. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రులకు కాయకల్ప చికిత్స, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి ‘ఆరోగ్య శ్రీ’కి జవసత్వాలు కల్పించడం వంటివి సంక్షేమ పాలనకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా మూడేళ్లు పూర్తవుతోంది. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన ఫలాలు అందుకుంటున్న విషయం అనుభవంలోకి వచ్చింది. చేతిలో మంత్రదండం ఉన్నట్లుగానే ముఖ్యమంత్రి జగన్... సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథ కాలు అందిస్తున్నారు. అంతులేని చిత్తశుద్ధి, పరిమితులు లేని నిజాయితీ ఉంటే తప్ప ఇచ్చిన హామీలన్నింటినీ... కరోనా విపత్తు ఉరిమినా, తరిమినా అమలు చేయడం అసాధ్యం కాదని ప్రజలందరికీ స్పష్టంగా అవగత మయింది. పేదరికంలో అట్టడుగున ఉన్న ఆఖరి వ్యక్తి ఆకలి తీర్చే ఆత్మగౌరవ జెండానూ, అజెండానూ స్వయంగా నిర్దేశించుకొని, వాటి అమలుకు వేస్తున్న ప్రతి అడుగు లోనూ సాహసం ప్రస్ఫుటంగా ఈ మూడేళ్లుగా కనిపిస్తూనే ఉంది. పిల్లలను బడికి పంపే తల్లులకు ‘అమ్మ ఒడి’, కాడికట్టి మేడిపట్టి ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతకు అండగా ‘రైతు భరోసా’, పేద పిల్లల బంగారు భవిష్యత్‌కు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, ఇప్పటికే ఉన్నత చదువులకు వచ్చిన విద్యార్థులకు మెరుగైన ఉపాధి, నైపుణ్యా భివృద్ధికి చర్యలు, కుటుంబాన్ని పోషించుకుంటూ మరింత వేగంగా అభ్యున్నతి వైపు అక్కాచెల్లెమ్మలు అడుగులు వేయడానికి ‘వైఎస్సార్ ఆసరా’, మహిళా సాధికారతకు దారి చూపే పలు సంక్షేమ కార్యక్రమాలు... ఇవన్నీ ప్రజలను పేదరికం నుంచి బయట పడవేయడమే లక్ష్యంగా మూడేళ్ల పాలనలో అమలు చేయడం జరిగింది. ఇదే లక్ష్యంతో ‘నవరత్నాల’నూ అమలు చేశారు. కులం, మతం, పార్టీ, తన, మన... వంటి ఎలాంటి భేద భావం లేకుండా అర్హతే ప్రామా ణికంగా పథకాలు, కార్యక్రమాలు అమలు చేయడం ‘సుపరిపాలన’కు సజీవ సాక్షాలుగా నిలిచేవే. కత్తిరింపు ల్లేకుండా అర్హులెవరైనా మిగిలిపోతే వెతికి మరీ వారికి పథకాలు అందించాలంటే... ‘పాలకుడికి ఎంత విశాల హృదయం ఉండాలో కదా!’ అని మనకు అనిపించకమానదు. పేదలు, బడుగు బలహీన వర్గాల ఈతి బాధల పట్ల ఎంతో సహానుభూతి, ఒళ్లంతా కరుణ నిండి ఉంటే తప్ప... పాలనలో సానుభూతి, సహాను భూతి... ఇలాంటి వాటికి స్థానం ఉండదు. పైసా అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, అత్యంత పారదర్శకతతో నగదు బదిలీ ద్వారా మూడేళ్లలో దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల సొమ్ము పేదల ఖాతాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేశారు. ఊరికి కొత్త రూపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో మూడేళ్లలో పాతిక వేల శాశ్వత భవనాలు కొత్తగా వెలిశాయి. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు... ఇలా పలు భవనాలు ఆస్తులుగా గ్రామాల్లో మూడేళ్ల సుపరిపాలనకు నిదర్శనంగా నిలబడ్డాయి. కుగ్రా మంలో ఉన్న వారు సైతం సొంత ఊరు దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా సచివాలయాల ద్వారా సేవలు పొందుతున్నారు. వలంటీర్లు, సచివాలయాల ద్వారానే 4 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించింది. (క్లిక్: 'పల్లె' వించిన పట్టణీకరణ!) మహిళల భద్రతకు దిక్సూచిగా ‘దిశ’ నిలిచింది. ‘దిశ’ స్ఫూర్తితో దర్యాప్తు, న్యాయస్థానం విచారణలో వేగం పెరిగింది. తప్పు చేసిన వారికి కొద్ది రోజుల్లోనే శిక్షలు పడటం ఇటీవల కొన్ని కేసుల్లో చూశాం. ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగులోనూ అక్కాచెల్లెమ్మల అభ్యున్నతి, ఆర్థిక స్వావలంబన, సాధికారత తెచ్చి పెట్టాలనే లక్ష్యం ప్రస్ఫుటమవుతోంది. జనరల్ స్థానా ల్లోనూ మహిళలకు పదవులు ఇచ్చి అధికారాన్ని అప్పగించడం ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనం. జనరల్ స్థానాల్లో బీసీలకూ అవకాశం ఇచ్చి బలహీన వర్గాలను అధికారానికి దగ్గర చేర్చి సాధికారత అందించే ప్రయత్నం చరిత్రలో నిలిచి ఉండే అంశం. మూడేళ్ల సుపరిపాలనకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సాక్షులే! (క్లిక్: మూడేళ్లలో సమూల మార్పు.. కొత్త చరిత్ర!) - కైలే అనిల్‌కుమార్ వ్యాసకర్త శాసన సభ్యుడు, పామర్రు, కృష్ణా జిల్లా -
2 తలలు, 6 కాళ్ల దూడ
సాక్షి, కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా పామర్రు గ్రామంలోని యాదవపురానికి చెందిన గోపాలకృష్ణకు చెందిన చూడి గేదె 10 నెలలు అవుతున్నా ఈనక పోవడంతో పశు వైద్యుడు శశికుమార్ వద్దకు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు గేదె లోపల ఉన్న దూడ ఆకృతిలో తేడా ఉందని గుర్తించారు. పశువుకు శస్త్ర చికిత్స చేసి దూడను బయటికి తీశారు. దూడ 2 తలలు, 6 కాళ్లతో జన్మించి కొద్దిసేపటికే మృతి చెందింది. చదవండి: (కృష్ణా జిల్లాలో భారీ వర్షం.. గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం) -
ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే అనిల్ కుమార్
సాక్షి, కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ స్వచ్ఛందంగా కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నెగెటివ్ వచ్చింది. ఆయన శుక్రవారం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి పరీక్షలు చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. గత 20 రోజులుగా ప్రజల్లో నిరంతరం తిరుగుతూ నియోజకవర్గ పరిధిలోని కూచిపూడిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లకు వెళ్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకున్నానని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ తెలిపారు. ఇక శుక్రవారం కొత్తగా నమోదైన నాలుగు కేసులతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 52కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 38 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 572కు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా బారినపడి ఆంధ్రప్రదేశ్‌లో 14 మంది మరణించారు. 35 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 523 గా ఉంది. -
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు
సాక్షి, అమరావతి: ఎగువ నుంచి వస్తున్న వరద ఎంతకీ తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ముంపు ప్రాంతాలైన భుపేష్ గుప్తా నగర్, కృష్ణ లంక, బాలాజీ నగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, పేర్ని నాని పర్యటించారు. వరదల్లో చిక్కుకున్న బాధితులను వెంటనే పునారావాస ప్రాంతాలకు తరలించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు పామర్రు నియోజకవర్గంలో 9లంక గ్రామాలు పూర్తిగా జలమయ్యం అయ్యాయి. దీంతో ఆయా గ్రామాల్లో గల 4000 మంది జనాభాను పునారావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరద పెరిగే అవకాశం ఉండడంతో చర్యలను మరింత వేగవంతం చేయాలని మంత్రి అనిల్ ఆదేశించారు. వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 10 బోట్లకు పైగా సిద్ధం చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. జిల్లాలోని గని ఆత్కురలులో ఎమ్మెల్యే డా.జగన్హోహన్రావు పర్యటించారు. వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునారావాస కేంద్రాలను ఆయన పరిశీలించారు. వరద ప్రాంతాల్లో శానిటేషన్ పనులను చేపట్టాలని, ముంపులో చిక్కుకున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరిలించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. -
ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రమాదస్థాయిలో వరద
సాక్షి, విజయవాడ : ప్రమాద స్థాయికి మించి ప్రకాశం బ్యారేజ్‌కు వరదనీరు చేరుతుండటంతో సమీప పరివాహక ప్రాంతాలకు వరదముప్పు పొంచి ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీచేశారు. ఈ రాత్రికి వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అధికారుల హెచ్చరికలతో అప్రమత్తమైన పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ తోట్లవల్లూరు మండలంలో ఇప్పటికే నీటమునిగిన తోడేలు లంక గ్రామాన్ని నాటుపడవపై వెళ్లి పరిశీలించారు. గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాసాలకు వెళ్లాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. మండలంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, రెస్క్యూ టీమ్‌లను, సరిపడా సిబ్బందిని మండలానికి పంపాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. -
కృష్ణా జిల్లాలో ఐదు పంచాయతీలకు పట్టణ హోదా
సాక్షి, మచిలీపట్నం: జిల్లాలో కొత్తగా మరో ఐదు నగర పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. 20వేల జనాభాకు పైబడిన మేజర్ పంచాయతీలు త్వరలో నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నాయి. నెలాఖరులోగా ఈ మేరకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ప్రస్తుతం మూడుగా ఉన్న నగర పంచాయతీల సంఖ్య ఎనిమిదికి చేరుతుంది. జిల్లాలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, పెడన మున్సిపాలిటీలుండేవి. ఆ తర్వాత ఉయ్యూరు, తిరువూరు, నందిగామ పంచాయతీలను 2011లో నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేశారు. కాగా ఇటీవలే మచిలీపట్నం మున్సిపాలిటీని జూలై 3వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. దీంతో జిల్లాలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాల్టీలు, మూడు నగర పంచాయతీలున్నాయి. తాజాగా 20వేల జనాభా కల్గిన మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల నుంచి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో కొత్తగా మరో ఐదు మేజర్ పంచాయతీలు గ్రేడ్–3 మున్సిపాల్టీలు(నగర పంచాయతీలు) ఏర్పాటు కాబోతున్నాయి. దశాబ్దకాలంగా పెండింగ్.. దశాబ్దకాలంగా ఈ ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. 2015 మేలో అప్పటి ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదనలు కోరినా నగర పంచాయతీల ఏర్పాటు మాత్రం కార్యరూపం దాల్చలేదు. కాగా 500 జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తిస్తామన్న ప్రభుత్వం అదే దిశగా 20వేల జనాభాకు పైబడిన మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలు అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించింది. ప్రకటనలతో సరిపెట్టకుండా వెంటనే కార్యచరణలో పెట్టింది. ఐదు పంచాయతీలు ఇవే.. జిల్లాలోని అవనిగడ్డ, కైకలూరు, మైలవరం, పామర్రు, విస్సన్నపేట పంచాయతీలు నగర పంచాయతీలుగా రూపాంతరం చెందనున్నాయి. 2019 ప్రొజెక్టడ్ జనాభా లెక్కల ప్రకారం అవనిగడ్డ పంచాయతీ జనాభా 27,298, కైకలూరులో 24,486, మైలవరంలో 25027, పామర్రులో 24,604, విస్సన్నపేటలో 20,530 మంది జనాభా ఉన్నారు. ఈ లెక్కన చుట్టుపక్కల పంచాయతీలు, గ్రామాలను విలీనం చేయకుండానే ఈ ఐదు పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసే వీలుంది. అయితే అవనిగడ్డ నగర పంచాయతీలోకి పులిగడ్డ, రామకోటిపురం పంచాయతీలతో పాటు వేకనూరు పంచాయతీ పరిధిలోని గుడివాకవారిపాలెంలను విలీనం చేయాలని ప్రతిపాదన ఉంది. అలాగే మైలవరం నగర పంచాయతీలోకి వేల్వాడు, పామర్రు నగర పంచాయతీలోకి కనువూరు, కురుమద్దాలి, విస్సన్నపేట నగర పంచాయతీలోకి చండ్రుపట్ల, పాతగుంట్ల పంచాయతీలు విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉంది. చుట్టుపక్కల పంచాయతీలు, గ్రామాల విలీనం చేసినా చేయకున్నా ప్రతిపాదిత ఐదు మేజర్ పంచాయతీలకు పట్టణ హోదా పొందనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ప్రతిపాదనలు రాగానే వాటిని కేబినెట్లో పెట్టి ఆమోద ముద్ర వేయడం.. నగర పంచాయతీల ప్రకటించడం లాంఛనమే కానుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు జూలై 31వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ పరిపాలనా శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఐదు మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపిస్తున్నాం. – జి.రవీందర్, జిల్లా పంచాయతీ అధికారి