telugu students
-
ఐక్యరాజ్యసమితికి తెలుగు యువ ప్రతిభ
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో రాబోయే డిసెంబర్లో జరిగే 8వ వార్షిక 1ఎమ్1బి (1మిలియన్ ఫర్ 1బిలియన్) యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొనడానికి తెలంగాణలోని వివిధ కాలేజీలకు చెందిన ఐదుగురు యువ ఆవిష్కర్తలు ఎంపికయ్యారు. వీరిలో నలుగురు అమ్మాయిలు– నారాయణం భవ్య, పెమ్మసాని లిఖిత చౌదరి, సత్యవతి కోలపల్లి, మనల్ మునీర్ కాగా మరొకరు మీత్కుమార్ షా ఉన్నారు. వీరి ఆవిష్కరణలకు ‘1ఎమ్1బి గ్రీన్స్కిల్స్ అకాడమీ’ వేదికయ్యింది. ఐదు నెలలపాటు సాగిన ఈ ప్ర్రక్రియలో 200 మంది పాల్గొనగా ఐదుగురు తెలుగు విద్యార్థులు ఎంపికై యువ ప్రతిభ కు ప్రేరణగా నిలిచారు.పట్టణ సవాళ్ల పరిష్కారం‘మానిఫెస్టింగ్ మ్యాన్ హోల్స్’ పేరుతో పట్టణ వరదలు, సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగాప్రాజెక్ట్ను ఆవిష్కరించాను. భారతీయ నగరాల్లో మౌలిక సదుపాయాల భద్రతను కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. – నారాయణం భవ్యటెక్.. టూర్‘ఇంటెలినెక్సా’ అనే నాప్రాజెక్ట్ ఎకో–టూరిజంను ఏఆర్, వీఆర్, ఏఐల ద్వారా మార్చేందుకుæవీలుగా ఫీచర్లను అందిస్తోంది. వైల్డ్ లైఫ్ ట్రైల్స్, వీఆర్ అడ్వెంచర్స్, ఎకో కెరీర్ గైడ్స్, ఎకో డైరీస్ ద్వారా మనప్రాంతాల పట్ల సమాజానికి అవగాహన కల్పించడం, గ్లోబల్ ఫోరమ్‌లపై ప్రభావం చూపడమే లక్ష్యంగా దీనిని ఆవిష్కరించాను.– మనల్ మునీర్లక్ష్యానికి మార్గం‘అప్నా ఇంటర్వ్యూ క్రాకర్’ అనే నాప్రాజెక్ట్ మార్కెట్ ట్రెండ్లు, పోర్ట్‌ఫోలియో క్రియేషన్, ఎటిఎస్ రెజ్యూమ్ టెంప్లేట్లు, ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్ లను అందించే ఒక వేదిక. దీని ద్వారా ఎంతోమంది తమ లక్ష్యాలు చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. – మీత్ కుమార్ షావిద్యార్థులకు ప్రాక్టికల్ స్కిల్స్‘టెక్.వెసాలియస్’ అనే నాప్రాజెక్ట్ లక్ష్యం అనాటమీ విద్యలో ఎఆర్/విఆర్ సాంకేతికత ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకురావడం. విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేలా, వారిలోప్రాక్టికల్ స్కిల్స్ పెంపొందించడమే ఈ ఆవిష్కరణ లక్ష్యం. – పెమ్మసాని లిఖిత చౌదరివాస్తవ అనుభూతినారు పోషణలో ఏఐ సాధనాలు, మెటా స్పార్క్ స్టూడియోని ఉపయోగించుకొని వాస్తవ అనుభూతిని ఎలా పొందవచ్చో నాప్రాజెక్ట్ పరిచయం చేస్తుంది. అంతేకాదు కెమెరా ట్రాకింగ్ ద్వారా వినియోగదారులకు వారి మొక్కలను సేంద్రీయంగా, వేగంగా ఎలా పెంచాలనే దానిపై లింక్‌లు, మార్గదర్శకాలను అందిస్తుంది. మొక్కల పెంపకంపై రూపొందించిన ప్రాజెక్ట్ ఇది. – సత్యవతి కోలపల్లి -
అడ్వాన్స్‌డ్‌లో ఏపీ మెరుపులు
సాక్షి, అమరావతి : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో టాప్–10లో నలుగురు ఏపీ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రానికి చెందిన వాళ్లే ఉన్నారు. మొత్తంగా అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 12 వేల మంది వరకు ఉన్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్‌కు చెందిన భోగలపల్లి సందేశ్ 360కి గాను 338 మార్కులతో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అనంతపురం జిల్లాకు చెందిన పుట్టి కుశాల్ కుమార్ 334 మార్కులతో 5వ ర్యాంకు, కర్నూలు జిల్లాకు చెందిన కోడూరు తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అల్లడబోయిన ఎస్‌ఎస్‌డీబీ సిద్విక్ సుహాస్ 329 మార్కులతో 10వ ర్యాంకుతో మెరిశారు. ఏపీకి చెందిన మత బాలాదిత్య (ఐఐటీ భువనేశ్వర్ జోన్)కు 11వ ర్యాంకు రాగా, ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్‌గా ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి 355 మార్కులతో సత్తా చాటాడు. తొలి పది ర్యాంకుల్లో ఐఐటీ రూర్కీ జోన్‌కు ఒకటి, ఐఐటీ ఢిల్లీ జోన్‌కు రెండు, ఐఐటీ బాంబే జోన్‌కు మూడు, అత్యధికంగా ఐఐటీ మద్రాస్ జోన్‌కు నాలుగు ర్యాంకులు దక్కడం విశేషం. ఇక ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేష్ కుమార్ పటేల్ జాతీయ స్థాయిలో 332 మార్కులతో 7వ ర్యాంకు సాధించడమే కాకుండా బాలికల విభాగంలో టాపర్‌గా నిలిచింది. గతేడాది తొలి పది స్థానాల్లో ఆరుగురు హైదరాబాద్ జోన్‌కు చెందిన విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఆ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. పెరిగిన ఉత్తీర్ణత దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఏటా 2.50 లక్షల మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది 1,86,584 లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,80,200 మంది పరీక్షకు హాజరవ్వగా 48,248 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇది 2023లో 43,773గా ఉంది. అడ్వాన్స్డ్ ఉత్తీర్ణతలో బాలికల సంఖ్య కూడా పెరిగింది. 2023లో 7,509 మంది ఉంటే తాజాగా 7,964 మంది ఉత్తీర్ణులయ్యారు. 331 మంది ఓవర్సీస్ ఇండియన్స్ పరీక్ష రాస్తే 179 మంది, 158 విదేశీ విద్యార్థులు పరీక్షకు హాజరైతే కేవలం 7 మంది మాత్రమే అర్హత సాధించడం గమనార్హం.నేటి నుంచి జోసా కౌన్సెలింగ్ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్‌ఐటీలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం (నేడు) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులకు అవగాహన నిమిత్తం 17వ తేదీ వరకు మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. మొత్తం ఐదు దశల్లో కౌన్సెలింగ్‌ను పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పిస్తోంది. అనంతరం 20న తొలి దశ, 27న రెండో దశ, జూలై 4న మూడో దశ, జూలై 10న నాల్గవ దశ, జూలై 17న తుది విడత సీట్లను కేటాయించనుంది. జూలై 23న మిగిలిన సీట్లు ఉంటే వాటికి కూడా కౌన్సెలింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది.నా లక్ష్యం ఐఏఎస్మాది నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్ గ్రామం. అమ్మ వి.రాజేశ్వరి, నాన్న బి.రామ సుబ్బారెడ్డి.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 10/10 పాయింట్లు వచ్చాయి. ఇంటర్లో 987 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్‌లో 99.99 పర్సెంటెల్‌తో ఆల్ ఇండియా లెవెల్లో 252వ ర్యాంకు వచ్చింది. జెఈఈ అడ్వాన్స్‌డ్‌లో 368 మార్కులకు 338 వచ్చాయి. ఓపెన్ క్యాటగిరీలో ఆలిండియాలో 3వ ర్యాంక్, సౌత్ ఇండియాలో మొదటి ర్యాంక్ రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి. ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివి, సివిల్స్ పరీక్ష రాసి ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. – బొగ్గులపల్లి సందేశ్, 3వ ర్యాంకు ముందస్తు ప్రణాళికతో చదివా మాది కర్నూలు జిల్లా కృష్ణగిరి గ్రామం. అమ్మానాన్నలు కృష్ణవేణి, శేఖర్.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 570, ఇంటర్లో 981 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా లెవెల్లో 83వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా లెవెల్లో 8వ ర్యాంకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఐఐటీ ముంబైలో సీఎస్ఈ చదవాలని ఉంది. ముందస్తు ప్రణాళికతో చదవడం వల్లే ఉత్తమ ర్యాంకు సాధించాను. – కె.తేజేశ్వర్, 8వ ర్యాంకుపెరిగిన కటాఫ్ మార్కులుజేఈఈ అడ్వాన్స్డ్ అర్హులుగా పరిగణనలోకి తీసుకునేందుకు ఈసారి కటాఫ్ మార్కులు పెరిగాయి. గతేడాది జనరల్ ర్యాంకు కటాఫ్ 86 ఉండగా ఇప్పుడు 109కి పెరిగింది. ఓబీసీ 98, ఈడబ్ల్యూఎస్ 98, ఎస్సీ, ఎస్టీ, వివిధ పీడబ్ల్యూడీ విభాగాల్లో 54గా ఉండటం గమనార్హం. 2017 తర్వాత భారీ స్థాయిలో కటాఫ్ మార్కులు పెరిగాయి. సత్తా చాటిన లారీ డ్రైవర్ కుమారుడునరసన్నపేట: ఒక సాధారణ లారీ డ్రైవర్ కుమారుడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో 803వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 118 వ ర్యాంకు సాధించాడు. నరసన్నపేట మండలం దూకులపాడుకు చెందిన అల్లు ప్రసాదరావు కుమారుడు రామలింగన్నాయుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అదరగొట్టాడు. పేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి మొదటి నుంచి పట్టుదలతో చదివేవాడు. ఆరో తరగతి నుంచి వెన్నెలవలస నవోదయలో చదువుకున్నాడు. తండ్రి ప్రసాదరావు లారీ డ్రైవర్ అయినప్పటికీ, కుమారుడికి చదువుపై ఉన్న మక్కువను గుర్తించి ప్రోత్సహించారు. విద్యార్థి తల్లి సుగుణ గృహిణి. కోర్సు పూర్తి చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతానని రామలింగన్నాయుడు తెలిపారు. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మనోళ్ల మెరుపులు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో తెలుగు విద్యార్థులు ఈసారి కూడా సత్తా చాటారు. తొలి పది ర్యాంకుల్లో నాలుగింటిని తెలుగు విద్యార్థులే కైవసం చేసుకున్నారు. టాప్ వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రాల వారేకావడం గమనార్హం. మొత్తంగా అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 12 వేల మంది వరకు ఉన్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశాల కోసం గత నెల 26న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.ఈ పరీక్షలను నిర్వహించిన మద్రాస్ ఐఐటీ ఆదివారం ఫలితాలను వెల్లడించింది. 48,248 మందికి అర్హత: జేఈఈ మెయిన్స్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని ఎంపిక చేశారు.వారిలో 1,86,584 మంది అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 1,80,200 మంది పరీక్ష రాశారు. వీరిలో దేశవ్యాప్తంగా 48,248 మంది అర్హత సాధించారు. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి 360 మార్కులకుగాను 355 మార్కులతో జాతీయ టాపర్‌గా నిలిచారు.అదే జోన్‌కు చెందిన ఆదిత్య రెండో ప్లేస్‌లో నిలిచారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన భోగలపల్లి సందేశ్ 338 మార్కులతో మూడో ర్యాంకు, పుట్టి కౌశల్‌కుమార్ 334 మార్కులతో 5వ ర్యాంకు, కోడూరు తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు, అల్లాడబోయిన ఎస్‌ఎస్‌డిబి సిద్విక్ సుహాస్ 329 మార్కులతో పదో ర్యాంకు సాధించారు. పెరిగిన కటాఫ్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత కోసం పరిగణనలోకి తీసుకునే కటాఫ్ పర్సంటైల్ ఈసారి పెరిగింది. జనరల్ కేటగిరీలో 2022లో 88.4 పర్సంటైల్ కటాఫ్ అయితే, 2023లో ఇది 90.7గా ఉంది. తాజాగా కటాఫ్ 93.2 పర్సంటైల్‌కు చేరింది. ఓపెన్ కేటగిరీలో కటాఫ్ మార్కులు 109గా, రిజర్వేషన్ కేటగిరీలో 54 మార్కులుగా నిర్ధారించారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ప్రతీ సబ్జెక్టులో కనీసం 8.68 శాతం, మొత్తంగా 30.34 శాతం మార్కులతో ర్యాంకుల జాబితాలోకి వెళ్లారు. ఇక ఈసారి అర్హుల సంఖ్య కూడా పెరిగింది. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో 43,773 అర్హత సాధించగా.. ఈసారి 48,248 మంది అర్హత సాధించారు. జోసా కౌన్సెలింగ్ షురూ ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్‌ఐటీలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులకు అవగాహన నిమిత్తం 17వ తేదీ వరకు మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. మొత్తం ఐదు దశల్లో కౌన్సెలింగ్‌ను పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల ఎంపిక మొదలవుతాయి. 20న తొలి దశ, 27న రెండో దశ, జూలై 4న మూడో దశ, జూలై 10న నాలుగో దశ, జూలై 17న తుది విడత సీట్లను కేటాయించనుంది.మిగిలిన సీట్లు ఏవైనా ఉంటే వాటికి జూలై 23న కౌన్సెలింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది. అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో, జేఈఈ ర్యాంకు ఆధారంగా ఇతర కేంద్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. దేశంలోని 121 విద్యా సంస్థలు ఈసారి జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. గత ఏడాది వీటి సంఖ్య 114 మాత్రమే. 2023–24 విద్యా సంవత్సరంలో దేశంలోని 23 ఐఐటీల్లో 17,385 సీట్లున్నాయి. ఈ సంవత్సరం వీటి సంఖ్య పెరగవచ్చని ఆశిస్తున్నారు. -
ఎవరు..ఎప్పుడు దాడి చేస్తారో..!
సాక్షి, హైదరాబాద్: ఐదు రోజులుగా తెలుగు విద్యార్థులు కిర్గిస్తాన్‌లో భయం నీడన కాలం వెళ్లదీస్తున్నారు. అక్కడి ఓ యూనివర్సిటీలో విద్యార్థిని వేధించిన విషయంలో తలెత్తిన వివాదం అక్కడి స్థానికులు, విదేశీయుల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ లక్ష్యంగా జరుగుతున్న దాడులతో తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హౌస్అరెస్టులో తెలుగు విద్యార్థులకు నిత్యావసరాలు కూడా దొరకడం లేదు. అక్కడి భారత రాయబార కార్యాలయం పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు స్పందించి, తక్షణం తమను అక్కడ నుంచి రెస్క్యూ చేయాలంటూ కొందరు తెలుగు విద్యార్థులు ‘సాక్షి’తో ఫోన్ ద్వారా వాపోయారు. పేర్లు గోప్యంగా ఉంచాలంటూ అక్కడి ఎంబీబీఎస్ విద్యార్థులు అనేక విషయాలు చెప్పారు. వివరాలు వారి మాటల్లోనే.... అనుమానంగా చూస్తున్నారు... ఓ యువతి విషయంలో కిర్గిస్, ఈజిప్ట్ విద్యార్థుల మధ్య మే 13న గొడవ జరిగింది. 18, 19 తేదీల్లో తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. ఇందులో పాకిస్తాన్, భారత్, బంగ్లా, ఈజిప్ట్ దేశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ విద్యార్థులు చాలామంది వెళ్లిపోయారు. అక్కడి స్థానికులు తెలుగు విద్యార్థులను అనుమానంగా చూస్తున్నారు. దీంతో ఎప్పుడైనా మాపై దాడి జరగొచ్చని భయాందోళనల మధ్య బతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్ నంబరు విద్యార్థులకు ఇచ్చింది. కాల్ చేస్తే పూర్తిస్థాయిలో స్పందన ఉండట్లేదు. కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు సహకారం అందిస్తోంది. తెలుగు విద్యార్థులను ఐదు రోజులుగా బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కళాశాల యాజమాన్యం నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఇలా దాదాపు 700 మంది తెలుగు విద్యార్థులు అక్కడ బతుకెళ్లదీస్తున్నారు. భారత ఎంబసీతో మాట్లాడితే పరిస్థితులు బాగానే ఉన్నాయి అని అంటున్నారు. బయటకు వెళితే మాత్రం ఎవరు...ఎక్కడ దాడి చేస్తారో అన్న భయం విద్యార్థులను వెంటాడుతోంది. తమ ఉనికి బయటపడకుండా ఉండటానికి విద్యార్థులు తమ హాస్టల్లో లైట్లు ఆఫ్ చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌కు చెందినవారు మాత్రం వారి దేశానికి వెళ్లిపోయారు. తెలుగు విద్యార్థులు విమాన టికెట్లు బుక్ చేసుకుందామని ప్రయత్నిస్తే లభించట్లేదు. కిర్గిస్తాన్‌లో చోటు చేసుకున్న ఘటనలపై భారతీయ విద్యార్థుల భద్రతపై చొరవ తీసుకోవాలని జీవీకే ఎడ్యుటెక్ డైరెక్టర్ విద్యాకుమార్ బుధవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మవద్దని ఈ సందర్భంగా కేంద్రమంత్రి చెప్పారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే భారత రాయబార కార్యాలయ హెల్ఫ్‌లైన్ నంబర్ 0555710041కు ఫోన్ చేసిసంప్రదించాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక విమానం వేయాలి ఇక్కడ బయట తిరగొద్దు అంటున్నారు. లాక్డౌన్ నాటి రోజులు మళ్లీ కనిపిస్తున్నాయి. మా కళాశాలలో భారతీయ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కళాశాల యాజమాన్యం మాకు ఆహారం, నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి. ఇంటికి వెళ్లిపోతామంటున్న వారిని వెళ్లిపోండి అంటున్నారు. విద్యాసంవత్సరం చివరికు వచ్చింది. జూలైలో ఇంటికి రావడానికి టికెట్లు బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంటికి రావాలన్నా టికెట్లు దొరకడం లేదు. ఉన్నవాట్లో నాలుగు రెట్లు చార్జీలు పెంచారు. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రత్యేక విమానం వేయడం లేదా, విమానాల సంఖ్య పెంచి, చార్జీలు తగ్గించాలి. – రాధ, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అడుగు బయట పెట్టాలంటే భయం.. కళాశాలలకు సెలవులు ఇచ్చారు. రూంలోనే ఉంటున్నాం. అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టేవారు. భయంభయంగా ఉండేది. బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. మా కుటుంబసభ్యులు భయపడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేస్తున్నారు. ఇండియన్ ఎంబసీతో అంతా తప్పుడు సమాచారం ఇస్తోంది. అంతా బాగుంది అంటున్నారు. బయటకు వెళితే ఏ వైపు నుంచి ఎవరు దాడి చేస్తారో అని భయమేస్తోంది. మాకు పరీక్షలు దగ్గర పడ్డాయి. మాదగ్గర తెలుగు రా్రష్తాల నుంచి 800 మంది విద్యార్థులు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నెల రోజుల్లో డిగ్రీ పట్టా వస్తుందనుకుంటే ఇప్పుడు మానసిక ఆందోళన మొదలైంది. విమానాశ్రయంలో బాంబు ఉందంటూ బెదిరింపులు రావడంతో ఎవ్వరినీ రానీయడం లేదు. – ఉషారాణి, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని -
మెయిన్‌లోనూ మనోళ్లు టాప్ గేర్‌లో
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్)లో ఈ ఏడాది కూడా తెలుగు విద్యార్థుల హవా కొనసాగింది. మొదటి 11 జాతీయ ర్యాంకుల్లో మూడింటిని తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన హందేకర్ విదిత్ ఐదో ర్యాంకు, ముత్తవరపు అనూప్ 6వ ర్యాంకు, వెంకట సాయితేజ మాదినేని 7వ ర్యాంకు దక్కించుకున్నారు. అలాగే, దేశంలో 56 మందికి వందశాతం పర్సంటైల్ వస్తే, వీరిలో 22 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులున్నారు. అందులో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది అర్హత సాధించగా, తెలుగు రాష్ట్రాల నుంచి 49,532 మంది ఆ జాబితాలో ఉన్నారు. జేఈఈ మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి, ఏప్రిల్‌లో రెండు సెషన్లుగా నిర్వహించింది. ఈ రెండు సెషన్లకు కలిపి 9,24,636 మంది దరఖాస్తు చేస్తే, 8,22,899 మంది పరీక్ష రాశారు. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి వెల్లడించింది. కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు, తుది మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఫలితాల్లో మూడో స్థానంలో తెలంగాణజేఈఈ మెయిన్‌లో అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన 2,50,284 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్టు ఎన్టీఏ ప్రకటించింది. వీరిలో ఉత్తరప్రదేశ్ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ నిలిచాయి. ఈ ఏడాది ఎక్కువ మంది జేఈఈ మెయిన్ రాయడంతో అన్ని కేటగిరీల్లో గత ఏడాదితో పోలిస్తే కటాఫ్ పెరిగింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుముతో మే 10 వరకు గడువు ఉంది. మే 17 నుంచి 26 మధ్య అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి. మే 26న అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తారు. ఫలితాలను జూన్ రెండో వారంలో విడుదల చేయనున్నట్టు సమాచారం. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ ద్వారా ఎన్ఐటీల్లో దాదాపు 24 వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్ ఐటీల్లో మరో 16వేల సీట్లను భర్తీ చేస్తారు. వంద పర్సంటైల్ సాధించిన తెలుగు విద్యార్థులు.. వారి ర్యాంకులుతెలంగాణ: హందేకర్ విదిత్(5), ముత్తవరపు అనూప్(6), వెంకట సాయితేజ మాదినేని(7), రెడ్డి అనిల్(9), రోహన్ సాయిబాబా(12), శ్రీయాశస్ మోహన్ కల్లూరి(13), కేసం చెన్నబసవరెడ్డి(14), మురికినాటి సాయి దివ్య తేజరెడ్డి(15), రిషి శేఖర్ శుక్లా(19), తవ్వ దినేశ్ రెడ్డి(24), గంగ శ్రేయాస్(35), పొలిశెట్టి రితిష్ బాలాజీ(39), తమటం జయదేవ్ రెడ్డి(43), మావూరు జస్విత్(49), దొరిసాల శ్రీనివాసరెడ్డి (52). ఆంధ్రప్రదేశ్: చింటు సతీష్ కుమార్ (8), షేక్ సూరజ్ (17), మాకినేని జిష్ణు సాయి(18), తోటంశెట్టి నిఖిలేష్(20), అన్నరెడ్డి వెంకట తనిష్ రెడ్డి(21), తోట సాయికార్తీక్ (23), మురసాని సాయి యశ్వంత్ రెడ్డి(36). ♦ ఈడబ్యూఎస్ విభాగంలో తొలి 6 స్థానాల్లో ఇద్దరు ఆంధ్రా, నలుగురు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన కేసం చెన్నబసవరెడ్డి మొదటిస్థానంలో నిలవగా, తోటంశెట్టి నిఖిలేష్ మూడో స్థానంలో నిలిచాడు.♦ తెలంగాణ నుంచి ఓబీసీ కోటాలో మరువూరి జస్వంత్ వందశాతం, ఎస్టీ కోటాలో జగన్నాధం మోహిత్ 99 శాతం పర్సంటైల్ సాధించారు. పీడబ్ల్యూడీ కోటాలో చుంకిచర్ల శ్రీచరణ్ జాతీయ ర్యాంకర్‌గా నిలిచారు. ఐఐటీ–బాంబేలో చదవాలనుంది: హందేకర్ విదిత్జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. మా తండ్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, తల్లి ప్రభుత్వ టీచర్. వారి చేయూతతోనే నేను ముందుకెళ్లాను. నాకు ఐఐటీ–బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవాలని ఉంది. ఆ తర్వాత స్టార్టప్ పెట్టి పదిమందికి ఉపాధి కల్పించాలన్నది నా ఆశయం. క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికబద్ధమైన ప్రిపరేషన్‌తోనే ఈ ర్యాంకు సాధించాను. -
విషాదం: స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
విదేశాల్లో ఉన్నత చదువులకోసం వెళ్లిన భారతీయ విద్యార్థుల వరుస మరణాలు తల్లిదండ్రులకు తీరని కడుపుశోకాన్ని మిగుల్చుతోంది. తాజాగా స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రదేశంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయారు. బుధవారం సాయంత్రం జరిగిన దురదృష్టకర సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మునిగిపోయారని వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని లండన్‌లోని భారత హైకమిషన్ ప్రతినిధి వెల్లడించారు. వీరిని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్న చాణక్య బొలిశెట్టి (22), జితేంద్రనాథ్ కరుటూరి (27)గా గుర్తించారు. వాటర్‌ఫాల్స్‌కు పాపులర్ అయిన లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం వద్ద వీరిద్దరూ దుర్మరణం పాలయ్యారు. అత్యవసర సేవల ద్వారా ఇద్దరి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. డూండీ యూనివర్సిటీలో చదువుతున్న నలుగురు స్నేహితులు ట్రెక్కింగ్ చేస్తుండగా, ప్రమాద వశాత్తూ ఇద్దరు నీటిలో పడి మునిగిపోయారు. దీంతో మిగిలిన ఇద్దరు విద్యార్థులు ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి. (అమెరికా : ఆ ఇద్దరు తప్పు చేశారా? చేతివాటమా?) కాగా భారత కాన్సులేట్ జనరల్ విద్యార్థుల కుటుంబాలకు సమాచారం అందించింది వారికి తగిన సహాయాన్ని అందిస్తోంది. అలాగే ఒక కాన్సులర్ అధికారి బ్రిటన్‌లో నివసిస్తున్న విద్యార్థి బంధువును కలిశారు. అటు డూండీ విశ్వవిద్యాలయం కూడా తగిన సాయాన్ని హామీ ఇచ్చింది. పోస్ట్‌మార్టం అనంతరం వారి మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు -
సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు
-
మహాబలిపురం బీచ్‌లో తెలుగు విద్యార్థుల గల్లంతు
చిత్తూరు, సాక్షి: తమిళనాడు మహాబలిపురం బీచ్ వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొంది. ముగ్గురు తెలుగు విద్యార్థులు సముద్రంలో గల్లంతు అయ్యారు. దీంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. ఈ ముగ్గురూ చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కాలేజ్‌లో చదివే విద్యార్థులుగా తెలుస్తోంది. కాలేజీ తరఫున తమిళనాడు టూర్‌కి వెళ్లింది 18 మంది విద్యార్థుల బృందం. సరదాగా ఈత కోసం సముద్రంలో దిగారు విద్యార్థులు. ఇందులో మౌనిష్, విజయ్, ప్రభు అనే ముగ్గురు ఒక్కసారిగా గల్లంతైనట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురి స్వస్థలాలు.. మౌనిష్-బంగారుపాలెం, విజయ్- సదుం, ప్రభు-పులిచెర్ల గ్రామంగా తెలుస్తోంది. విద్యార్థుల గల్లంతు సమాచారంతో తల్లిదండ్రుల్లో..బంధువుల్లో ఆందోళన నెలకొంది. -
జేఈఈ మెయిన్స్‌లో తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్/జహీరాబాద్ టౌన్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన తొలి విడత ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్–1)లో తెలుగు విద్యార్థులు ఈ ఏడాది కూడా సత్తా చాటారు. ఫలితాలను ఎన్టీఏ మంగళవారం వెల్లడించింది. తెలంగాణకు చెందిన రిషి శేఖర్ శుక్లా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్ సూరజ్ సహా పదిమంది వంద శాతం స్కోర్‌ను సాధించారు. వీరిలో తెలంగాణ విద్యార్థులు ఏడుగురు, ఏపీకి చెందిన ముగ్గురున్నారు. మొత్తమ్మీద టాప్–23లో పది మంది తెలుగు విద్యార్థులు చోటు దక్కించుకోవడం విశేషం. హరియాణాకు చెందిన ఆరవ్ భట్ దేశంలో టాపర్‌గా నిలిచారు. దేశవ్యాప్తంగా 291 నగరాల్లో 544 కేంద్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే. తొలి విడత మెయిన్స్‌కు 12,21,624 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 11,70,048 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిదశలో కేవలం స్కోరు మాత్రమే ప్రకటించారు. రెండో దశ జేఈఈ మెయిన్స్ పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఆ తరువాత ఫలితాలతో కలిపి రెండింటికి ర్యాంకులను ప్రకటిస్తారు. 300కు 300 మార్కులు జేఈఈ మెయిన్స్ 300 మార్కులకు 300 మార్కులు సాధించిన మొదటి 23 మంది వివరాలను ఎన్టీఏ వెల్లడించింది. 100 శాతం సాధించిన వారిలో తెలంగాణ విద్యార్థులు రిషి శేఖర్ శుక్లా, రోహన్ సాయి పబ్బా, ముత్తవరపు అనూప్, హందేకర్ విదిత్, వెంకట సాయితేజ మాదినేని, శ్రీయషాస్ మోహన్ కల్లూరి, తవ్వా దినేష్ రెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి షేక్ సూరజ్, తోట సాయి కార్తీక్, అన్నారెడ్డి వెంకట తనిష్ రెడ్డి ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో తెలంగాణకు చెందిన శ్రీ సూర్యవర్మ దాట్ల, దొరిసాల శ్రీనివాసరెడ్డి 99.99 స్కోర్‌తో టాపర్లుగా నిలిచారు. పీడబ్ల్యూడీ కోటాలో తెలంగాణకు చెందిన చుంచుకల్ల శ్రీచరణ్ 99.98 స్కోర్‌తో టాపర్‌గా నిలిచారు. పురుషుల కేటగిరీలోనూ పదిమంది తెలుగు విద్యార్థులే టాపర్లుగా నిలిచారు. కష్టపడితే అసాధ్యమనేది ఉండదు: హందేకర్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని మల్చెల్మ గ్రామానికి చెందిన హందేకర్ అనిల్‌కుమార్ కుమారుడు హందేకర్ విదిత్ 300 మార్కులకు 300 మార్కులు సాధించాడు. జేఈఈ పరీక్ష కోసం రోజూ 15 గంటలపాటు ప్రణాళికాబద్దంగా చదివినట్లు విదిత్ చెప్పాడు. నమ్మకం, కష్టపడేతత్వం ఉంటే అసాధ్యమనేది ఉండదన్నాడు. -
US : ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి
హైదరాబాద్: అమెరికా దేశంలోని న్యూయార్క్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు అనూహ్యంగా మృతి చెందారు. తెలంగాణ వనపర్తి జిల్లాకు చెందిన దినేష్(22), ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన నికేశ్(21)గా వారిని గుర్తించారు. ఈ విషయాన్ని దినేష్ దగ్గరి స్నేహితులు తమకు ఫోన్ చేసి చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరిద్దరు ఎలా చనిపోయారన్న దానిపై అక్కడి పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దినేష్ 2023 డిసెంబర్ 28న ఉన్నత చదువుల కోసం అమెరికాలోని హార్ట్ఫోర్డ్ చేరాడు. ఇటీవల నికేష్ అక్కడికి చేరుకున్నాడు. కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ద్వారా వారిద్దరు అమెరికాలో రూమ్మేట్స్ అయ్యారు. అనుకోకుండా ఇద్దరు ఒకే రూమ్‌లో చనిపోయారు. అయితే వీరు ఉంటున్న గదిలో హీటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ వెలువడిందని, దీని కారణంగానే చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందని, కచ్చితమైన ఆధారాలను బట్టి త్వరలోనే ఒక ప్రకటన చేస్తామన్నారు అధికారులు. వనపర్తిలో విషాద చాయలు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గట్టు వెంకన్నకు కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు పేరు దినేష్. దినేష్ గత ఏడాది చెన్నైలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పట్టా పొందాడు. డిసెంబర్ 2023 చివర్లో MS చేయడానికి అమెరికా వెళ్లాడు. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోని హార్ట్ఫోర్డ్ సిటీలో సేక్ర్డ్ హార్ట్ యూనివర్సిటీలో ఆడ్మిషన్ తీసుకుని స్థానికంగా నివాసముంటున్నాడు. దినేష్‌తో పాటు శ్రీకాకుళం విద్యార్థి నికేశ్ ఉంటున్నాడు. వీరిద్దరూ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్టు తల్లితండ్రులకు సమాచారం అందింది. రూం హీటర్ నుంచి విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ బయటకు వచ్చిందని, దానిని పీల్చడం వల్ల దినేష్, నికేశ్ మరణించినట్టు తండ్రి అనుమానం వ్యక్తం చేశారు.దీంతో కుటుంబ సభ్యులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవలే దినేష్ తండ్రి వెంకన్న అయ్యప్ప మాల వేసుకోవడం జరిగింది. తన కొడుకు పైచదువుల కోసం అమెరికా వెళుతున్న సందర్భంలో కొడుకుతో అయ్యప్ప స్వామి పూజ చేయించి పంపించారు వెంకన్న. ఇంతలోనే మరణవార్త తెలియడంతో వెంకన్న దంపతులు తల్లడిల్లిపోయారు. (ఎడమ నుంచి మూడో వ్యక్తి, ఎరుపు రంగు దుస్తుల్లో దినేష్) దినేష్ మృతదేహాన్ని తీసుకురావడానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయం కోరినట్లు దినేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. నికేశ్ కుటుంబ సభ్యులతో తమకు పరిచయం లేదని, వారిద్దరూ ఇటీవలే అమెరికాలో స్నేహితులయ్యారని పేర్కొన్నారు. దినేష్ కుటుంబ సభ్యులను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పరామర్శించారు. నికేశ్ కుటుంబం గురించి తెలుసుకుంటున్నట్టు శ్రీకాకుళం పోలీసు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాలరాజు తెలిపారు. ఏపీ ప్రభుత్వం నుంచి సాయానికి రెడీ అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి పట్ల ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులు శ్రీకాకుళంకు చెందిన నికేశ్ (21), వనపర్తికి చెందిన దినేష్ (22)గా గుర్తించారని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని రత్నాకర్ అన్నారు. శ్రీకాకుళం విద్యార్థి నికేశ్ భౌతిక కాయాన్ని పార్థివదేహాన్ని భారత్ కు రప్పించేలా ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రయత్నిస్తోందని, మృతుని కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని రత్నాకర్ తెలిపారు. My deepest condolences to the family of Nikesh from srikakulam AP , who lost his life along with another student dinesh from telnagana at an unfortunate incident. ANDHRA PRADESH CMO is concerned and extended their help. — Kadapa Rathnakar (@KadapaRathnakar) January 15, 2024 ఇదీ చదవండి: సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు -
మన పిల్లలకు అండగా నిలుద్దాం
సాక్షి, అమరావతి: అమెరికా వెనక్కు పంపిన భారతీయ విద్యార్థుల్లో కొంత మంది తెలుగు విద్యార్థులూ ఉన్నారనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఆరా తీశారు. ఆ విద్యార్థుల పూర్తి వివరాలు తెలుసుకుని, వారికి అండగా నిలవాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి ఈ అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర విద్యార్థుల కోసం సీఎం ఆదేశాల మేరకు.. ప్రభుత్వం వేగంగా స్పందించి పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. విదేశాంగ శాఖతో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు దృష్టి సారించారు. వెనక్కి వచ్చిన విద్యార్థులు వ్యాలిడ్ వీసాలను కలిగి ఉండటంతో వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమస్యను త్వరగా పరిష్కరించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికా నుంచి బహిష్కరణకు గురైన తెలుగు విద్యార్థులు ఏపీఎన్ఆర్టీఎస్ను సంప్రదించాలని అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి తెలిపారు. ఇందుకోసం ఏపీఎన్ఆర్టీఎస్ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్ కేటాయించిందన్నారు. ఈ హెల్ప్‌లైన్ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, +91 8632340678, 8500027678 సంప్రదించాలని సూచించారు. లేదా info@apnrts.com, helpline@apnrts.com కు మెయిల్ చేయాలని చెప్పారు. నిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకోండి అమెరికా వీసా ఉన్నంత మాత్రాన ఆ దేశంలోకి ప్రవేశమనేది గ్యారెంటీ కాదని, విద్యార్థులు యూఎస్ ఇమ్మిగ్రేషన్ (పోర్ట్ ఆఫ్ ఎంట్రీ) వద్ద కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. లాప్టాప్, మొబైల్లో అమెరికా నిబంధనలను ఉల్లంఘించేలా సందేశాలు (పార్ట్‌టైమ్ జాబ్, బ్యాంక్ బ్యాలెన్స్ మేనేజ్ తదితర) ఉండకూడదని తెలిపారు. ఆ దేశంలోకి ప్రవేశం ఎందుకనే అంశాన్ని చెప్పి, వారిని ఒప్పించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ముందుగానే విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థి దశలో అమెరికాలో జీవించడానికి అవసరమైన ఆర్థిక స్థోమతకు తగిన రుజువులు, యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, తదితరాల గురించి మన విద్యార్థులను అడిగినప్పుడు సంతృప్తికర సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వకపోతే విద్యార్థులు యూఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించే అవకాశం ఉందని వారు భావిస్తారని చెప్పారు. ఈ విషయాలపై విద్యార్థులు ముందుగానే అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు. పేరున్న ఏజెన్సీల ద్వారానే విద్యార్థులు అమెరికా వెళ్లేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. -
యూఎస్ తెలుగు విద్యార్థుల ఉదంతంపై సీఎం జగన్ ఆరా
అమరావతి: అమెరికా నుంచి కొంత మంది తెలుగు విద్యార్ధులు వెనక్కి పంపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన వారి సమస్యను పరిష్కరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుండి వెనక్కు పంపించిన ఘటన సంచలనం సృష్టించింది. వీరిలో తెలుగువారు కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదంతంపై అరా తీశారు. విద్యార్థుల పూర్తి వివరాలతో పాటు పూర్తి సమాచారాన్ని సేకరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని చెబుతూనే అవసరమైతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కూడా జరపాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఎన్నోఆశలతో ఉన్నత విద్య నిమిత్తం అమెరికా చేరుకున్న తాము అన్ని డాక్యుమెంట్లను సమర్పించామన్నారు విద్యార్థులు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పత్రాలను తనిఖీ చేసి, కొద్దిసేపు విచారించాక కారణం చెప్పకుండానే వారిని వెనక్కి పంపించేశారు. వారిలో అత్యధికులు అట్లాంటా, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాలలో దిగారు. చదవండి: అక్రమాల పుట్ట మార్గదర్శి.. ఆందోళనలో చందాదారులు.. రామోజీ పాపం ఫలితమే ఇదంతా! -
అమెరికాలో తెలుగు విద్యార్థులకు వెన్నక్కి పంపిస్తున్న అధికారులు
-
అమెరికా నుంచి తెలుగు విద్యార్థులు వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవడం కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ఇమి గ్రేషన్/భద్రతా అధికారులు ఎయిర్‌పోర్టు నుంచే తిప్పిపంపేశారు. ఎందుకు పంపేస్తున్నారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. బలవంతంగా విమానం ఎక్కించి వెనక్కి పంపారు. ఇలా అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో ప్రాంతాల నుంచి 21 మందిని తిప్పిపంపినట్టు తెలిసింది. దాదాపు వారం రోజుల నుంచి ఇలా ఒకరిద్దరిని పంపేస్తున్నా.. ఇప్పుడు ఒక్కరోజే 20 మందికిపైగా విద్యార్థులను వెనక్కి పంపడంతో విషయం బయటికి వచ్చిందని అమెరికాలోని తెలుగు సంఘాలు చెప్తున్నాయి. అయితే పత్రాలు, వివరాలన్నీ పరిశీలించాకే అమెరికా వీసా ఇస్తారని, అలాంటప్పుడు ఈ సమస్య ఎందుకొచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సదరు విద్యార్థుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా బయటికి రాలేదు.పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నా..: అమెరికాలో ఆగస్టులో విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే భారత విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అక్కడి వీసా నిబంధనలకు అనుగుణంగా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటారు. ముందే టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు రాస్తారు. వాటి మార్కుల ఆధారంగానే అక్కడి యూనివర్సిటీలలో సీట్లు వస్తాయి. తర్వాత అమెరికాలో చదువుకున్నన్ని రోజులు జీవించడానికి అవసరమయ్యే మేర సొమ్మును బ్యాంకు బ్యాలెన్స్‌గా చూపిస్తారు. ఇందుకోసం విద్యార్థులు కన్సల్టెన్సీల సహకారం తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా అనుభవం సర్టిఫికెట్లు కూడా సమర్పిస్తున్నారు. ఈ వ్యవహారంలోనే మన విద్యార్థులు ఇబ్బందుల్లో పడుతున్నారని అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు చెప్తున్నాయి. డాక్యుమెంట్లపై అనుమానాలు.. సోషల్ మీడియా ఖాతాలు అమెరికాలో ‘సాక్షి’ ప్రతినిధికి అందిన సమాచారం ప్రకారం.. పలువురు తెలుగు విద్యార్థులు బ్యాంక్ ఖాతాలో సొమ్మును చూపిన అంశంపై అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఖాతాలో ఒకేసారి భారీగా డబ్బులు పడటం, లావాదేవీలు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించి, తిప్పి పంపారు. అమెరికాలో ఆటా సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమెరికాలో ఎన్నారై వ్యవహారాల సలహాదారు డాక్టర్ వాసుదేవరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా పరిశీలిస్తోంది. వీసాకు అనుమతించిన మరుక్షణమే నిఘా పెడుతోంది. అందులో అమెరికా నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు, సమాచారం, వ్యాఖ్యలు ఉంటే వాటి ఆధారంగా ఎయిర్‌పోర్టులోనే ఆపేస్తున్నారు. ఉదాహరణకు భారత విద్యార్థి అమెరికా వస్తూ.. ఇక్కడి స్నేహితులతో అమెరికాలో చదువుకునే రోజుల్లో ఉండే పార్ట్‌టైం ఉద్యోగాల గురించి వాకబు చేశాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా పరిగణించి వెనక్కి పంపేశారు. నాటా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా మన విద్యార్థులను తిప్పి పంపడానికి కారణాలను కేవలం భారత కాన్సులేట్‌కు మాత్రమే చెబుతుంది. దీనితో ఆ వివరాలు తెలుసుకునేందుకు అమెరికాలో తెలుగు అసోసియేషన్లు ప్రయత్నిస్తున్నాయి. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చూపిన తెలుగు విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్‌లో సత్తా చూపిన తెలుగు విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షలోనూ అదరగొట్టారు. జాతీయ స్థాయిలో మొదటి, రెండో ర్యాంకులతోపాటు టాప్–10లో ఆరుగురు తెలుగు విద్యార్థులే నిలిచారు. ఇందులో వావిలాల చిద్విలాసరెడ్డి (1వ ర్యాంకు), నాగిరెడ్డి బాలాజీరెడ్డి (9వ ర్యాంకు) తెలంగాణ వారుకాగా.. రమేశ్ సూర్యతేజ (2వ), అడ్డగడ వెంకట శివరామ్ (5వ), బిక్కిని అభినవ్ చౌదరి (7వ), వైపీవీ మనీందర్‌రెడ్డి (10వ ర్యాంకు) ఏపీకి చెందినవారు. ఇక మహిళల్లో జాతీయ టాప్ ర్యాంకర్ (298 మార్కులు)గా ఏపీ విద్యార్థిని నాయకంటి నాగ భవ్యశ్రీ నిలిచింది. ఆమెకు జనరల్ కేటగిరీలో 56వ ర్యాంకు వచ్చింది. టాప్‌లో ఐఐటీ హైదరాబాద్ జోన్.. దేశంలో ఐఐటీలు, ఇతర జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఐఐటీ గౌహతి ఆధ్వర్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించగా.. ఆదివారం ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 1,83,072 మంది పరీక్షలు రాయగా.. 43,773 మంది అర్హత సాధించారు. ఇందులో బాలురు 36,264 మంది, బాలికలు 7,509 మంది ఉన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు గణనీయ సంఖ్యలో ర్యాంకులు సాధించారు. అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల పరిధి అధికంగా ఉన్న ఐఐటీ హైదరాబాద్ జోన్ టాప్‌లో నిలిచింది. ఈ జోన్ పరిధిలో 10,432 మందికి ర్యాంకులు వచ్చాయి. టాప్–500 ర్యాంకర్లలో 174 మంది ఈ జోన్ (తెలంగాణ, ఏపీతోపాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి కలిపి)కు చెందినవారే. నాగర్ కర్నూల్‌కు చెందిన వావిలాల చిద్విలాసరెడ్డి మొత్తం 360 మార్కులకు గాను 341 మార్కులు సా«ధించి జాతీయ స్థాయి టాపర్‌గా నిలిచాడు. గత ఏడాదితో పోల్చితే ఈసారి జేఈఈకి పోటీ ఎక్కువగా ఉందని.. పరీక్ష రాసిన వారి సంఖ్య, అర్హుల సంఖ్య పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. నేటి నుంచే జోసా రిజిరస్టేషన్లు ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన ‘జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)’కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులు దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 30న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. మొత్తం 6 దశల్లో సీట్ల కేటాయింపు చేపడతారు. ఈ కౌన్సెలింగ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు (23), ఎన్ఐటీ, ఐఐఈఎస్టీ (31), ఐఐఐటీ (26) జీఎఫ్‌ఐటీ (38)లు కలిపి మొత్తం 118 విద్యాసంస్థల్లో సీట్లను కేటాయిస్తారు. గత ఏడాది ఈ సంస్థలన్నింటిలో కలిపి 16,598 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈసారి ఈ సీట్ల సంఖ్య మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఐఐటీలలోని మొత్తం సీట్లలో 20శాతం మేర మహిళలకు సూపర్ న్యూమరరీ కింద కేటాయిస్తారు. – జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించిన వారిలో ఆర్కిటెక్ట్ కేటగిరీ అభ్యర్ధులు ఆర్కిటెక్ట్ ఆప్టిట్యూడ్ టెస్టును రాయాల్సి ఉంటుంది. వారు సోమవారం నుంచే ఏఏటీకి దరఖాస్తు చేయవచ్చు. ఈనెల 21న పరీక్ష నిర్వహించి 24న ఫలితాలు విడుదల చేస్తారు. పేదల విద్య కోసం సాఫ్ట్వేర్ రూపొందిస్తా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మాది నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం గోదల్ గ్రామం. నాన్న రాజేశ్వర్‌రెడ్డి, అమ్మ నాగలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. అమ్మానాన్న, సోదరుడి ప్రోత్సాహంతో ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా చదివాను. భవిష్యత్‌లో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేలా సాఫ్ట్వేర్ రూపొందించడమే లక్ష్యం. – ఫస్ట్ ర్యాంకర్ చిద్విలాసరెడ్డి టాప్ 10 ర్యాంకర్లు వీరే.. 1. వావిలాల చిద్విలాసరెడ్డి (తెలంగాణ) 2. రమేశ్ సూర్యతేజ (ఏపీ) 3. రిషి కర్లా (రూర్కీ ఐఐటీ పరిధి) 4. రాఘవ్ గోయల్ (రూర్కీ ఐఐటీ పరిధి) 5. అడ్డగడ వెంకట శివరామ్ (ఏపీ) 6. ప్రభవ్ ఖండేల్వాల్ (ఢిల్లీ ఐఐటీ పరిధి) 7. బిక్కిని అభినవ్ చౌదరి (ఏపీ) 8. మలయ్ కేడియా (ఢిల్లీ ఐఐటీ పరిధి) 9. నాగిరెడ్డి బాలాజీరెడ్డి (తెలంగాణ) 10. వైపీవీ మనీందర్‌రెడ్డి (ఏపీ) -
సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
-
‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. టాప్‌లో ఉమా హారతి
సాక్షి, న్యూఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్‌లో తెలుగు తేజాలు మరోసారి సత్తా చాటారు. ఫలితాల్లో నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. తిరుపతికి చెందిన పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చెందిన తరుణ్ పట్నాయక్ 33వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం సిమ్లాలో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ లో ట్రైనీ ఆఫీసర్‌గా తరుణ్ పనిచేస్తున్నారు. తరుణ్ తండ్రి ఎం ఆర్ కే పట్నాయక్ రాజమండ్రిలో జక్కంపూడి ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యుడుగా ఉన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తరుణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్‌కు చెందిన సాయి అర్హిత్ 40వ ర్యాంకు సాధించారు. ఉమా హారతి జగిత్యాల జిల్లాకు కోరుట్ల మండలం ఐలాపూర్‌కు చెందిన ఏనుగు శివమారుతి రెడ్డి 132వ ర్యాంకు సాధించగా, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బి.వినూత్న 462వ ర్యాంకు సాధించింది. చదవండి: UPSC సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలు విడుదల సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను మంగళవారం విడుదల చేసింది యూపీఎస్సీ. మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది.933 మందిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మందిని, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. పవన్ దత్త (తిరుపతి) ఏనుగు శివ మారుతి రెడ్డి (జగిత్యాల) ర్యాంకర్ల వివరాలు: హెచ్ఎస్ భావన -55 అరుణవ్ మిశ్రా-56 సాయి ప్రణవ్-60 నిధి పాయ్- 110 రుహాని- 159 మహేశ్‌కుమార్- 200 రావుల జయసింహారెడ్ది- 217 అంకుర్ కుమార్-257 బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి-270 చల్లా కల్యాణి- 285 పాలువాయి విష్ణువర్థన్‌రెడ్డి- 292 గ్రంధె సాయికృష్ణ-293 హర్షిత-315 వీరంగంధం లక్ష్మీ సుజిత-311 ఎన్.చేతనారెడ్డి-346 శృతి యారగట్టి- 362 సోనియా కటారియా -376 యప్పలపల్లి సుష్మిత-384 రేవయ్య-410 సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి-426 బొల్లిపల్లి వినూత్న- 462 కమల్ చౌదరి -656 రెడ్డి భార్గవ్-772 నాగుల కృపాకర్ 866 -
మణిపూర్ అల్లర్లు.. హైదరాబాద్‌కు తెలుగు విద్యార్థులు
మణిపూర్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. రెండు ప్రత్యేక విమానాల్లో మొత్తం 157 మంది విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో మణిపూర్ నుంచి ఏపీ, తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. తొలి విమానంలో 108 విద్యార్థులు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి విద్యార్థలను తమ స్వస్థలాలకు చేరేవేసేందుకు రెండు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మరో ప్రత్యేక విమానంలో 49 విద్యార్థులు కోల్‌కత్తాకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చేలా ఏపీ అధికారులు ఏర్పాటు చేశారు. ఏపీ విద్యార్థులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం కోల్‌కతాకు ప్రత్యేకంగా ఇద్దరు అధికారులు పంపింది. అంతేగాక విద్యార్థులకు విమాన టికెట్లను ప్రభుత్వమే బుక్ చేసింది. విద్యార్థుల భోజన, రవాణా సదుపాయలన్ని ప్రభుత్వం సొంత ఖర్చుతో అందిస్తుంది. చదవండి: ఫలించిన సీఎం జగన్ యత్నం సీఎంకు ధన్యవాదాలు మణిపూర్ చదువుతున్న తెలుగు విద్యార్థులను ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి తీసుకువస్తున్న నేపథ్యంలో వారి తలిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్ ఎన్ఐటీలో కార్తీక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తిరుపతి కొర్లగుంటకు చెందిన కార్తీక్ తల్లిదండ్రులు రెడ్డప్ప, మాధవి హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మణిపూర్ ఘటనతో తమ కొడుక్కి ఏం జరుగుతుందో అని ఆందోళన చెందామని, ఎయిర్‌పోర్టు నుంచి కార్తీక్ ఫోన్ చేశాడని పేర్కొన్నారు. సీఎం జగన్ దయవల్ల ఏపీ విద్యార్థులు అందరూ వెనక్కి వస్తున్నారని, ఈ మేరకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
ఫలించిన సీఎం జగన్ యత్నం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం/ వెంకటాచలం/దేవరాపల్లి: మణిపూర్‌లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థుల విషయంలో సీఎం జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. సొంత ఖర్చులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విమానాలను ఏర్పాటు చేసింది. ఒక విమానంలో హైదరాబాద్‌కు, మరో విమానంలో కోల్‌కతాకు తీసుకు వచ్చి, అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకున్నారు. సోమవారం ఉదయం 9.35 గంటలకు మొదటి విమానం (IMF HYD 0935/1235108 ఆంధ్రప్రదేశ్) హైదరాబాద్ బయలుదేరనుంది. అందులో 108 మంది విద్యార్థులను తీసుకురానున్నారు. రెండో విమానం (IMF CCU 1110/122049 ఆంధ్రప్రదేశ్) 11.10 గంటలకు కోల్‌కతా బయలుదేరనుంది. అందులో 49 మంది విద్యార్థులను తీసుకురానున్నారు. మణిపూర్‌లో చిక్కుకున్న మొత్తం 157 మంది విద్యార్థులను ఈ విమానాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విషయం తెలియగానే ముమ్మర కసరత్తు మణిపూర్‌లో చెలరేగిన అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన రాష్ట్ర విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్‌కు సహాయం కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఫోన్ కాల్స్ చేసి వివరాలు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు కంట్రోల్ రూమ్‌కు వచ్చిన సమాచారం మేరకు మణిపూర్‌లోని నిట్, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సుమారు 157 మంది రాష్ట్రానికి చెందిన విద్యార్థులు చదువుతున్నట్లు గుర్తించారు. మరోవైపు మణిపూర్‌లోని తెలుగు విద్యార్థులున్న కాలేజీల్లో ఒక్కో కాలేజీ నుంచి ఒక్కో విద్యార్థిని నోడల్ పాయింట్‌గా అధికారులు గుర్తించారు. వారి ద్వారా ఆయా కాలేజీల్లోని ఏపీకి చెందిన మిగిలిన విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. వీరందరినీ ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి తీసుకొచ్చి, వారి స్వగ్రామాలకు చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి విద్యార్థులను విద్యాలయాల నుంచి ఎయిర్‌పోర్టుకు సురక్షితంగా చేర్చేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతూ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్‌కు ఏపీ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. అలాగే విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సాల్‌కు కూడా లేఖ రాశారు. మణిపూర్ ప్రభుత్వంతోపాటు కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి సానుకూలంగా స్పందన వచ్చిందని, విద్యార్థులను తరలించడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించిందని అధికారులు వెల్లడించారు. ప్రత్యేక విమానం ఏర్పాటు కాగానే విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక విమానాన్ని ఎన్ని గంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ఒకవైపు పౌర విమానయాన శాఖ అధికారులతో సంప్రదిస్తూనే ప్రయివేటు విమానయాన సంస్థలతోనూ అధికారులు మాట్లాడుతున్నారు. ప్రత్యేక విమానం ఏర్పాటుకు ఇండిగో విమానయాన సంస్థతో అధికారులు సంప్రదిస్తున్నారు. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూను సోమవారం నుంచి కొన్ని గంటల పాటు సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి ఉదయం 5 గంటల నుంచి 8 వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు ప్రకటించింది. చురుగ్గా ఏర్పాట్లు : మంత్రి బొత్స మణిపూర్ నుంచి రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరంలో ఆదివారం సాయంత్రం ఆయన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అక్కడ మన విద్యార్థుల భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, వారికి అండగా నిలిచేందుకు కో ఆర్డినేటర్లను పంపామని చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో హెల్ప్ లైన్ (88009 25668, 98719 99055) ఏర్పాటు చేశామన్నారు. విమానాశ్రయానికి వచ్చేశా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో తాను ఇంటికి బయలుదేరారని, ప్రస్తుతం క్షేమంగా మణిపూర్‌లోని విమానాశ్రయానికి చేరుకున్నానని మణిపూర్‌లో ఇంజినీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పాలిచెర్లపాడుకు చెందిన విద్యార్థి కల్యాణ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం తండ్రి బి.ముసలయ్యకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. కాగా, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వాకపల్లి గ్రామానికి చెందిన వేపాడ వెంకటేష్ అనే విద్యార్థి మణిపూర్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాడు. మణిపూర్‌లోని ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ ఫస్టియర్ చదువుతున్నాడు. తాను చదువుతున్న కళాశాలకు సమీపంలో ఆందోళనకారులు భవనాలకు నిప్పు అంటించారని, ఓ జంటను హతమార్చారని స్థానిక విలేకరులకు ఫోన్ ద్వారా తెలిపాడు. తనతో పాటు యలమంచిలికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి కౌషిక్, మరో 25 మంది ఉన్నారన్నారు. తమను వెంటనే ఏపీకి తరలించే ఏర్పాటు చేయాలని కోరాడు. చదవండి: చంద్రబాబును భయపెడుతోంది ఇదే.. -
ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
బనశంకరి: వాయువేగంతో కారు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన బెంగళూరు మడివాళ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి కంటి వెలుగులు అవుతారనుకున్న కుటుంబాల ఆశలు చిదిమిపోయాయి. ఒకే హాస్టల్లో స్నేహితులు వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ చెందిన కార్తీక్ (23), బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో ఒక ప్రైవేటు హాస్టల్లో ఉంటూ కోరమంగలలో సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన భగీరథరెడ్డి (17) బెంగళూరులో ఒక ప్రైవేటు కాలేజీలో పీయూసీ చదువుతూ అదే ప్రైవేటు హాస్టల్లో ఉంటున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం ఉండేది. డివైడర్‌ను ఢీకొని మళ్లీ బస్సును మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో కార్తీక్ తన కారులో భగీరథరెడ్డి కలిసి బయలుదేరారు. కారులో వేగంగా వెళ్తూ సిల్క్‌బోర్డు సమీపంలో రోడ్డు డివైడరును అదుపుతప్పి ఢీకొని దూసుకెళ్లి అవత ల లేన్‌లో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అంతలోగా ఇద్దరు మృతిచెందారు. బస్సులోని కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై మడివాళ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. -
అమెరికాలో విషాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
సాక్షి, వరంగల్: అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మిస్సోరిలోని ఓజార్క్ సరస్సులో ఈతకు వెళ్లిన నలుగురు తెలుగు విద్యార్థులు.. ప్రమాదవశాత్తు అందులో గల్లంతయ్యారు. వీరిలో వికారాబాద్‌కు చెందిన శివదత్తు, హనుమకొండకు చెందిన ఉత్తేజ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. నలుగురు తెలుగు విధ్యార్థులు మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. హనుమకొండకు చెందిన ఉత్తేజ్ మరణ వార్త తెలియడంతో అతని తల్లిదండ్రులు జనార్థన్, ఝాన్సీ లక్ష్మీ బోరున విలపిస్తున్నారు. కాగా గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన ఉత్తేజ్ హెల్త్ సైన్స్ డేటాలో మాస్టర్స్ చేస్తున్నాడు. ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లాతాండూరుకు చెందిన అపెక్స్ ఆస్పత్రి యజమాని వెంకటేశం, జ్యోతి దంపతుల రెండో కుమారుడు శివదత్తు (25) కూడా మరణించారు. వైద్య విద్యను అభ్యసించేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు శివదత్తు. సెయింట్ లూయిస్ వర్సిటీలో డెంటల్ ఎంఎస్ విద్య అభ్యసిస్తున్నాడు. శనివారం దత్తు స్నేహితులతొ కలిసి ఓజార్క్ లేక్‌కు వెళ్లాడు. సరస్సులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు. విషయం తెలిసి మృతుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చదవండి: రాత్రి ఇంటికి రానని చెప్పి.. ఫ్రెండ్‌ను బస్టాప్‌లో దింపేందుకు వెళ్తుండగా.. -
ఐఐటీల ప్రవేశాల్లో తెలుగు విద్యార్థులు భేష్!
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు గణనీయ సంఖ్యలో సీట్లు కొల్లగొట్టారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా సక్సెస్ రేటును పరిశీలిస్తే.. ఏపీ, తెలంగాణ టాప్–5 రాష్ట్రాల్లో ఉండటం విశేషం. భర్తీ అయిన మొత్తం 16,635 సీట్లలో 18.5 శాతం సీట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకోవడం విశేషం. సక్సెస్ రేటులో ముందు వరుసలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో, తెలంగాణ ఐదో స్థానంలో నిలిచాయి. కాగా మొదటి స్థానంలో రాజస్థాన్, రెండో స్థానంలో మహారాష్ట్ర ఉండగా నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. భర్తీ అయిన మొత్తం సీట్లలో సగానికి పైగా ఈ ఐదు రాష్ట్రాల విద్యార్థులకే దక్కడం విశేషం. అగ్రస్థానంలో రాజస్థాన్.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఐటీల్లో సీట్లను కైవసం చేసుకున్న విద్యార్థుల్లో 15 శాతం సక్సెస్ రేట్‌తో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. రాజస్థాన్ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరైన 13,801 మందిలో 2,184 మంది ఐఐటీల్లో చేరారు. రాజస్థాన్ తర్వాత సక్సెస్ రేటులో మహారాష్ట్ర నిలిచింది. ఈ రాష్ట్రం నుంచి 16,341 మంది అడ్వాన్స్‌డ్‌కు హాజరు కాగా 1,747 మంది (సక్సెస్ రేటు 10.69) ఐఐటీల్లో సీట్లు సాధించారు. సక్సెస్ రేటులో మూడో స్థానంలో ఏపీ నిలిచింది. ఏపీ నుంచి 14,364 మంది పరీక్షరాయగా 1,428 మంది ఐఐటీల్లో ప్రవేశం పొందారు. సక్సెస్ రేటు పరంగా నాలుగో స్థానంలో నిలిచిన ఉత్తరప్రదేశ్ నుంచి 22,807 మంది పరీక్ష రాయగా 2,131 మంది ఐఐటీల్లో చేరారు. ఐదో స్థానంలో నిలిచిన తెలంగాణ నుంచి 17,891 మంది హాజరు కాగా 1,644 మందికి (సక్సెస్ రేటు 9.18) సీట్లు లభించాయి. ఐఐటీలన్నీ హౌస్‌ఫుల్.. కాగా ఈ ఏడాది ఐఐటీల్లో దాదాపు అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. కొన్ని కొత్త ఐఐటీలు మినహా ప్రముఖ ఐఐటీలన్నింటిలో సీట్లు పూర్తిగా నిండాయి. ప్రముఖ ఐఐటీల్లో అయితే మొత్తం సీట్ల కంటే అదనంగా సీట్లను కేటాయించడం విశేషం. తమ సంస్థల్లో చేరడానికి వచ్చే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అవసరమైతే అదనంగా సీట్లు కేటాయించుకునేలా ఆయా ఐఐటీలకు స్వయంప్రతిపత్తి ఉంది. దీంతో పలు సంస్థలు అదనపు ప్రవేశాలు కల్పించాయి. 2022–23 విద్యాసంవత్సరానికి ఐఐటీల్లో 16,598 సీట్లు ఉన్నట్టు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ కౌన్సెలింగ్‌కు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో 1,567 సీట్లు మహిళల కోసం సూపర్ న్యూమరరీ కోటాలో కేటాయించారు. కాగా ఆరు విడతల కౌన్సెలింగ్ తర్వాత మొత్తం సీట్లు 16,598 మించి ప్రవేశాలు ఉండడం విశేషం. ఐఐటీ బాంబే విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. మొత్తం 16,635 సీట్లు భర్తీ అయ్యాయి. మహిళలకు సూపర్ న్యూమరరీ కోటా కింద కేటాయించిన సీట్లు 1,567తోపాటు ఇతర కేటగిరీల్లో ప్రతిభ ఆధారంగా మరో 1,743 సీట్లు దక్కాయి. ప్రముఖ ఐఐటీల్లో అదనంగా సీట్ల కేటాయింపు.. విద్యార్థులు మొదటి ప్రాధాన్యం ఇచ్చే ఐఐటీ బాంబేలో 1,360 సీట్లుండగా ఆ సంస్థ 1,371 మందికి ప్రవేశాలు కల్పించింది. అలాగే ఐఐటీ ఢిల్లీలో మొత్తం సీట్లు 1,209 కాగా 1,215 మందిని చేర్చుకుంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 1,869 సీట్లు ఉండగా 1,875 సీట్లు కేటాయించింది. వీటితోపాటు ఐఐటీ మద్రాస్, కాన్పూర్, హైదరాబాద్, రూర్కీ, తిరుపతి, గౌహతి, భువనేశ్వర్, పాట్నా, ఇండోర్ వంటి చోట్ల కూడా మొత్తం సీట్లకు మించి భర్తీ చేశారు. అలాగే డ్యూయెల్ డిగ్రీలకు సంబంధించి 102 సీట్లు కూడా భర్తీ అయినట్టు ఐఐటీ బాంబే గణాంకాలు పేర్కొంటున్నాయి. ఐఐటీ జోధ్‌పూర్, రోపార్, ధార్వాడ్, జమ్మూ, వారణాసి, ధన్‌బాద్‌ల్లో మాత్రమే స్వల్పంగా సీట్లు మిగిలాయి. ఐఐటీ బాంబే వైపే టాపర్ల మొగ్గు.. కాగా ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ 1,000 ర్యాంకులు సాధించినవారిలో ఏకంగా 246 మంది ఐఐటీ బాంబేను ఎంచుకోవడం విశేషం. ఆ తర్వాత 210 మంది అభ్యర్థులతో ఐఐటీ ఢిల్లీ నిలిచింది. -
తెలుగు విద్యార్థుల విజయకేతనం
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2022 ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దుమ్ములేపారు. ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులు హాజరవ్వగా.. అఖిల భారత స్థాయిలో 100లోపు ర్యాంకుల్లో 25 మంది, 200లోపు 48 మంది, 300లోపు 79 మంది, 400లోపు ర్యాంకుల్లో 100 మందికి పైగా విద్యార్థులు సత్తా చాటారు. ఇక 2, 4, 6, 10 ర్యాంకులతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించిన ఐఐటీ–బాంబే ఆదివారం ఈ ఫలితాలను విడుదల చేసింది. కామన్ ర్యాంకులతోపాటు వివిధ కేటగిరీల్లోని ఆలిండియా ర్యాంకుల్లోనూ తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. ఆలిండియా కామన్ ర్యాంకుల్లో పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి 2వ ర్యాంకు.. వంగపల్లి సాయి సిద్ధార్థ 4వ ర్యాంకు, పోలిశెట్టి కార్తికేయ 6వ ర్యాంకు, ధీరజ్ కురుకుంద 8వ ర్యాంకు, వెచ్చా జ్ఞాన మహేష్ 10వ ర్యాంకు సాధించారు. ఇక రిజర్వుడ్ కేటగిరీలకు సంబంధించి ఓబీసీ ఎన్సీఎల్, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ కేటగిరీల్లోనూ ఆలిండియా టాప్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు నిలిచారు. కాగా ఐఐటీ–బాంబే జోన్‌లోని ఆర్కే శిశిర్ ఆలిండియా స్థాయిలో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నాడు. శిశిర్.. అడ్వాన్స్‌డ్‌లో 360 మార్కులకుగానూ 314 మార్కులు సాధించాడు. అమ్మాయిల విభాగంలో ఐఐటీ ఢిల్లీ జోన్లో తనిష్క కాబ్రా టాప్ ర్యాంకర్‌గా (కామన్ ర్యాంకుల్లో 16వ స్థానం) నిలిచింది. ఈమెకు అడ్వాన్స్‌డ్‌లో 277 మార్కులు వచ్చాయి. 26.17 శాతం మందికే అర్హత మార్కులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఆగస్టు 28న నిర్వహించారు. రెండు పేపర్లలో నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1,55,538 హాజరుకాగా 40,712 (26.17 శాతం) మంది మాత్రమే అర్హత మార్కులు సాధించారు. అబ్బాయిల్లో 1,21,930 మందికి గాను 34,196 (28 శాతం) మంది, అమ్మాయిల్లో 33,608 మందిలో 6,516 (19.38 శాతం) మంది మాత్రమే అర్హత సాధించారు. దివ్యాంగుల్లో 1,392 మందిలో 375 మంది, విదేశీ విద్యార్థుల్లో 280 మందిలో 145 మంది అర్హులుగా నిలిచారు. నేటి నుంచి జోసా కౌన్సెలింగ్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడడంతో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం (నేడు) నుంచి ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను జోసా ప్రకటించింది. ఈ నెల 23న మొదటి విడత సీట్ల కేటాయింపు చేయనున్నారు. చివరి రౌండ్ సీట్ల కేటాయింపు అక్టోబర్ 17తో ముగుస్తుంది. అనంతరం ఎవరైనా సీట్లను ఉపసంహరించుకుంటే మిగిలిన సీట్లకు అక్టోబర్ 18, 21 తేదీల్లో ప్రత్యేక రౌండ్ నిర్వహించి ఆ సీట్లను భర్తీ చేస్తారు. మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్ల భర్తీ.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్టీఐలలో మొత్తం 54,477 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని జేఈఈలో మెరిట్, రిజరేషన్ల ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. 23 ఐఐటీల్లో 16,598 సీట్లు, 31 ఎన్ఐటీల్లో 23,994 సీట్లు, 26 ఐఐఐటీల్లో 7,126 సీట్లు, 33 జీఎఫ్‌టీఐల్లో 6,759 సీట్లు ఈసారి భర్తీకి అందుబాటులో ఉన్నాయి. వీటిలోనే అమ్మాయిలకు సూపర్ న్యూమరరీ కోటా కూడా అమలు కానుంది. ఐఐటీల్లో 1,567, ఎన్ఐటీల్లో 749, ఐఐఐటీల్లో 625, జీఎఫ్‌టీఐల్లో 30 సీట్లు అమ్మాయిలకు కేటాయిస్తారు. 14న ఏఏటీ పరీక్ష.. 17న ఫలితాలు.. ఆర్కిటెక్చర్ కోర్సులకు సంబంధించి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)కు 11, 12 తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 14న ఏఏటీని నిర్వహించి 17న ఫలితాలను విడుదల చేయనున్నారు. ఐఐటీ బాంబేకే ప్రాధాన్యం ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతా.. మాది ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెద ఇర్లపాడు. అమ్మానాన్న.. లక్ష్మీకాంతం, పోలు మాల్యాద్రిరెడ్డి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పటికే అన్నయ్య సాయి లోకేష్‌రెడ్డి ఐఐటీ బాంబేలో చదువుతున్నాడు. నాకు తాజా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంక్ వచి్చంది. 360కి 307 మార్కులు వచ్చాయి. తెలంగాణ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించాను. బాంబే ఐఐటీలో చేరాలనే లక్ష్యంతో రోజుకు 15 గంటలపాటు చదివాను. – పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి, ఆలిండియా రెండో ర్యాంకర్ నాలుగో ర్యాంక్ వచ్చింది. మాది విజయవాడలోని గుణదల. నాన్న.. వెంకట సుబ్బారావు ఏపీ జెన్కోలో ఇంజనీర్. అక్క దీపిక సిద్దార్ధ వైద్య కళాశాలలో హౌస్ సర్జన్‌గా చేస్తోంది. నాకు ఆలిండియా స్థాయిలో నాలుగో ర్యాంక్, ఓబీసీ విభాగంలో మొదటి ర్యాంక్ వచ్చింది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడమే లక్ష్యం. – వంగపల్లి సాయి సిద్ధార్థ, ఆలిండియా నాలుగో ర్యాంకర్ బీటెక్ చదువుతా.. మాది హైదరాబాద్. నాన్న బ్యాంక్ మేనేజర్. అమ్మ.. గృహిణి. నాకు జేఈఈ మెయిన్‌లో 4వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 8వ ర్యాంకు లభించాయి. ఐఐటీ బాంబేలో బీటెక్ చేయడమే నా లక్ష్యం. – ధీరజ్ కురుకుంద, ఆలిండియా 8వ ర్యాంకర్ యూఎస్‌లో ఎంఎస్ చదువుతా.. మాది విశాఖపట్నంలోని సీతమ్మధార. నాన్న.. రామారావు కొవ్వొత్తుల వ్యాపారం చేస్తున్నారు. తల్లి.. ఝాన్సీలక్ష్మి గృహిణి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో పదో ర్యాంకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆలిండియా రెండో ర్యాంకు సాధించాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. యూఎస్‌లో ఎంఎస్ చేయడమే నా లక్ష్యం. – వెచ్చా జ్ఞాన మహేష్, పదో ర్యాంకర్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే.. మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు. నాన్న.. సర్వేశ్వరరావు ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో ఇంజనీర్ కాగా, తల్లి మాధవీలత ప్రభుత్వ ఉపాధ్యాయిని. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 261 మార్కులు వచ్చాయి. దీంతో జాతీయ స్థాయిలో 33వ ర్యాంక్ సాధించాను. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించగలిగాను. – సాయి ముకేష్, ఆలిండియా 33వ ర్యాంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే లక్ష్యం.. మాది నెల్లూరు. నాన్న కిశోర్ బట్టల షాపు నిర్వహిస్తున్నారు. అమ్మ వాణి గృహిణి. నాకు ఇంటర్లో 985 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో 101వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 61వ ర్యాంక్ సాధించాను. మంచి ఐఐటీలో చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే నా లక్ష్యం. – అనుమాలశెట్టి వర్షిత్, ఆలిండియా 61వ ర్యాంకర్ పది మందికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తా.. మాది అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. నాన్న.. వెంకట రమణ ఎల్ఐసీ అడ్వైజర్, అమ్మ.. లక్ష్మి గృహిణి. జేఈఈ మెయిన్‌లో 133వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 19వ ర్యాంక్ వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా స్థాయిలో 63వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 6వ ర్యాంక్ సాధించాను. బాంబే ఐఐటీలో చేరతా. పది మందకీ ఉపాధి అవకాశాలు కల్పించేలా సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేస్తా. – గండు హరిదీప్, ఆలిండియా 63వ ర్యాంకర్ సామాజిక సేవే లక్ష్యం.. మాది వైఎస్సార్ జిల్లా వేంపల్లె. అమ్మానాన్న సువర్ణలత, తిరుపాల్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులు. నేను 1వ తరగతి నుంచి 5 వరకు వేంపల్లెలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుడివాడలో, ఇంటర్ హైదరాబాద్‌లో చదివాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 82వ ర్యాంకు లభించింది. భవిష్యత్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నవుతా. సమాజంలో అందరికీ సేవచేయాలన్నదే నా లక్ష్యం. – తమటం సాయిసింహ బృహదీశ్వరరెడ్డి, ఆలిండియా 82వ ర్యాంకర్ -
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) విడుదల చేసింది. జేఈఈ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలో ఫలితాలను అందుబాటులో ఉంచింది. జేఈఈ మెయిన్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలుగు విద్యార్థి పి రవిశంకర్ ఆరో ర్యాంక్ సాధించగా.. హిమవంశీకి ఏడో ర్యాంక్, పల్లి జయలక్ష్మికి 9వ ర్యాంక్ వచ్చింది. కాగా ఆదివారం ర్యాంకులను విడుదల చేయకుండా కేవలం ఫైనల్ కీని మాత్రమే రిలీజ్చేసిన ఎన్టీఏ.. తాజాగా ర్యాంకులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. -
విధాన నిర్ణయాల్లో జోక్యం కూడదు
సాక్షి, అమరావతి: ప్రాథమిక స్థాయి నుంచే విద్యను పటిష్టం చేసేందుకు, తెలుగు విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అమలు చేయాల్సిన ఉపాధ్యాయ సంఘాలు వాటి మార్పులపై మాట్లాడటం సరికాదని హితవు పలికారు. సోమవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ పాఠశాలల విలీనాన్ని చేపట్టామన్నారు. అయితే ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ రీత్యా ఇబ్బందులు ఉంటే వాటిపై పోరాడాలేగానీ, ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోవడం తగదన్నారు. ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు. వారి పిల్లల భవిష్యత్తుకు పునాదులు పటిష్టంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదని, అలాగే పేద పిల్లల ఉన్నతిని కూడా వారు కోరుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని చెప్పారు. మెరుగైన విద్యకు బాటలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎల్కేజీ, యూకేజీతో పాటు ఒకటి, రెండు తరగతులను కలిపి ఒకే చోట ఏర్పాటు చేసి ఇద్దరు ఎస్జీటీ, ఇద్దరు అంగన్వాడీ టీచర్ల పర్యవేక్షణలో చదువు చెబుతున్నట్లు బొత్స తెలిపారు. 3 నుంచి 8వ తరగతి/ 3 నుంచి 10వ తరగతి/3 నుంచి ఇంటర్ వరకు ఒకే చోట ఏర్పాటు చేయడం ద్వారా ప్రాథమికంగానే సబ్జెక్టు టీచర్ల బోధన లభిస్తుందన్నారు. డిజిటల్ స్క్రీన్‌పై క్లాసులు, 8వ తరగతి నుంచి 5 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌లో ఇంగ్లిషులో ఉచిత బోధనలు అందిస్తున్నామన్నారు. అక్షరక్రమంలో తొలి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను విద్యా రంగంలో కూడా ప్రథమ స్థానంలో నిలిపేందుకే ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో విలీనానికి 5,800 పాఠశాలలను మ్యాపింగ్ చేస్తే 268 స్కూళ్ల నుంచి అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. వాటిని జాయింట్ కలెక్టర్లు పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలిపారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ ప్రకారమే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా, ప్రైవేటు పాఠశాలలకు నిర్ణీత రేట్ల ప్రకారం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇందు కోసం రాష్ట్రంలోని 660 ప్రింటింగ్ ప్రెస్‌లను ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నామన్నారు. అయితే ప్రైవేటు పాఠశాలలు నిర్లక్ష్యంగా ఇండెంట్ తక్కువగా పెట్టడం వల్లే పుస్తకాల కొరత ఏర్పడిందన్నారు. ఆ సమస్యను అధిగమించేందుకు 15 రోజుల్లో మళ్లీ ఇండెంట్ పెట్టాలని ఆయా యాజమాన్యాలకు సూచించినట్లు తెలిపారు.