న్యూఢిల్లీ: భారత్‌ను యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ హబ్ (ఏవీజీసీ)గా మార్చేందుకు ప్రగతిశీల, స్థిరమైన వ్యక్తిగత పన్నుల విధానం అవసరమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గేమింగ్ ఆదాయంపై అత్యధికంగా 30 శాతం టీడీఎస్ (మూలం వద్దే పన్ను కోత) అమలు చేయడం అన్నది ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించడమేనని పేర్కొన్నారు. ఆఫ్‌షోర్ పాŠల్‌ట్‌ఫామ్‌లు ఎలాంటి పన్నులు చెల్లించకుండా, నియంత్రణల పరిధిలోకి రాని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ విధమైన పన్నుల ఎగవేత అన్నది ప్రభుత్వ ఖజానాకు పెద్ద నష్టమని, అంతిమంగా దేశీ పరిశ్రమకు మరణశాసనమని పేర్కొన్నారు.
ఆన్‌లైన్‌లో నైపుణ్యాల ఆధారిత గేమింగ్ పరిశ్రమ పరిమాణం 2.5 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఏటా 38 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధితో 2030 నాటికి 20 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. లాటరీల మాదిరి ఆన్‌లైన్ స్కిల్ గేమ్‌ల్లో భారీ ఆర్జన ఉండదని, కేవలం కొద్ది మందే ఆడతారని గేమ్స్24ఇంటూ7 వ్యవస్థాపకుడు త్రివిక్రమ్ థంపి తెలిపారు. కనుక ఒక ఆటగాడు 70 శాతం గేముల్లో గెలిచినా, పెద్ద ఎత్తున పన్నులు చెల్లించాల్సి వస్తున్నట్టు చెప్పారు. లాటరీలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన పన్ను చట్టాలను ఆన్‌లైన్ గేమింగ్‌కు అమలు చేయడం వల్ల ప్రతికూతల ఫలితాలు చూడాల్సి వస్తుందన్నారు. స్టాక్ మార్కెట్ మాదిరి కాకుండా, ఆన్‌లైన్ గేమర్లు అంతర్జాతీయంగా నడిచే చట్ట విరుద్ధమైన, పన్నుల పరిధిలో లేని గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫామ్‌లపైకి వెళ్లే అవకాశం ఉన్నట్టు చెప్పారు. అక్కడ అయితే గేమర్లు ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదన్నారు.
పన్నుల్లో మార్పులు అవసరం..
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రోషన్‌షా మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ గేమింగ్ పరిశ్రమ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దాలంటే, 1970 నాటి నిబంధనలను ప్రస్తుత నూతన తరం పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘ఇతర దేశాలు గేమింగ్ పరిశ్రమ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాయో చూడాల్సి ఉంది. అమెరికాలో గేమింగ్ ఆదాయాన్ని సాధారణ ఆదాయంగానే పరగణిస్తున్నారు. అక్కడ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్రిటన్‌లో గెలుచుకున్న మొత్తంపై ఎలాంటి పన్నులేదు’’అని షా చెప్పారు. ఊహించతగిన, ప్రగతిశీల పన్నుల విధానం భారత్‌కు అవసరమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment