గత కొద్ది సంవత్సరాలుగా గేమింగ్, ఈస్పోర్ట్స్ పరిశ్రమ అసాధారణ వృద్ధి నమోదు చేస్తోంది. ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులు కలిగిన రెండవ దేశంగా నిలువడంతో పాటుగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు బాగా పెరగడంతో దేశంలో ఈ రంగం అనూహ్య వృద్ధి నమోదు చేస్తోంది. దేశంలో ఈస్పోర్ట్స్ పరిశ్రమ ఏటా 45% (సీఏజీఆర్) వృద్ధితో 2025 నాటికి 11 బిలియన్ రూపాయలకు చేరుకోవచ్చని తాజాగా ఈవై అధ్యయనం ‘రెడీ.సెట్.గేమ్ ఆన్! ’ వెల్లడించింది.
ఇప్పటికే దేశంలో 450కు పైగా గేమింగ్ కంపెనీలు, 450 మిలియన్‌లకు పైగా గేమర్లు ఉన్నారని కూడా తేల్చింది. అయితే దురదృష్టవశాత్తు యువతతో పాటుగా వారి తల్లిదండ్రులకు కూడా గేమింగ్ కెరీర్ పట్ల సరైన అవగాహన లేదంటున్నారు హీరో విరెడ్ ఫౌండర్–సీఈఓ అక్షయ్ ముంజాల్. ఈ రంగంలో అపారమైన అవకాశాలున్నాయంటూ ఆ అవకాశాలను అందిపుచ్చుకునేలా తాము యువతకు తోడ్పడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
ఇందుకోసం ఔత్సాహికులకు ప్రత్యేకంగా గేమింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు ముంజాల్ వెల్లడించారు. కేవలం ఆరు నెలల కోర్సుతో గేమ్ డిజైనింగ్, విజువలైజింగ్, పబ్లిషింగ్, లీగ్ ఆపరేషన్స్, కంటెంట్ క్రియేషన్, లైవ్ ప్రొడక్షన్ వంటి విభాగాల్లో విధులు నిర్వహించవచ్చని అన్నారు.
కోర్సులో మొదటి రెండు నెలలూ ప్రైమర్‌గా ఉన్నప్పటికీ, ఆ తరువాత నాలుగు నెలలు మాత్రం స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. ఇలాంటి కోర్సుల ఫీజు రూ.4 లక్షలు కు అటూ ఇటుగా ఉన్నాయి. అయితే గ్యారెంటీడ్ 5 నెలల ఇంటర్నెషిప్ ద్వారా ఈ ఫీజులో 50 శాతం వరకూ తిరిగి పొందే అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి..
గేమింగ్ పరిశ్రమతో
అతి సన్నిహిత సంబంధాలున్న శిక్షణా సంస్థలు వల్ల కెరీర్ ఆధారిత కోర్స్ కరిక్యులమ్ తీర్చిదిద్దడం జరుగుతోంది . పరిశ్రమ నిపుణులతో కలిసి పనిచేయడం వల్ల అభ్యాసకులను భవిష్యత్‌కు సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దగలుగుతున్నారు. ఇవి అంతర్జాతీయ స్టూడియోలు, ప్రచురణ సంస్థలైన నోడ్విన్ తో పాటుగా యునిటీ, ఎన్‌ఎస్‌డీసీ , ఎంఈఎస్‌సీ వంటివి సర్టిఫికెట్ భాగస్వాములుగా, గేమ్‌ఆన్, హోలీ కౌ ప్రొడక్షన్స్, గాడ్‌స్పీడ్ గేమ్స్,మూన్‌ఫ్రాగ్ వంటివి ఇండస్ట్రీ భాగస్వాములుగా సంస్థలు కొనసాగుతున్నాయి
గేమింగ్, ఈస్పోర్ట్స్ పరిశ్రమలో రాణించడానికి సర్టిఫికేషన్ కోర్సులు చేసిన వారు గేమ్ డెవలపర్,గేమ్ ఆర్టిస్ట్, గేమ్ డిజైనర్. గేమ్ ఆడియో ఇంజినీర్ వంటి ఉద్యోగాలలో రాణించవచ్చు..ఈ –స్పోర్ట్స్‌ను స్పెషలైజేషన్‌గా తీసుకుంటే లీగ్ ఆపరేషన్స్, కమ్యూనిటీ మేనేజ్‌మెంట్, గేమ్ మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ తదితర బాధ్యతలను నిర్వర్తించవచ్చు.
ఉజ్వల భవిత...
భారతదేశంలో గేమింగ్ పరిశ్రమ అద్భుతమైన కెరీర్ అవకాశాలను అందిస్తోంది. ఈ రంగం ఏటేటా అనూహ్యవృద్ధిని నమోదు చేస్తోంది. అయితే ఈ రంగంలో ఉన్న అవకాశాల పట్ల యువతలో సరైన అవగాహన లేదు. అవగాహన పెంచుకుని ప్రయత్నిస్తే మంచి కెరీర్‌ను స్వంతం చేసుకోవచ్చు. –అక్షయ్ ముంజాల్, సిఇఒ, హీరోవిరెడ్
Comments
Please login to add a commentAdd a comment