గేమింగ్ విభాగంలో భారత్ అరుదైన ఘనంగా సాధించింది. నికో పార్ట్‌నర్స్ ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 39.6 కోట్ల కోట్ల (దాదాపు 40 కోట్లు) గేమర్స్ ఉన్నారని కంపెనీ వెల్లడించింది. ది ఆసియా 10 గేమ్స్ మార్కెట్ పేరుతో తయారు చేసిన రిపోర్ట్‌లో.. ఆసియాలోని పది దేశాలతో పోల్చి చూస్తే ఒక్క భారత్‌లో 50.2 శాతం గేమర్స్ ఉన్నారని, వారానికి సగటున 14 గంటలు మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడతారని తెలిపింది.
ఆన్‌లైన్ గేమింగ్‌తో డబ్బులు సంపాదించేందుకు గేమర్స్ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. వెరసీ గత ఐదేళ్లలో భారత్‌లో వీడియోగేమ్స్‌తో పాటు కంప్యూటర్, మొబైల్ ఫోన్లలో ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో కంప్యూటర్, మొబైల్ గేమ్ మార్కెట్‌కు 35.9 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని, 2026 నాటికి ఆదాయం 41.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని నికో పార్ట్‌నర్స్ వెల్లడించింది.
కాగా, చైనా తర్వాత భారత్, థాయ్‌లాండ్, ఫిలీప్పీన్స్ వంటి దేశాల్లో గేమర్స్ సంఖ్య పెరుగుతోందని ఈ నివేదిక చెప్పింది. ఆసియాలోని పది దేశాల్లో జపాన్, కొరియాలు 77 శాతం మార్కెట్ ఉందని నికో పార్ట్‌నర్స్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment