స్థిరంగా బంగారం, వెండి: ఈ రోజు కొత్త ధరలు ఇలా.. | Sakshi
Sakshi News home page

స్థిరంగా బంగారం, వెండి: ఈ రోజు కొత్త ధరలు ఇలా..

Published Sun, May 5 2024 12:15 PM

Today Gold and Silver Price 5th May 2024

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఉలుకూ.. పలుకూ లేకుండా అన్నట్లు పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో, చెన్నై, ఢిల్లీలలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడలలో ఈ రోజు ఒక తులం బంగారం ధరలు రూ.65850 (22 క్యారెట్స్), రూ.71830 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్న రూ.100 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు స్థిరంగా ఉంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధరలు 66000 రూపాయలు.. 24 క్యారెట్ల ధర 71980 రూపాయల వద్దే ఉంది. నిన్న రూ.100 వరకు తగ్గినా గోల్డ్ రేటు.. ఈ రోజు ఏ మాత్రం పెరగలేదు. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతాయి.

దేశంలోని ఇతర నగరాలలో మాదిరిగానే చెన్నైలో కూడా పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు 66000 రూపాయలు, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 72000 రూపాయల వద్ద ఉంది. నిన్న గోల్డ్ రేటు రూ. 100 పెరిగింది. ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పు లేదు.

వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా, వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు (మే 5) ఒక కేజీ వెండి ధర 83000 రూపాయల వద్ద నిలిచింది. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో కూడా వెండి ధరల్లో ఎటువంటి మార్పులు లేదు.

Advertisement
Advertisement