జనవరి 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ట వేడుక శ్రీరాముని జన్మభూమిలో ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్వహించిన చారిత్రాత్మక ఘట్టాన్న ప్రపంచవ్యాప్తంగా అనేకమంది భక్తులు చూసి తరించారు. 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత, అయోధ్యలో రామ మందిర నిర్మాణంకోసం భక్తులు విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. కేవలం 45 రోజుల్లోనే పది కోట్ల మందికి పైగా ప్రజల నుంచి 2,500 కోట్లు వచ్చాయి.
రూ. 68 కోట్ల విలువ చేసే బంగారం
ఈ క్రమంలో సూరత్‌కుచెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లఖీ ఇచ్చిన విరాళం విశేషంగా నిలుస్తోంది. ఇదే రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందిన అతిపెద్ద విరాళంగా భావిస్తున్నారు. రూ. 68 కోట్లు విలువ చేసే 101 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ బంగారాన్ని గర్భగుడి, ఆలయ స్తంభాలు, తలుపులు, బలరాముడి ఆలయంలోని డ్రమ్, త్రిశూల్ వంటి నిర్మాణాలలో ఉపయోగించారట.
ఎవరీ దిలీప్ కుమార్ లఖి
దిలీప్ కుమార్ లఖి తండ్రి కూడా వజ్రాల వ్యాపారి . 1947లో విభజనకు రెండు సంవత్సరాల ముందు 1944లో జైపూర్ వచ్చారు. చిన్నప్పటి నుండే దిలీప్ కుమార్, కుటుంబ వ్యాపారంలో సాయం చేస్తూ డైమండ్ వ్యాపారంలో రాణించారు. ప్రస్తుతం సూరత్‌లో ప్రపంచంలోని అతిపెద్ద డైమండ్ పాలిషింగ్ ఫ్యాక్టరీకి యజమాని. 6వేలకు పైగ ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తారు. థాయిలాండ్, అమెరికా, దుబాయ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా శాఖలు ఉన్నాయి
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 33 కిలోల బంగారం, 2.51 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. అలాగే దేశంలోని బిలియనీర్లు ఎంత ఇచ్చారో స్పష్టంగా తెలియనప్పటికీ వారితో పోలిస్తే దిలీప్ చాలా బెటర్ అంటున్నారు నెటిజన్లు.
అయోధ్యకు ఆర్థిక ఊతం
మరోవైపు వాణిజ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం,అయోధ్య రామమందిరం ఇప్పుడు దేశంలోని అతిపెద్ద పర్యాటక కేంద్రంగా మారబోతోంది. అయోధ్య ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment