కాలుష్యం, జీవనశైలిలో మార్పులు, సరిగా పట్టించుకోకపోవడం, రసాయన షాంపుల వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతిని నిర్జీవంగా మారుతుంది. ఫలితంగా విపరీతంగా జుట్టు రాలడం, త్వరగా రంగు మారడంతోపాటు, వెంట్రుకలు చిట్లిపోతుంటాయి. ఈ సమస్యలన్నింటిని అధిగమించేందుకు ఇంట్లోనే ఎంచక్కా ఎటువంటి రసాయనాలు వాడకుండా షాంపు తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం..
► ఉసిరి పొడి, కుంకుడు కాయలు, శీకాకాయ, మెంతులను వందగ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటన్నింటిని బాగా ఎండబెట్టాలి.
► తడిలేకుండా ఎండిన తరువాత అన్నింటిని ఒక గిన్నెలో వేసి కొన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి.
► ఉదయం దీనిలో ఒక గ్లాసు నీళ్లు పోసి సన్నని మంటమీద ఉడికించాలి.
► అరగంట తరువాత చల్లారనిచ్చి వడగట్టి సీసాలో నిల్వచేసుకోవాలి. తలస్నానం చేయాలనుకున్నప్పుడల్లా ఈ నీటిని షాంపుగా వాడుకోవాలి.
► ఈ షాంపు తలలో అధికంగా ఉన్న ఆయిల్, దుమ్ము దూళిని వదిలించి కుదుళ్లకు పోషణ అందిస్తుంది.
► ఈ షాంపుని క్రమం తప్పకుండా వాడితే జుట్టురాలడం తగ్గి, కొత్త జుట్టువస్తుంది.
చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు
►ఐదారు ఉల్లిపాయ తొక్కలు, వందగ్రాముల మెంతులు, యాభై గ్రాముల అలోవెరా జెల్, యాభై గ్రాముల టీ పొడి, విటమిన్ ఈ క్యాప్య్సూల్ ఒకటి, బేబి షాంపు యాభై గ్రాములు తీసుకోవాలి.
► ఉల్లిపాయ తొక్కలు, మెంతులు, టీ పొడిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి మరిగించాలి. అన్ని మరిగి, నీళ్లు రంగు మారాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.
► చల్లారాక ఈ నీటిని సీసాలో వేసి విటమిన్ ఈ క్యాప్సూయల్, అలోవెరా జెల్, బేబి షాంపు వేసి బాగా షేక్ చేయాలి.
►పదిగంటలపాటు కదల్చకుండా పక్కన పెట్టేయాలి. తరువాత దీనిని షాంపులా వాడుకోవచ్చు.
► ఈ షాంపు జుట్టుకు పోషణ అందించడంతోపాటు, చుండ్రును దరిచేరనివ్వద్దు.
► ఉల్లిపాయ తొక్కలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి, మందంగా పెరిగేలా చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment