తాజాగా ఉన్న మునగాకులను అరకప్పు తీసుకుని దానిలో విత్తనం తీసేసిన పచ్చి ఉసిరికాయను ముక్కలుగా కోసి వేయాలి. ఈ రెండింటిని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలో అరగ్లాసు నీళ్లు పోసి జ్యూస్‌లా చేసుకోవాలి. తరువాత జ్యూస్‌ను వడగట్టి రోజూ పరగడుపున తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మునగ ఆకులు అందుబాటులో లేనివారు, వీటికి బదులు కొత్తిమీర, పుదీనాను వాడ వచ్చు. ఉసిరి కాయ లేకపోతే మునగ ఆకుల పేస్టులో నిమ్మరసాన్ని పిండుకోవచ్చు.
ఇమ్యూనిటీ పేస్ట్!
నాలుగు కరివేప ఆకులు, తులసి ఆకులు నాలుగు తీసుకుని మెత్తని పేస్టులాగా నూరుకోవాలి. ఈ పేస్టుని ఒక గిన్నెలోకి తీసుకుని స్పూన్ తేనె వేసి బాగా కలుపుకోని తినాలి. రోజూ ఏదోక సమయంలో ఈ పేస్టు తినడం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది. ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మరింత బాగా పనిచేస్తుంది.
బ్యూటిప్స్
బ్లాక్ హెడ్స్, మృతకణాలు తొలగిపోతే ముఖవర్ఛస్సు పెరుగుతుంది. ఈ రెండింటిని తొలగించుకోవడానికి.. ఒక అరటిపండును తీసుకుని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. దీనిలో బరకగా పొడిచేసుకున్న ఒక స్పూన్ ఓట్స్, స్పూను తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఎనిమిదో నంబర్ ఆకారంలో గుడ్రంగా, పైనుంచి కిందకు, కింద నుంచి పైకి మర్దనా చేసుకుని పది నిమిషాలపాటు అలా వదిలేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా తరచూ చేస్తుంటే బ్లాక్‌హెడ్స్ పోయి ముఖం మెరుస్తుంది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment