Anni Manchi Sakunamule Movie OTT Release Date Out, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి 'అన్నీ మంచి శకునములే'..స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడ?

Published Thu, Jun 15 2023 2:11 PM

Anni Manchi Sakunamule Movie OTT Release Date Out - Sakshi

యంగ్‌ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్  'అన్నీ మంచి శకునములే'. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది మే 18న విడుదలై తొలి రోజు నెగెటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. ఫలితంగా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. థియేటర్స్‌ ఆడియన్స్‌ని మెప్పించలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయింది. జూన్‌ 17 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ప్రైమ్‌ వీడియో ఓ ట్వీట్‌ చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ  చిత్రం అందుబాటులో ఉంది. 

‘అన్ని మంచి శకునములే’ కథేంటంటే.. 
ప్రసాద్‌( రాజేంద్ర ప్రసాద్‌), దివాకర్‌(రావు రమేశ్‌) కుటుంబాల మధ్య పాత గొడవలు ఉంటాయి. వీరిద్దరి ముత్తాతలు 1919లో విక్టోరియాపురం అనే గ్రామంలో కాఫీ ఎస్టేట్‌ని ప్రారంభిస్తారు. అక్కడి కాఫీని క్వీన్‌ విక్టోరియా చాలా ఇష్టపడుతుంది. దీంతో ఆ కాఫీ ఎస్టేట్‌ బాగా ఫేమస్‌ అవుతుంది. కొన్నాళ్లకు పంపకాల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగి కోర్టుకెక్కుతారు. ఆ కేసు నాలుగు తరాలుగా నడుస్తూనే ఉంటుంది.

మరోవైపు దివాకర్‌ తమ్ముడు సుధాకర్‌ (నరేశ్‌)కు కొడుకు రిషి(సంతోష్‌ శోభన్‌) పుడతాడు. అదే రోజు అదే ఆస్పత్రిలో ప్రసాద్‌కు మూడో కూతురు ఆర్య(మాళవిక నాయర్‌) జన్మిస్తుంది. అయితే డాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల పిల్లలు మారిపోతారు. ప్రసాద్‌ ఇంట్లో రిషి, సుధాకర్‌ ఇంట్లో ఆర్య పెరుగుతారు. వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటారు. పెద్దయ్యాక రిషికి ఆర్యపై ఇష్టం పెరుగుతుంది కానీ ఆ విషయం ఆమెతో చెప్పలేకపోతాడు.

ఒక్కసారి బిజినెస్‌ విషయంలో ఆర్య, రిషి కలిసి యూరప్‌ వెళ్తారు. అక్కడ ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రిషి తన ప్రేమ విషయాన్ని ఆర్యతో చెప్పాడా లేదా?  ఇరు కుటుంబాల మధ్య ఉన్న కోర్టు కేసు ఎలా సాల్వ్‌ అయింది? తమ పిల్లలు మారిపోయారనే విషయం తెలిశాక  అటు ప్రసాద్‌, ఇటు సుధాకర్‌ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు కాఫీ ఎస్టేట్ వివాదానికి ఎలాంటి పరిష్కారం లభించింది? అనేదే మిగతా కథ.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement