Viral Video: Priyanka Chopra, Nick Jonas lock lips on Rome street during vacation - Sakshi
Sakshi News home page

Priyanka Chopra: పబ్లిక్‌లో ప్రియాంక-నిక్ రొమాన్స్.. సోషల్ మీడియాలో వైరల్

Published Fri, Apr 21 2023 12:24 PM

Priyanka Chopra and Nick Jonas lock lips on Rome street during vacation - Sakshi

ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె హాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు. రూసో బ్రదర్స్‌ తెరకెక్కిస్తున్న సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. తాజాగా లండన్‌లో నిర్వహించిన సిటాడెల్‌ ప్రీమియర్‌లో ప్రియాంక చోప్రా కూడా పాల్గొన్నారు. ఇంగ్లీష్‌లో రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ జంటగా నటించారు. ఈ సిరీస్‌ ఇండియన్‌ వెర్షన్‌లో సమంత, వరుణ్‌ ధావన్‌ కలిసి నటిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ సిటాడెల్ ఏప్రిల్ 28న అమెజాన్‏లో స్ట్రీమింగ్ కానుంది. 

ప్రస్తుతం తన భర్త, హాలీవుడ్ సింగర్‌ నిక్‌ జోనాస్‌తో కలిసి రోమ్‌ వేకేషన్ వెళ్లింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను నిక్ తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. అందులో రోమ్ వీధుల్లో నడుస్తూ వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోంది ఈ జంట. ఆ వీడియోలో ప్రియాంక, నిక్ జోనాస్ ‍లిప్‌ కిస్ చేస్తూ కనిపించారు. అక్కడే ఇద్దరూ కలిసి ఐస్‌క్రీం తింటూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

కాగా.. ప్రియాంక చోప్రా,  నిక్ జోనాస్ 2018 డిసెంబర్‌లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో వివాహం చేసుకున్నారు.  జనవరి 2022లో సరోగసీ  ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చారు. వీరి కూతురికి మాల్టీ మేరీ అని పేటు పెట్టారు. ఇటీవల ముంబయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్‌ ‍ ప్రారంభోత్సవానికి తొలిసారి బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement