SS Rajamouli RRR Bags 9th Spot in Sight and Sound Magazine 50 Best Films - Sakshi
Sakshi News home page

RRR Movie: ఆర్ఆర్ఆర్ గ్లోబల్ రికార్డ్.. టాప్‌-10లో స్థానం దక్కించుకున్న టాలీవుడ్ చిత్రం

Published Tue, Dec 20 2022 8:59 PM

SS Rajamouli RRR bags 9th spot in Sight and Sound magazine 50 Best Films - Sakshi

ఈ ఏడాది మరో పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో టాలీవుడ్‌ సత్తాను ప్రపంచానికి తెలియజేశాడు రాజమౌళి. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించిన ఈ మూవీ మార్చి 25న విడుదలై, అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. రూ. 550 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం.. దాదాపు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది. ఈ చిత్రానికి ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. 

తాజాగా ఈ చిత్రం సైట్ అండ్ సౌండ్ మ్యాగజైన్-2022 జాబితాలో 50 ఉత్తమ చిత్రాల్లో 9వ స్థానాన్ని పొందింది. ఆస్కార్ నామినేషన్స్ చిత్రాలైన టాప్ గన్ మావెరిక్, టార్‌లను అధిగమించింది.  సౌండ్ అండ్ సైట్ మ్యాగజైన్-2022 రూపొందించిన జాబితాలో తెలుగు చిత్రం చోటు దక్కించుకుంది. అదే జాబితాలో చేరిన మరో భారతీయ చిత్రం షౌనక్ సేన్ డాక్యుమెంటరీ ఆల్ దట్ బ్రీత్స్ చిత్రానికి 32వ స్థానం దక్కింది. 

స్కాటిష్ చలనచిత్ర దర్శకుడు షార్లెట్ వెల్స్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆఫ్టర్ సన్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఆర్ఆర్ఆర్ ఈ జాబితాలోని టామ్ క్రూజ్ మూవీ టాప్ గన్: మావెరిక్, డేవిడ్ క్రోనెన్‌బర్గ్ చిత్రం  క్రైమ్స్ ఆఫ్ ది ఫ్యూచర్, కేట్ బ్లాంచెట్ సినిమా టార్, గిల్లెర్మో డెల్ టోరో చిత్రం పినోచియో, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్ వంటి అతిపెద్ద హాలీవుడ్ సినిమాలను అధిగమించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement