‘కచ్చతీవు రచ్చ’: జైశంకర్‌కు చిదంబరం కౌంటర్‌ | Sakshi
Sakshi News home page

కచ్చతీవు రచ్చ: జైశంకర్‌కు చిదంబరం కౌంటర్‌.. ‘ఊసర వెల్లిలా రంగులు మారుస్తూ’

Published Mon, Apr 1 2024 7:44 PM

Chidambaram Accuses Jaishankar On Katchatheevu Island Row - Sakshi

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడులో కచ్చతీవు ఇప్పుడు పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. కాంగ్రెస్‌, డీఎంకేలు కచ్చతీవును శ్రీలంకకు అప్పగించాయని బీజేపీ అంటుంటే..కచ్చతీవుల అప్పగింతల విషయమే తమకు తెలియదని డీఎంకే నేతలు వాదిస్తున్నారు. దీంతో ఈ కచ్చతీవు అంశం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది.   

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే. అన్నమలై కచ్చతీవును 1974లో నాటి కేంద్రంలోని కాంగ్రెస్‌ సర్కార్‌, రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వాలు శ్రీలంకకు ఎలా అప్పగించాయనే అంశంపై ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని సేకరించారు. ఇదే అంశంపై ప్రధాని మోదీ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.  

మనదేశానికి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిస్సంకోచంగా శ్రీలంకకు ఇచ్చిందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌ దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపరిచేలా కాంగ్రెస్​ పనిచేస్తుందని దుయ్యబట్టారు.  

ఎవరు ఏం చేశారో కాదు.. ఎవరు ఏం దాచారో తెలుసు
ఈ నివేదికపై విదేశాంగశాఖ మంత్రి ఎస్​.జైశంకర్​ సైతం.. కాంగ్రెస్‌, డీఎంకే తీరును తప్పుబట్టారు. తమిళనాడు రామేశ్వరం సమీపంలో ఉన్న కచ్చతీవుకు ప్రాముఖ్యత లేదనే 1974లో జవహర్‌లాల్​ నెహ్రూ, ఇందిరాగాంధీ వంటి కాంగ్రెస్​ ప్రధానులు సముద్ర సరిహద్దు ఒప్పందంలో భాగంగా శ్రీలంకకు ఇచ్చారని గుర్తు చేశారు. కచ్చతీవు ద్వీవికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉంది. దీనిని ఎవరు చేశారనేదే కాకుండా, ఎవరు దాచారనేదీ ఇప్పుడే మాకు తెలిసింది. దీనిపై ఒక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. శ్రీలంక ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి అని జయ శంకర్‌ అన్నారు.  

దెబ్బకు దెబ్బ వర్సెస్‌ ట్వీట్‌ ఫర్‌ ట్వీట్‌
కచ్చతీవు ద్వీప వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి .చిదంబరం మండిపడ్డారు. ఎక్స్‌ వేదికగా జయ్‌శంకర్‌ ఊసరవెల్లిల్లా రంగుల్లు మార్చొద్దని అన్నారు. ‘టిట్ ఫర్ టాట్’ అనేది పాతది.. ట్వీట్‌ ఫర్‌ ట్వీట్‌ అనేది ట్వీట్ కొత్త ఆయుధం’ అని పేర్కొన్నారు.  

చరిత్రలో జై శంకర్‌
అంతేకాదు, 2015 జనవరి 27 నాటి ఆర్టీఐ సమాధానాన్ని ఒకసారి చూడండి. కచ్చితీవును శ్రీలంకకు చెందినదిగా ఇండియా గుర్తించడాన్ని ఆర్‌టీఐ సమర్ధించిందని గుర్తు చేశారు. పరోక్షంగా జయ్‌ శంకర్‌ను ఉద్దేశిస్తూ.. ఒక ఉదారవాద అధికారి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌- బీజేపీ మౌత్‌ పీస్‌ వరకు ఆయన చేసిన విన్యాసాలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రజలు ఎంత వేగంగా రంగులు మారుస్తుంటారో అని చిందబరం ట్వీట్ చేశారు
   
బీజేపీలో హయాంలోనూ జరిగింది
మరో ట్వీట్‌లో గత 50 ఏళ్లలో భారతీయ మత్స్యకారులు శ్రీలంకలో నిర్బంధించబడ్డారని  అంగీకరించారు. అయితే బీజేపీ, మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదే జరగలేదా అని ప్రశ్నించారు. ‘గత 50 ఏళ్లలో మత్స్యకారులను నిర్బంధించిన మాట వాస్తవమే. అదేవిధంగా భారతదేశం అనేక మంది మత్స్యకారులను నిర్బంధించింది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు శ్రీలంక మత్స్యకారులను నిర్బంధించలేదా?  మోదీ అధికారంలో ఉన్నప్పటి నుండి మత్స్యకారులను శ్రీలంక నిర్బంధించలేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.  

కచ్చతీవు భారత్‌ తిరిగి తీసుకోవాల్సిందే
ఇలా ఆయా రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటే.. జాలర్ల సంఘాలు మాత్రం కచ్చతీవును భారత్‌ తిరిగి స్వాధీనం చేసుకుంటే తమిళ జాలర్లకు ప్రాణాలకు రక్షణ ఉంటుందని జాలర్ల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో ఈ కచ్చతీవు అంశం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement