గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటీషియన్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలింది. పార్టీ ఫిరాయింపు కారణంగా ఆయనపై అనర్హత వేటు వేశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు.
వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. దీంతో.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌సీపీ కోరింది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజు విచారణ నిర్వహించారు. ఆయన నుంచి వివరణ తీసుకున్నారు. చివరకు.. ఎమ్మెల్సీగా కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ బుధవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
జంగా కృష్ణమూర్తి.. 2009 నుంచి 2019 మధ్య పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది. వైఎస్సార్‌సీపీలో ఉన్నప్పుడు మండలిలో విప్‌గా కూడా పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment