జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

జీవితంపై విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య

Published Fri, Feb 9 2024 6:14 AM

-

మద్దూరు(హుస్నాబాద్‌): ఉరి వేసుకొని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన దూల్మిట్ట మండలంలోని హనుమతండా గ్రామ పరిధిలోని మహారాజ్‌ తండాలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ షేక్‌యూనూస్‌ అహ్మద్‌ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భానోతు జబ్బర్‌ కూతురు జ్యోతి(25)ని సూర్యాపేట జిల్లా లోని తుంగతుర్తి మండలంలోని భాపన్‌భాయి తండాకు చెందిన ధారావత్‌ నరేశ్‌తో మూడేళ్ల కిందట వివాహం జరిపించారు. కొద్ది రోజులుగా జ్యోతికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు తమ వద్దే ఉంచుకొని హైదరాబాద్‌లో చికిత్స చేయిస్తున్నారు. జీవితంపై విరక్తి చెందిన జ్యోతి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి జబ్బర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు తెలిపారు. మృతురాలికి కూతురు ఉంది.

అనారోగ్యంతో వృద్ధుడు

రామాయంపేట(మెదక్‌): ఉరివేసుకొని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఝాన్సిలింగాపూర్‌ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రె చంద్రయ్య (68) కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన చంద్రయ్య రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కోడలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement