శ్రీలంకతో ఆసియా కప్ ఫైనల్లో వాషింగ్టన్ సుందర్ ఎంట్రీ (PC: BCCI)
Asia Cup Final 2023- ndia vs Sri Lanka Playing XI: ఆసియా కప్-2023 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. కొలంబో వేదికగా ఆర్. ప్రేమదాస స్టేడియంలో టీమిండియా- శ్రీలంక టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
అక్షర్ పటేల్ అవుట్.. వాషీ ఇన్
ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఎంట్రీ ఇచ్చారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా అక్షర్ పటేల్ గాయం కారణంగా దూరంకాగా యువ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు తుదిజట్టులో చోటు దక్కింది.
తీక్షణ స్థానంలో అతడే
మరోవైపు.. స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ గాయంతో వైదొలగడంతో దుషాన్ హేమంతను జట్టులోకి తీసుకున్నట్లు లంక సారథి దసున్ షనక వెల్లడించాడు. ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే విధంగా ఉన్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేయాలనుకున్నట్లువెల్లడించాడు.
కాగా రోహిత్ శర్మ సైతం.. తాము టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని పేర్కొన్నాడు. కాగా ఆసియా వన్డే కప్-2023లో కొలంబో వేదికగా ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన జట్టు ఐదుసార్లు గెలవడం విశేషం.
తుదిజట్లు ఇవే
టీమిండియా:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక:
కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరానా.
చదవండి: బంగ్లా చేతిలో ఓడిపోయారు.. శ్రీలంకపై గెలవాలంటే: పాక్ మాజీ క్రికెటర్
The stage is set! It's the FINAL battle for Asian supremacy! 💥
— Star Sports (@StarSportsIndia) September 17, 2023
Who'll come out on top - #India or #SriLanka?
Tune-in to the final, #INDvSL in #AsiaCupOnStar
Today | 2 PM | Star Sports Network #Cricket pic.twitter.com/k2FJk5egJz
Comments
Please login to add a commentAdd a comment