క్రికెట్ ఆస్ట్రేలియా తమ చర్యల కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది. కోవిడ్ ఉందన్న కారణంగా సొంత ఆటగాడిపైనే వివక్ష చూపించింది. వివరాల్లోకి వెళితే.. విండీస్‌తో రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ కోవిడ్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. విషయం తెలిసి కూడా క్రికెట్ ఆస్ట్రేలియా విండీస్‌తో మ్యాచ్‌లో గ్రీన్‌ను బరిలోకి దించి పెద్ద సాహసమే చేసింది. ఇంత వరకు అంతా బాగానే ఉంది.
కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి అంక్షలు లేకపోవడంతో ఆస్ట్రేలియా బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని అనుకోవచ్చు. అయితే గ్రీన్‌కు కోవిడ్ ఉందన్న కారణంగా అతన్ని మిగతా ఆటగాళ్ల నుంచి దూరంగా ఉంచి క్రికెట్ ఆస్ట్రేలియా పెద్ద తప్పిదమే చేసింది. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతాలాపన సందర్భంగా గ్రీన్ సహచరులతో పాటు లైన్‌లో నిలబడకుండా దూరంగా నిల్చున్నాడు.
Hazlewood shoos away the Covid-positive Green! 🤪 #AUSvWI pic.twitter.com/iQFbbKfpwV
— cricket.com.au (@cricketcomau) January 25, 2024
కోవిడ్ ఉందన్న కారణంగా గ్రీన్ విషయంలో సామాజిక దూరం పాటించాలని ఆసీస్ మేనేజ్‌మెంట్ తెలిపినట్లు సమాచారం. గ్రీన్ సహచర ఆటగాళ్ల నుంచి దూరంగా నిలబడ్డ ఫోటో నెట్టింట వైరలవుతుంది. ఈ ఫోటోను చూసి నెటిజన్లు ఆసీస్ మేనేజ్‌మెంట్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. కోవిడ్ ఉందని తెలిసినా ఆడించడమెందుకు... ఆడించాక పక్కకు పెట్టడమెందుకంటూ విరుచుకుపడుతున్నారు.
మొత్తానికి ఈ చర్య వల్ల ఆసీస్ మేనేజ్‌మెంట్ విమర్శలపాలవుతుంది. కాగా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రస్తుతం కోవిడ్ కోరలు చాచింది. ప్రతి పది మందిలో ముగ్గురు కోవిడ్ బారినపడుతున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇటీవలే న్యూజిలాండ్‌కు చెందిన పలువురు క్రికెటర్లు కూడా కోవిడ్ బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. ఆసీస్ జట్టులో గ్రీన్‌తో పాటు హెడ్ కోచ్ మెక్ డోనాల్డ్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు.
ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్-విండీస్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 14 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 38/1గా ఉంది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ 4 పరుగులు చేసి హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. తేజ్‌నరైన్ చంద్రపాల్ (17), కిర్క్ మెక్‌కెంజీ (17) క్రీజ్‌లో ఉన్నారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment