బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ వెటరన్ పేసర్ కీమర్ రోచ్ నిప్పులు చెరుగుతున్నాడు. రోచ్‌తో పాటు మరో పేసర్ అల్జరీ జోసఫ్ కూడా చెలరేగడంతో ఆతిథ్య ఆస్ట్రేలియా విలవిలలాడిపోతుంది. వీరిద్దరి ధాటికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రోచ్.. స్టీవ్ స్మిత్ (6), కెమరూన్ గ్రీన్ (8), ట్రవిస్ హెడ్‌లను (0) పెవిలియన్‌కు పంపగా.. అల్జరీ జోసఫ్ లబూషేన్ (3), మిచెల్ మార్ష్‌లను (21) ఔట్ చేశాడు. 13.2 ఓవర్ల తర్వాత ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 67/5గా ఉంది. ఉస్మాన్ ఖ్వాజా (15), అలెక్స్ క్యారీ (8) క్రీజ్‌లో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. 266/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించి, 311 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్, అరంగేట్రం ఆటగాడు కెవిన్ సింక్లెయిర్ (50) అర్ధసెంచరీ చేసి, విండీస్ పైచేయి సాధించేలా చేశాడు. అతనికి ఆఖర్లో కీమర్ (8), షమార్ జోసఫ్ (3 నాటౌట్) కాసేపు సహకరించారు. దీనికి ముందు మిచెల్ స్టార్క్ (4/82) చెలరేగడంతో విండీస్ టాపార్డర్ పేకమేడలా కూలింది.
స్టార్క్ ధాటికి విండీస్ 64 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మిడిలార్డర్ బ్యాటర్లు కవెమ్ హాడ్జ్ (71), వికెట్‌కీపర్ జాషువ డసిల్వ (79) విండీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 149 పరుగులు జోడించి విండీస్ పతనాన్ని అడ్డుకున్నారు. విండీస్ టాపార్డర్ యధాతథంగా తమ పేలవ ప్రదర్శనను కొనసాగించింది. కెప్టెన్ బ్రాత్‌వైట్ 4, చంద్రపాల్ 21, మెక్‌కెంజీ 21, అథనాజ్ 8, జస్టిన్ గ్రీవ్స్ 6 పరుగుల చేసి ఔటయ్యారు. హాడ్జ్, డసిల్వతో పాటు బౌలర్ అల్జరీ జోసఫ్ (32) రాణించి విండీస్ పరువు కాపాడారు. హాజిల్‌వుడ్ 2, కమిన్స్, నాథన్ లయోన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment