పేరుకే ఆల్‌రౌండర్‌.. జట్టులో ఎందుకు ఉన్నాడో తెలియదు! తీసి పడేయండి | Netizens troll washington sundar worst performance in ipl 2023 | Sakshi
Sakshi News home page

IPL 2023: పేరుకే ఆల్‌రౌండర్‌.. జట్టులో ఎందుకు ఉన్నాడో తెలియదు! తీసి పడేయండి

Published Sat, Apr 22 2023 7:57 AM | Last Updated on Sat, Apr 22 2023 10:28 AM

Netizens troll washington sundar worst performance in ipl 2023 - Sakshi

ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి తీవ్ర నిరాశ పరిచింది. చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమిపాలైంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో దారుణంగా విఫలమైన ఎస్‌ఆర్‌హెచ్‌ ఘోర ఓటమిని మూటకట్టుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి కేవలం 134 పరుగులు మాత్రమే చేసింది.

సన్‌రైజర్స్‌ బ్యాటర్లలో అభిషేక్‌ శర్మ(34) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సీఎస్‌కే బౌలర్లలో జడేజా మూడు వికెట్లతో చెలరేగగా.. దేశ్‌పాండే, ఆకాష్‌ సింగ్‌, పతిరానా తలా వికెట్‌ సాధించారు. అనంతరం 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే కేవలం మూడు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. చెన్నై ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే 77 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు.

వాషింగ్టన్‌పై విమర్శల వర్షం..
ఇక ఇది ఇలా ఉండగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులో కీలక ఆల్‌రౌండర్‌గా ఉన్న  వాషింగ్టన్‌ సుందర్‌ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లోనూ కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన సుందర్‌.. బౌలింగ్‌లో కూడా ఒక్క వికెట్‌ పడగొట్టలేకపోయాడు. తన హోం గ్రౌండ్‌ అయిన చెపాక్‌లో కూడా అతడు పేలవ ప్రదర్శన కనబరచడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇక ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన సుందర్‌ కేవలం 36 పరుగులు మాత్రమే చేశాడు. అదే విధంగా బౌలింగ్‌లో అయితే అస్సలు రాణించలేకపోతున్నాడు. 6 మ్యాచ్‌ల్లో అతడు ఒక్క వికెట్‌ కూడా పడగొట్టకపోవడం గమనార్హం. ఈ క్రమంలో వాషింగ్టన్‌ సుందర్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

పేరుకే ఆల్‌రౌండర్‌ తప్ప పొడిచింది ఏమి లేదని సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సుందర్‌ స్థానంలో మరో ఆటగాడికి అవకాశం ఇస్తే బాగుంటుంది అని పలువురు మాజీ క్రికెటర్‌లు కూడా అభిప్రాయపడుతున్నారు. 
చదవండి: NEP vs OMN: చరిత్ర సృష్టించిన నేపాల్‌ క్రికెటర్‌.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement