టి20 ప్రపంచకప్ 2022లో పాకిస్తాన్ నక్కతోక తొక్కింది. ఒక దశలో సూపర్-12లోనే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడిన దశలో అనూహ్యంగా ఫుంజుకున్న పాకిస్తాన్ సౌతాఫ్రికాను మట్టికరిపించింది. ఆపై దురదృష్టానికి కేరాఫ్ అయిన ప్రొటిస్ జట్టు నెదర్లాండ్స్ చేతిలో ఓడి పాక్ సెమీస్ వెళ్లేందుకు బాటలు పరిచింది. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న పాకిస్తాన్ బంగ్లాదేశ్‌పై సమిష్టి ప్రదర్శనతో విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది.
గతేడాది టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కే పరిమితమైన పాకిస్తాన్ ఈసారి మాత్రం వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టలేదు. మొదట బౌలింగ్.. ఆపై బ్యాటింగ్‌లో సమిష్టి ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టింది. 2009 తర్వాత టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టడం మళ్లీ ఇదే. అలా 13 ఏళ్ల తర్వాత మరోసారి కప్ కొట్టడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది.
ఇక 2007లో ఫైనల్ చేరినప్పటికి టీమిండియా చేతిలో ఓడిన పాకిస్తాన్.. 2009లో మాత్రం ఫైనల్లో లంకను చిత్తుచేసి విశ్వవిజేతగా నిలిచింది. అయితే దాయాది పాకిస్తాన్ ఫైనల్‌కు చేరడంతో.. ఇప్పుడందరి కళ్లు టీమిండియాపై పడ్డాయి. గురువారం(నవంబర్ 10న) ఇంగ్లండ్‌తో జరగనున్న సెమీఫైనల్లో టీమిండియా గెలవాలని.. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడితే చూడాలని అభిమానులు దేవుడికి ప్రార్థిస్తున్నారు. వారి కోరిక నెరవేరుతుందేమో చూడాలి.
ఇక సెమీఫైనల్ మ్యాచ్ ముందు వరకు ఓపెనర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌ల ఫామ్‌పై పాక్ జట్టు మేనేజ్‌మెంట్ ఆందోళనలో ఉంది. కానీ కీలకమైన సెమీస్‌లో ఈ ఇద్దరు ఫామ్‌లోకి రావడం పాకిస్తాన్‌కు శుభపరిణామం అని చెప్పొచ్చు. ముఖ్యంగా టోర్నీల్లో దారుణంగా విఫలమైన బాబర్ ఆజంను న్యూజిలాండ్ దగ్గరుండి ఫామ్‌లోకి తీసుకొచ్చినట్లు అనిపించింది. ఇద్దరు ఓపెనర్లు అర్థశతకాలతో మెరవడంతో పాకిస్తాన్ విజయం సులువుగా జరిగిపోయింది. ఏది ఏమైనా పాకిస్తాన్ ఈసారి నక్క తోక గట్టిగా తొక్కిందని.. కానీ టీమిండియా ఫైనల్‌కు వస్తే మాత్రం పాక్ తోక ముడవడం ఖాయమని భారత అభిమానులు కామెంట్ చేశారు.
చదవండి: 'బ్లాక్‌క్యాప్స్' అని ఊరికే అనలేదు.. మరోసారి నిరూపితం
ఫామ్ కోల్పోయిన బాబర్‌తో ఫిప్టీ కొట్టించారు.. అదే కివీస్ ప్రత్యేకత
Comments
Please login to add a commentAdd a comment