క్రికెట్‌లో న్యూజిలాండ్ జట్టుకు పాకిస్తాన్ ఫోబియా ఇప్పట్లో వదిలేలా లేదు. ఐసీసీ మెగా టోర్నీల్లో(పరిమిత ఓవర్లు) పాక్‌తో సెమీస్ అనగానే న్యూజిలాండ్ వణికిపోతుంది. తాజాగా టి20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం పాకిస్తాన్‌తో జరిగిన మొదటి సెమీఫైనల్లో కివీస్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం మూటగట్టుకొని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పటివరకు పాకిస్తాన్‌తో ఆడిన నాలుగు సెమీఫైనల్స్‌లో(తాజా దానితో కలిపి) ఓడిపోయిన న్యూజిలాండ్ చెత్త రికార్డును మూటగట్టుకుంది.
ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్, న్యూజిలాండ్‌లు నాలుగుసార్లు సెమీస్‌లో తలపడ్డాయి. ఇందులో రెండు వన్డే వరల్డ్‌కప్‌లు, రెండు టి20 ప్రపంచకప్‌లు ఉన్నాయి. 1992, 1999 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్లో పాక్ చేతిలో చిత్తుగా ఓడిన కివీస్.. మళ్లీ 2007, 2022 టి20 ప్రపంచకప్‌లోనూ సెమీస్‌లో పరాజయాలనే మూటగట్టుకుంది.
మరి సెమీస్‌లో పాక్‌తో మ్యాచ్ అనగానే న్యూజిలాండ్‌కు అంత భయమెందుకు వేస్తుందనేది సగటు అభిమాని ప్రశ్నిస్తున్నాడు. లీగ్ దశలో ఏ జట్టునైనా మట్టి కరిపించే సత్తా ఉన్న న్యూజిలాండ్ నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం ఎక్కడలేని ఒత్తిడిని కొనితెచ్చుకుంటుంది. ముఖ్యంగా పాక్‌తో సెమీస్ అనగానే ఆ ఒత్తిడి మరింత ఎక్కువైపోయి మ్యాచ్ మొదట్లోనే స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌లో హిట్టింగ్‌లు పెద్దగా కనిపించలేదు. కేన్ విలియమ్సన్ చేసింది 45 పరుగులైనా.. అతను ఆడింది టెస్టు ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్‌లు పూర్తిగా నిరాశపరిచారు. అనుభవజ్ఞుడైన మార్టిన్ గప్టిల్‌ను కీలక మ్యాచ్‌లో పక్కనబెట్టడం కివీస్‌ను మరింత ఒత్తిడిలో పడేశాయి. దీనికి తోడు పాక్ బ్యాటింగ్ సమయంలో ఫేలవ ఫీల్డింగ్, క్యాచ్‌లు జారవిడవడం.. బౌలింగ్‌లో పస లేకపోవడం అన్నీ ఒక్కసారిగా మీదపడ్డాయి. చూస్తుంటే పాక్‌తో మ్యాచ్‌లోనే ఇవన్నీ జరుగుతాయని అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మూడు సందర్భాల్లోనూ కివీస్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది, కనీసం ఈసారైనా పాక్‌తో సెమీస్ గండం దాటుతుందనకుంటే కథ మళ్లీ మొదటికే వచ్చింది.
చదవండి: నక్కతోక తొక్కిన పాక్.. 13 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు
ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం.. వాళ్లిద్దరి వల్లే ఇలా: విలియమ్సన్
Comments
Please login to add a commentAdd a comment