శివమ్‌ దూబే మెరుపులు.. టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాల్సిందే! వీడియో వైరల్‌ | Sakshi
Sakshi News home page

IPL 2024: శివమ్‌ దూబే మెరుపులు.. టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాల్సిందే! వీడియో వైరల్‌

Published Fri, Apr 5 2024 9:22 PM

Shivam Dube smashes back-to-back sixes off CSK bowler T Natarajan - Sakshi

ఐపీఎల్‌-2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే మరోసారి మెరుపులు మెరిపించాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో దూబే అద్బుత ఇన్నింగ్స్‌ ఆడాడు. నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన దూబే ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ముఖ్యంగా స్పిన్నర్లను దూబే టార్గెట్‌ చేశాడు. దూబే కేవలం 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దూబేను కచ్చితంగా టీ20 వరల్డ్‌ కప్‌నకు ఎంపిక చేయాలని కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే..తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో శివమ్‌ దూబే(45) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రహానే(35), జడేజా(31) పరుగులతో రాణించాడు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. భువనేశ్వర్‌ కుమార్‌, టి నటరాజన్‌, పాట్‌ కమ్మిన్స్‌, జయ్‌దేవ్‌ ఉనద్కట్‌, షాబాజ్ అహ్మద్ తలా వికెట్‌ సాధించారు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement