Pro Kabaddi.. దేశంలో క్రికెట్‌తో పాటుగా కబడ్డీకి సైతం క్రేజ్ ఉంది. ఇండియాలో ఐపీఎల్ తర్వాత ప్రో కబడ్డీకి(Pro Kabbadi)కి కూడా ఎంతో ఆదరణ కనిపించింది. కబడ్డి ఫ్యాన్స్‌ను అలరిస్తూ ప్రో కబడ్డీ ఇప్పటికి 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లో ప్రో కబడ్డీ 9వ సీజన్ కూడా ప్రారంభం కానుంది.
అయితే, 9వ సీజన్‌కు ముందు ప్రో కబడ్డీకి భారీ వేలం జరిగింది. ముంబై వేదికగా రెండు రోజులపాటు(ఆగస్టు5, 6 తేదీల్లో) జరిగిన మెగా వేలంలో కబడ్డీ స్టార్ ప్లేయర్స్ ఊహించని ధర పలికారు. వేలంలో రికార్డు ధరకు ప్లేయర్స్‌ను ప్రాంచైజీలు దక్కించుకున్నాయి. మొత్తంగా 12 టీమ్స్ 500 మంది ప్లేయర్స్‌ను కొనుగోలు చేయడానికి పోటీపడ్డాయి.
It's the Hi-Flyer's 🌏 and we're just living in it 🤷♂️
— ProKabaddi (@ProKabaddi) August 5, 2022
Pawan Sehrawat shatters the #vivoPKLPlayerAuction records to emerge as the most expensive buy in the history of #vivoProKabaddi 🤯@tamilthalaivas can now breathe easy like all of us, eh? 👀 pic.twitter.com/Ej2PtKPqFv
కాగా, ఈ మెగా వేలంలో రికార్డు స్థాయిలో పవన్ షెరావత్‌ను రూ.2.65కోట్లకు తమిళ్ తలైవాస్ దక్కించుకోగా.. వికాస్ ఖండోలాను రూ.1.70కోట్లకు బెంగళూరు బుల్స్ కొనుగోలు చేసింది. ఇక, ఫజల్ అట్రాసలిని పూణేరి పల్టన్స్.. రూ. 1. 38కోట్లకు దక్కించుకుంది. గుమాన్ సింగ్‌ను రూ. 1.21కోట్లకు యు ముంబా కొనుగోలు చేసింది. మరోవైపు.. ప్రొ కబడ్డీలో రికార్డు బ్రేకర్‌గా పేరొందిన ప్రదీప్ నర్వాల్‌ను రూ.90 లక్షలకు యూపీ యోధా ఎఫ్‌బీఎంలో దక్కించుకుంది. ప్రొ కబడ్డీ చరిత్రలోనే పవన్ షెరావత్.. భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఇక హర్యానా స్టీలర్ రూ.65.10లక్షలకు అమీర్ హొసైన్‌ను, రవికుమార్‌ను రూ.64.10లక్షలకు(దబాంగ్ ఢిల్లీ), నీరజ్ నర్వాల్‌ను బెంగళూరు బుల్స్ రూ.43లక్షలకు కొనుగోలు చేసుకున్నాయి.
ನಮ್ಮ ಗೂಳಿ ಪಡೆ 😍
— Bengaluru Bulls (@BengaluruBulls) August 6, 2022
How's that squad looking, #BullsSene? ⚡#FullChargeMaadi #BengaluruBulls #vivoPKLPlayerAuctions pic.twitter.com/oDyrX89itc
Ala re ala! We welcome the Sultan to Pune! 🦁
— Puneri Paltan (@PuneriPaltan) August 5, 2022
.
.#PuneriPaltan #Bhaaripaltan #Gheuntak #vivoPKLPlayersAuction #BhaariAuction pic.twitter.com/CqgL2limse
ఇక, తెలుగు టైటాన్స్ విషయానికి వస్తే.. రజనీష్, అంకిత్ బెనివల్‌ను రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. కొత్తగా అభిషేక్ సింగ్, మోను గోయల్,పర్వేష్ భైంస్వాల్, సుర్జీత్ సింగ్, విశాల్ భరద్వాజ్, సిద్దార్ధ్ దేశాయ్‌ను కొనుగోలు చేశారు. కాగా, రాహుల్ చౌదరిని కనీస ధర రూ.10లక్షలకు జైపూర్ పింక్ పాంథర్స్ కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా.. దబాంగ్ ఢిల్లీ నవీన్ కుమార్, విజయ్‌ను రీటైన్ చేసుకుంది.
Our first buy of the day Parvesh Bhainswal will be the part of #Titansquad#idiaatakaaduvetaa #vivoPKLPlayerAuction @ProKabaddi pic.twitter.com/uYFjkcC4jo
— Telugu Titans (@Telugu_Titans) August 5, 2022
Abhishek Singh is set to expand the strength of the #Titansquad in season-9. How excited are you ?#idiaatakaaduvetaa #vivoPKLPlayerAuction @ProKabaddi pic.twitter.com/gvJRfJaIkD
— Telugu Titans (@Telugu_Titans) August 5, 2022
Pesh hai aapke #PKL2022 #GujaratGiants squad! 💪#Giant family, how do you feel about the team? 🤩#GarjegaGujarat #Adani #vivoProKabaddi #vivoPKLPlayerAuction pic.twitter.com/UCyjmZSGdX
— Gujarat Giants (@GujaratGiants) August 6, 2022
ఇది కూడా చదవండి: సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన పీవీ సింధు..
Comments
Please login to add a commentAdd a comment