Breaking News

కోటి రూపాయల ఇళ్లే కొంటున్నారు..!

Published on Sat, 04/19/2025 - 13:49

సొంతింటి కల సాకారం చేసుకునేందుకు నగరవాసులు ఎంతైనా ఖర్చు చేసేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జేబుకు భారం కాకుండా బడ్జెట్‌ ఇళ్లను కొని, తర్వాత బాధపడే బదులు.. భవిష్యత్తు అవసరాలను ముందుగానే ఊహించి అధిక విస్తీర్ణం కలిగిన ఖరీదైన గృహాలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో గ్రేటర్‌లో రూ.50 లక్షలలోపు ధర ఉండే అందుబాటు ఇళ్ల విక్రయాలు క్రమంగా తగ్గుతూ.. రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉండే ప్రీమియం యూనిట్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో

హైదరాబాద్‌ నగరంలో ఈ ఏడాది మార్చిలో జరిగిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో అఫర్డబుల్‌ హౌసింగ్‌ వాటా 55 శాతంగా ఉంది. కానీ, గతేడాది ఇదే నెలలోని 60 శాతంతో పోలిస్తే మాత్రం ఈ విభాగం వాటా 14 శాతం మేర తగ్గింది. అదే రూ.కోటి కంటే ఖరీదైన ఇళ్ల వాటా ఏడాది కాలంలో 17 శాతం మేర పెరిగింది. మార్చిలో రిజిస్ట్రేషన్స్‌ అయిన మొత్తం ప్రాపర్టీలలో ఖరీదైన ఇళ్ల వాటా 19 శాతంగా ఉంది. గతేడాది ఇదే నెలలో ఈ విభాగం వాటా 15 శాతమే. దీని అర్థం.. 
గృహ కొనుగోలుదారులు అందుబాటు గృహాల నుంచి క్రమంగా ఖరీదైన ఇళ్ల వైపు మొగ్గు చూపిస్తున్నారని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నెలవారీ నివేదిక వెల్లడించింది.

👉ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఎంతలా పెరిగాయంటే..

రూ.4,471 కోట్ల విలువైన ప్రాపర్టీలు.. 
గ్రేటర్‌లో గత నెలలో 6,327 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్స్‌ అయ్యాయి. వీటి విలువ రూ.4,471 కోట్లు.. అయితే అంతకు క్రితం నెలతో పోలిస్తే ప్రాపర్టీల విలువ రూ.14 శాతం మేర, రిజిస్ట్రేషన్లు 6 శాతం వృద్ధి చెందాయి. ఫిబ్రవరిలో రూ.3,925 కోట్ల విలువైన 5,988 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. అయితే గతేడాది మార్చితో పోలిస్తే మాత్రం రిజిస్ట్రేషన్లు 8 శాతం తగ్గగా.. విలువ 4 శాతం మేర పెరిగింది. 2024 మార్చిలో రూ.4,275 కోట్ల విలువైన 6,870 యూనిట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి.

2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైనవి.. 
గత నెలలో రూ.2,480 కోట్ల విలువైన 3,509 అఫర్డబుల్‌ యూనిట్లు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. అయితే గతేడాది ఇదే నెలతో పోలిస్తే మాత్రం ఇది 14 శాతం తక్కువ. అలాగే రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య ధర ఉన్న 1,605 యూనిట్లు మార్చిలో రిజిస్ట్రేషన్‌ కాగా.. వీటి విలువ రూ.1,134 కోట్లు. 2024 మార్చితో పోలిస్తే ఈ విభాగంలోనూ రిజిస్ట్రేషన్లు 7 శాతం మేర తగ్గాయి. ఇక, రూ.కోటి కంటే ఖరీదైన ఇళ్లు గత నెలలో 1,213 రిజిస్ట్రేషన్‌ కాగా.. వీటి విలువ రూ.857 కోట్లు. అయితే గతేడాది మార్చితో పోలిస్తే మాత్రం ప్రీమియం ఇళ్ల విభాగంలో రిజిస్ట్రేషన్లు 17 శాతం, విలువలు 33 శాతం మేర వృద్ధి చెందాయి. గతేడాది మార్చిలో 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 13 శాతంగా ఉండగా.. గత నెలకొచ్చే సరికి 16 శాతానికి పెరిగింది. 1,000 నుంచి 2,000 చ.అ. యూనిట్ల వాటా 71 శాతం నుంచి 68 శాతానికి తగ్గింది.

Videos

ఆస్తి కోసం తల్లిని దూషిస్తూ అక్కను కాలుతో తన్నిన ఎమ్మెల్యే అనుచరుడు ఉదయ్ కిరణ్

కాంగ్రెస్ పై కేసీఆర్ పవర్ ఫుల్ పంచ్ లు

130 అణు క్షిపణులు భారత్ కోసమే.. పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు

బినామీలకు కారుచౌకగా బాబు భూ పందేరం

కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రుల కౌంటర్

పహల్గాం ఉగ్రదాడిపై విచారణను ప్రారంభించిన NIA బృందాలు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ గా మాధవరెడ్డి అరెస్ట్

ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం

ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ

రాసిపెట్టుకోండి.. ఎవ్వరినీ వదలం.. వరంగల్ లో కేసీఆర్ ఉగ్రరూపం

Photos

+5

బీఆర్ఎస్ రజతోత్సవ సభలో గులాబీ సైన్యం.. హైలైట్‌ (ఫొటోలు)

+5

హీరో నిఖిల్ చేతుల మీదుగా నటి అనితా చౌదరి "మగ్ స్టోరీస్ కేఫే అండ్ కిచెన్" ప్రారంభం (ఫొటోలు)

+5

‘సారంగపాణి జాతకం’ సినిమా ‘ఫన్‌’టాస్టిక్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

నాని ‘హిట్‌ 3: థర్డ్‌ కేస్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

డాక్టర్ బాబు ఇంట్లో వేడుక.. కొడుక్కి మంగళస్నానం (ఫొటోలు)

+5

అనారోగ్యం నుంచి కోలుకున్న యాంకర్ రష్మీ.. అప్పుడే బాలీ దీవుల్లో చిల్! (ఫొటోలు)

+5

హీరో సూర్య ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

బుల్లితెర డాక్టర్‌బాబు నిరుపమ్‌ ఇంట్లో శుభకార్యం.. గ్రాండ్‌గా కుమారుడి ధోతి వేడుక (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 27-మే 04)

+5

20 ఏళ్ల తర్వాత కలిసి డ్యాన్స్.. కొరియోగ్రాఫర్ ఆనందం (ఫొటోలు)