రైతుల కోసం 13న జరగబోయే కార్యక్రమంపై దేవినేని అవినాష్
Breaking News
శ్రీ విష్ణు మూవీ వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
Published on Fri, 04/29/2022 - 16:15
యంగ్ హీరో శ్రీ విష్ణు ఎంచుకునే కథలే కాదు, ఆయన నటించే సినిమాల టైటిల్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయన ఎక్కువగా మొగ్గు చూపుతుంటాడు. దానివల్ల ఈ తరం వాళ్లలో కొంతమందికైనా కొన్ని మంచి పదాలు తెలుస్తాయంటాడీ హీరో. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘భళా తందనాన’. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించారు. మే 6వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన కేథరిన్ థ్రెసా నటించింది. ‘బాణం’ సినిమా ఫేమ్ చైతన్య దంతులూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
Tags