Breaking News

నవ భారత నిర్మాణానికి నడుం బిగించండి

Published on Wed, 12/29/2021 - 04:29

కాన్పూర్‌: యువత తాము కలలుకనే భారతం కోసం ఇప్పటినుంచి కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఐఐటీ కాన్పూర్‌ 54వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. యువత సుఖాల కన్నా సవాళ్లను ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటికే ఎంతో సమయం వృధా అయిందని, విద్యార్థిలోకం తక్షణం నడుం బిగించి పనిచేస్తే వచ్చే 25ఏళ్లలో వాళ్లు కలలు గనే భారత్‌ను చూడవచ్చని ఉద్భోదించారు.

భారత స్వావలంబనకు తోడ్పడాలని నూతన గ్రాడ్యుయేట్లను ఆయన కోరారు. స్వాతంత్య్రానంతరం భారత్‌ నూతన పయనం ఆరంభమైందని, నిజానికి 25ఏళ్లు పూర్తయ్యేసరికి ఎంతో అభివృద్ధి జరిగి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ సమయం వృథా చేయడం వల్ల దాదాపు రెండు తరాలు గడిచిపోయాయన్నారు. అందుకే ఇకపై ఎంతమాత్రం జాప్యం కూడదని హెచ్చరించారు.  

అనంతరం కాన్పూర్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టులో పూర్తయిన భాగాన్ని ప్రధాని ప్రారంభించారు. ఐఐటీ కాన్పూర్‌ నుంచి మోదీ ఝీల్‌ వరకు 9 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం పూర్తయింది. దీంతోపాటు 356 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్‌ ప్రాజెక్టును  ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రధాని మోదీ కాన్పూర్‌ నుంచి లక్నోకు 80 కిలోమీటర్లు రోడ్డుమార్గం ద్వారా వెళ్లాల్సి వచ్చింది. దారిపొడవునా తనిఖీలు చేసి, తగిన బందోబస్తును ఏర్పాటు చేశాక మోదీ రోడ్డు మార్గంలో ప్రయాణించారు.

ఐదేళ్లు దోచుకోవచ్చనుకున్నారు
సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోదీ తన కాన్పూర్‌ పర్యటనలో నిప్పులు చెరిగారు. గతంలో యూపీలో అధికారంలోకి వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ, ఎదురులేకుండా ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకునే లాటరీ దొరికినట్లు భావించిందని దుయ్యబట్టారు. అనంతరం ఏర్పడిన తమ ప్రభుత్వం నిజాయితీ, పారదర్శకతతో పనిచేస్తోందన్నారు.

ఇటీవల కాన్పూర్‌కు చెందిన సుగంధద్రవ్యాల వ్యాపారి వద్ద కోట్ల రూపాయల నగదు దొరకడాన్ని ఆయన ప్రస్తావించారు. ఇది ప్రతిపక్షం సాధించిన విజయమని ఎద్దేవా చేశారు. 2017కు పూర్వం అవినీతి దుర్గంధం రాష్ట్రమంతా వ్యాపించిందని, కట్టలు బయటపడగానే ఎస్‌పీ నేతల నోళ్లు మూతపడ్డాయని విమర్శించారు. కాన్పూర్, యూపీ ప్రజలకు మొత్తం అర్థమవుతోందన్నారు. యూపీలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతోందన్నారు.  

Videos

YSRCP నాయకుల జోలికొస్తే ఖబర్దార్

Gold price: ఆల్ టైం హైకి చేరిన బంగారం ధర

ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు

పోప్ ఫ్రాన్సిస్ మృతిపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

YSRCP ఎస్సీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం

Malladi Vishnu: శ్రీకూర్మనాథ ఆలయంలో జరిగిన ఘటన బాధ్యతారాహిత్యం

తెలంగాణ సచివాలయంలోకి నకిలీ ఉద్యోగుల ఎంట్రీపై ప్రభుత్వం సీరియస్

Virat Kohli vs Shreyas Iyer: ఈ ఓవరాక్షన్ తగ్గించుకో బ్రో

ఈరన్న కుటుంబాన్ని పరామర్శించిన YSRCP నేతలు

పోప్ ఫ్రాన్సిస్ మృతికి ప్రధాని మోదీ సంతాపం

Photos

+5

టాలీవుడ్ నటి అభినయ గ్రాండ్ రిసెప్షన్‌.. హాజరైన ప్రముఖ సినీతారలు (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్‌ డే వేడుక (ఫోటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి తల్లి బర్త్‌ డే.. స్పెషల్ విషెస్ తెలిపిన ముద్దుగుమ్మ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో గోపీచంద్‌ మలినేని, తమన్‌, అశ్విన్‌ బాబు (ఫోటోలు)

+5

కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో సూర్య, జ్యోతిక ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

ఓజీ భామ ప్రియాంక మోహన్ గ్లామర్ షో (ఫొటోలు)

+5

శతాబ్దాల చరిత్రకు నిలయం డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం.. అద్భుతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే (ఫొటోలు)

+5

విజయవాడలో సందడి చేసిన నటి కీర్తి సురేష్ (ఫొటోలు)

+5

సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో సినీనటి సౌమ్యజాను (ఫొటోలు)

+5

నటి అభినయ దంపతులను ఆశీర్వదించిన ఓంకార్‌, సముద్రఖని (ఫోటోలు)