Dream India
-
నవ భారత నిర్మాణానికి నడుం బిగించండి
కాన్పూర్: యువత తాము కలలుకనే భారతం కోసం ఇప్పటినుంచి కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఐఐటీ కాన్పూర్ 54వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. యువత సుఖాల కన్నా సవాళ్లను ఎంచుకోవాలని సూచించారు. ఇప్పటికే ఎంతో సమయం వృధా అయిందని, విద్యార్థిలోకం తక్షణం నడుం బిగించి పనిచేస్తే వచ్చే 25ఏళ్లలో వాళ్లు కలలు గనే భారత్‌ను చూడవచ్చని ఉద్భోదించారు. భారత స్వావలంబనకు తోడ్పడాలని నూతన గ్రాడ్యుయేట్లను ఆయన కోరారు. స్వాతంత్య్రానంతరం భారత్ నూతన పయనం ఆరంభమైందని, నిజానికి 25ఏళ్లు పూర్తయ్యేసరికి ఎంతో అభివృద్ధి జరిగి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ సమయం వృథా చేయడం వల్ల దాదాపు రెండు తరాలు గడిచిపోయాయన్నారు. అందుకే ఇకపై ఎంతమాత్రం జాప్యం కూడదని హెచ్చరించారు. అనంతరం కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్టులో పూర్తయిన భాగాన్ని ప్రధాని ప్రారంభించారు. ఐఐటీ కాన్పూర్ నుంచి మోదీ ఝీల్ వరకు 9 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం పూర్తయింది. దీంతోపాటు 356 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ ప్రాజెక్టును ప్రారంభించారు. తిరుగు ప్రయాణంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రధాని మోదీ కాన్పూర్ నుంచి లక్నోకు 80 కిలోమీటర్లు రోడ్డుమార్గం ద్వారా వెళ్లాల్సి వచ్చింది. దారిపొడవునా తనిఖీలు చేసి, తగిన బందోబస్తును ఏర్పాటు చేశాక మోదీ రోడ్డు మార్గంలో ప్రయాణించారు. ఐదేళ్లు దోచుకోవచ్చనుకున్నారు సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోదీ తన కాన్పూర్ పర్యటనలో నిప్పులు చెరిగారు. గతంలో యూపీలో అధికారంలోకి వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ, ఎదురులేకుండా ఐదేళ్లు రాష్ట్రాన్ని దోచుకునే లాటరీ దొరికినట్లు భావించిందని దుయ్యబట్టారు. అనంతరం ఏర్పడిన తమ ప్రభుత్వం నిజాయితీ, పారదర్శకతతో పనిచేస్తోందన్నారు. ఇటీవల కాన్పూర్‌కు చెందిన సుగంధద్రవ్యాల వ్యాపారి వద్ద కోట్ల రూపాయల నగదు దొరకడాన్ని ఆయన ప్రస్తావించారు. ఇది ప్రతిపక్షం సాధించిన విజయమని ఎద్దేవా చేశారు. 2017కు పూర్వం అవినీతి దుర్గంధం రాష్ట్రమంతా వ్యాపించిందని, కట్టలు బయటపడగానే ఎస్పీ నేతల నోళ్లు మూతపడ్డాయని విమర్శించారు. కాన్పూర్, యూపీ ప్రజలకు మొత్తం అర్థమవుతోందన్నారు. యూపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతోందన్నారు. -
బంజారాహిల్స్‌లో ది వాలెన్సియా
ఫ్లాట్ ప్రారంభ ధర రూ.2.5 కోట్లు సాక్షి, హైదరాబాద్: డ్రీమ్ ఇండియా, ఫైమా ప్రాపర్టీస్ సంయుక్త భాగస్వామ్యంతో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో 2 ఎకరాల్లో ది వాలెన్సియా లగ్జరీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. రూ.270 కోట్లతో 3.50 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 14 టవర్లు. ఒక్కో ట వర్లో 8 అంతస్తులుంటాయి. అంతస్తుకో ఫ్లాట్ చొప్పున మొత్తం 112 ఫ్లాట్లుంటాయి. 2,400 చ.అ. నుంచి 4,600 చ.అ. మధ్య 3,4 పడక గదులుంటాయి. ధర చ.అ.కు రూ.10 వేలు. ఫ్లాట్ రూ.2.5 కోట్ల నుంచి 4 కోట్ల మధ్య ఉంటుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 2-3 వారాల్లో మోడల్ ఫ్లాట్ కూడా సిద్ధమవుతుంది. 2017 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. -
రంజాన్ షాపింగ్ ఫెస్టివల్-2014
డ్రీమ్ ఇండియా ఆధ్వర్యంలో 300 స్టాల్స్‌లో రంజాన్ పండుగకు అవసరమమ్యే అన్ని రకాల దుస్తులు, వస్తువులు, ఇమిటేషన్ జ్యువెలరీ, ఫుడ్‌కోర్టులు,అరేబియన్ రుచులు ఈ ఫాపింగ్ ఫెస్టివల్ లో నగరవాసులకు అందిస్తున్నారు. ఎగ్జిబిషన్‌గ్రౌండ్స్, నాంపల్లి ఈ నెల 29 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రవేశం ఉచితం -
రంజాన్ షాపింగ్ ఫెస్టివల్
డ్రీమ్ ఇండియా నేతృత్వంలో రంజాన్ షాపింగ్ ఫెస్టివల్-2014 నిర్వహించనున్నారు. రంజాన్ మాసంలో నగరవాసులు షాపింగ్ కోసం శ్రమించే అవసరం లేకుండా పండుగకు అవసరమైన అన్ని రకాల వస్త్రాలు, వస్తువులు ఒకేచోట కొనుగోలు చేసే సౌకర్యం ఈ ఫెస్టివల్ ద్వారా కల్పిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన జ్యువెలరీ, పుట్వేర్, లేటెస్ట్ ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్, ఆటోమోబైల్స్ తదితర స్టాళ్లతో పాటు పుడ్‌కోర్టులు, స్వీట్, ఐస్‌క్రీమ్ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వేదిక : ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి సమయం: జులై 1వ తేదీ నుండి 29వ తేదీ వరకు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు * ఉచిత ప్రవేశం, ఉచిత పార్కింగ్ * సందర్శకులకు నమాజ్, ఇఫ్తార్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు