Sudoku | Sakshi
Sakshi News home page

Sudoku

About Sudoku

మెదడుకు మేత పెట్టే ఆట ఇది. చాలా పాప్యులర్‌ కూడా. మామూలుగానైతే ఈ ఆటలో ఓ పెద్ద చతురస్రాకారం అందులో కనీసం తొమ్మిది గడులు ఉంటాయి. ఒక్కో గడిని కూడా తొమ్మిది చిన్న గడులుగా విభజించి ఉంటారు. ఒక్కో చిన్న గడిలో అక్కడక్కడ అంకెలు ఉంటాయి. ఒకటి నుంచి తొమ్మిది వరకూ ఉన్న అంకెలను ఉపయోగించి ఈ గడులను పూరించాల్సి ఉంటుంది. అంతేనా అనుకోవద్దు. పెద్ద గడులతో కూడిన చతురస్రాకారంలో ఒక్కో వరుస కూడా ‘ఒకటి నుంచి తొమ్మిది వరకూ ఉన్న అంకెలతో నిండి ఉండాలి. ఏ అంకె కూడా రెండోసారి కనిపించకూడదు. ఈ ఆట తాలూకూ సంక్లిష్టత ఇక్కడితో ఆగిపోదు. పెద్ద చతురస్రంలోని అడ్డు వరసలను నింపడం కూడా పైన చెప్పినట్టుగానే జరగాలి. ఆసక్తికరంగా అనిపిస్తోందా. ముందు కొంచెం కష్టమని అనిపించవచ్చు. చేయలేమని ఇ‍బ్బంది కూడా పడవచ్చు. కానీ ఒక్కసారి కిటుకు పట్టేశారంటే ఆట సులువు అవుతుంది. అందుకే ఆటలో మజాను కొనసాగించేందుకు చిన్నగడుల్లో అక్కడక్కడ అంకెలు ఉంటాయని చెప్పుకున్నాం కాదా.. ఆ అమరికలో మార్పులు చేసి ఆటను మరింత రక్తి కట్టించే ప్రయత్నం చేస్తారు.

ఇంకో పజిల్‌.. తొమ్మిది నిలువు అడ్డువరసులండే సాధారణ సుడోకూలో ఎన్ని రకాల అమరికలు పెట్టవచ్చో మీకు తెలుసా?

2005లో కొందరు గణిత శాస్త్రవేత్తలు లెక్క వేశారు. ఏకంగా 6,670,903,752,021, 072,936,960 రకాలని తేల్చారు!

More Games

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement