'భగవంతుడు పంపిన దూత వైఎస్ జగన్'
గుంటూరు: వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి దివంగత మహానేత వైయస్ఆర్ పలు ప్రాజెక్టులు తీసుకొచ్చారని శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ సందర్భంగా ఆమె పలు తీర్మానాలు పార్టీ తరుపున ప్రవేశ పెట్టారు. అందులో ముఖ్యమైనవి కొన్ని పరిశీలిస్తే..
1. వంశధార, మడ్డువలస, నారాయణ, తోటపల్లి ప్రాజెక్టుల నిర్మాణానికి వైఎస్ కృషి చేశారు. ప్రస్తుతం రైతులు సాగునీరు లేక ప్రజలు తాగునీరు లేక అనేక కష్టాలు పడుతున్నారు. భగవంతుడు పంపిన దూతగా వైఎస్‌ఆర్ చనిపోయిన తరువాత ఒక అద్భుతాన్ని మనకు ఇచ్చారు. అది వైఎస్ జగన్.
2. మత్స్యకారులు శ్రీకాకుళంలో 192 కోస్టల్ కారిడర్‌లు ఉన్నాయి. 3 లక్షలమంది మత్స్యకారులు ఉన్నారు. టీడీపీ అధికారంలోకి రాకముందే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని, కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తామంటూ ఎనో హామీలు ఇచ్చారు. కానీ ఏ ఒక్కటీ నెరవేరలేదు. శ్రీకాకుళం జిల్లాలో గత వందేళ్లలో 80కి పైగా గత మూడు సంవత్సరాల కాలంలో హుద్ హుద్, ఫైలాన్ వచ్చాయి. వాటికి ఒక్క పరిహారం ఇవ్వలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర మత్స్యకారులను బాగుచేస్తారు.
3. గిరిజనులు శ్రీకాకుళం జిల్లా 2 లక్షలకు పైగా ఉన్నారు. వారికి ఇప్పటికీ రహదారులు లేవు. వైద్యానికైనా డోలీలపై వెళ్లాలి. వారి స్కూల్స్ ఎత్తివేస్తున్నారు. ఐటీడీఏ సబ్ ప్లాన్ ద్వారా వచ్చిన నిధులు టీడీపీ ప్రచారానికి వాడుకుంటుంది. గిరిజనుల అభివృద్ధిని తుంగలో తొక్కారు. వైఎస్ జగన్ గిరిజన సంక్షేమం కోసం పాటుపడిన ముఖ్యమంత్రి అవుతాడని ధీమా వ్యక్తం చేస్తున్నాం.
4. పొందూరు చేనేత కార్మికులు దివంగత మహానేత వైయస్ఆర్ ఎప్పుడు ఆదరించి అందంగా కట్టుకునే పంచ పొందూరు ఖద్దర్ అని తెలియజేస్తున్నా. పొందూరు ఖద్దర్ విలువ దయనీయంగా ఉంది. దేశవాడి పత్తి అని కేవలం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోనే ఉంది. ఆ పత్తిపై నివసించే కార్మికులు పూర్తిగా రోడ్డున పడ్డాయి. మళ్లీ చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నాను.