ఆర్థిక వ్యవస్థకు దెబ్బ! | Sakshi
Sakshi News home page

ఆర్థిక వ్యవస్థకు దెబ్బ!

Published Fri, Nov 25 2016 12:52 AM

ఆర్థిక వ్యవస్థకు దెబ్బ!

వృద్ధి దిగజారుతుంది... వినియోగం తగ్గుతుంది
జీడీపీ మందగమనం  దీర్ఘకాలంలో సానుకూలం
పన్ను ఆదాయాలు పెరుగుతారుు  బ్యాంకింగ్ రంగానికి సవాళ్లు
రేటింగ్ ఏజెన్సీలు... మూడీస్, ఎస్‌అండ్‌పీ విశ్లేషణ

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు చర్య స్వల్ప కాలంలో ఆర్థిక రంగ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుందని మూడిస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. ఫలితంగా వృద్ధి రేటు బలహీన పడుతుందని స్పష్టం చేసింది. అరుుతే, దీర్ఘకాలంలో సానుకూలమని, పన్ను వసూళ్లు పెరుగుతాయని మూడిస్‌తోపాటు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్‌‌స సంస్థలు వెల్లడించారుు.

నగదు కొరత
‘‘మార్కెట్‌లో చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో 86 శాతం కరెన్సీ వెనక్కి వెళ్లిపోతుంది. అదే సమయంలో పాత నోట్ల మార్పిడి, నగదు ఉపసంహరణలపై పరిమితుల వల్ల వ్యక్తులు, వ్యాపార సంస్థలకు కొన్ని నెలల పాటు నగదు కొరత ఏర్పడుతుంది. బయటకు వెల్లడించని నగదు రూపంలో వ్యక్తుల సంపదకు నష్టం కలుగుతుంది. తమ ఆదాయానికి మూలాలను తెలియజేయడం ఇష్టం లేని వారు నగదును బ్యాంకుల్లో డిపాజిట్లు చేయకపోవచ్చు. భారత్‌లో వినియోగం ఎక్కువగా నగదు లావాదేవీల రూపంలోనే ఉంది. నగదు లావాదేవీల నుంచి డిజిటల్ చెల్లింపులకు మళ్లడం అనేది నిదానంగా జరగాల్సి ఉంది’’ అని మూడీస్ తన నివేదికలో పేర్కొంది.

బ్యాంకులపై రెండు రకాల ప్రభావం
‘‘నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థలో భాగమైన అన్ని రంగాలపై అధికంగానే ప్రభావం చూపిస్తుంది. బ్యాంకులు మాత్రం లబ్ధి పొందుతారుు. డిజిటల్ పేమెంట్లు పెరగడం వల్ల వాటికి మధ్యవర్తులుగా వ్యవహరించే బ్యాంకులకు లాభదాయకం. డిపాజిట్లు 1-2 శాతం పెరగడం వల్ల లెండింగ్ రేట్లు తగ్గుతారుు. ఇది కూడా బ్యాంకులకు సానుకూలమే. కానీ, రుణాలు తిరిగి చెల్లించడంపై స్వల్ప కాలంలో ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఆస్తులపై రుణాలు, వాణిజ్య వాహనాల రుణాలు, మైక్రోఫైనాన్‌‌స రుణాలపై ఈ ప్రభావం ఉంటుంది. దీంతో స్వల్ప కాలానికి బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఆస్తుల నాణ్యత దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితే గణనీయమైన ప్రభావమే చూపుతుంది’’ అని మూడీస్ వివరించింది.

కొన్ని త్రైమాసికాలపాటు...
నోట్ల రద్దు ప్రభావం జీడీపీ వృద్ధి రేటుపై కొన్ని త్రైమాసికాల పాటు ఉంటుంది. ప్రభుత్వ చర్యల వల్ల స్వల్ప కాలంలో జీడీపీ వృద్ధి రేటు, ఆదాయాలపైనా ప్రభావం ఉంటుంది. వినియోగం తగ్గిపోరుు, జీడీపీ వృద్ధి రేటు మందగిస్తుంది. మధ్య, దీర్ఘకాలానికి చూసుకుంటే... బ్యాంకుల్లో రద్దరుున నోట్ల జమల ద్వారా ఆదాయ వెల్లడి కారణంగా పన్ను ఆదాయాలు పెరుగుతారుు. ప్రభుత్వ మూలధన వ్యయ కార్యక్రమానికి, ద్రవ్య స్థిరీకరణకు ఇది తోడ్పడుతుంది’’ అని మూడీస్ తన నివేదికలో విశ్లేషించింది.

వ్యాపారాలకు కష్టం
నోట్ల రద్దును అమలు చేయడం కూడా ఓ సవాలు. ఇది కూడా వృద్ధి రేటుపై ప్రభావితం చూపేదే. కార్పొరేట్ల విక్రయాలు, నగదు ప్రవాహం తగ్గడం వల్ల ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటారు. వీరిలో రిటైల్ విక్రయాల్లో ఉన్న వారిపై మరింత ప్రభావం పడుతుంది. మధ్య కాలానికి నగదు లభ్యత ఎంత త్వరగా అందివస్తుందన్న దాని ఆధారంగా కార్పొరేట్లపై పడే ప్రభావం ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం డిజిటల్ చెల్లిం పులు పెంచే ఉద్దేశంతో బ్యాంకుల్లోకి వచ్చిన నగదు అంతే మొత్తం తిరిగి వ్యవస్థలోకి వెళ్లకుండా అడ్డుకుం టుంది. ఈ చర్యలతో భారత్‌లో వ్యాపార నిర్వహణ వాతావరణం మెరుగుపడుతుంది. కానీ, ఆర్థిక రంగంపై ప్రతికూలత మరికొంత కాలం పాటు కొనసాగుతుంది.

బ్యాంకులకు సవాలు: ఎస్‌అండ్‌పీ
నోట్ల రద్దు నిర్ణయం వల్ల భారత్‌లో బ్యాంకుల ఆస్తుల నాణ్యత దెబ్బతింటుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్‌‌స తన నివేదికలో స్పష్టం చేసింది. బ్యాంకుల్లో డిపాజిట్లు పెరగడం లాభదాయకమే అరుునా అవి దీర్ఘకాలం పాటు అలాగే నిలిచి ఉండవని పేర్కొంది. ‘‘నోట్ల రద్దు స్వల్ప కాలంలో అప్పులిచ్చే సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కార్పొరేట్ల ప్రొఫైల్ రుణ చరిత్ర బలహీన పడడం వల్ల బ్యాంకులు ఎదుర్కొనే సవాళ్లు పెరిగిపోతారుు. దేశీయంగా పారిశ్రామిక కార్యకలాపాల కుంగుబాటు, కమోడిటీల ధరలు తక్కువగా ఉండడం, ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వంటి చర్యల ఫలితంగా కంపెనీల పరపతి నాణ్యత గత కొన్నేళ్లలో బాగా దెబ్బతిన్నది.

మెటల్ రంగంలో 34.4 శాతం, మౌలిక రంగంలో 17 శాతం రుణాలు ఒత్తిడిలో ఉన్నారుు. అరుునప్పటికీ భారత్‌లోని ఆర్థిక సంస్థలు తమ రేటింగ్‌ను నిలబెట్టుకుంటారుు. ఆర్థిక సవాళ్లు పెరిగినప్పటికీ బ్యాంకింగ్ రంగం గ్రూప్ 5లోనే ఉంటుంది. మార్చి నాటికి తలసరి జీడీపీ 1,703 డాలర్లుగా ఉంటుంది. నిర్వహణ పరంగా సమర్థవంతమైన బ్యాంకులు, అధిక లాభదాయకతను కలిగి ఉన్నవి డిజిటల్ బ్యాంకింగ్‌పై దృష్టి సారించడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకుంటారుు. నోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా వృద్ధి రేటు తగ్గినా, దీర్ఘకాలానికి మంచి కలిగించే చర్యే. విధానాల రూపకల్పన మెరుగుపడడం వల్ల బలమైన ఆర్థిక, ద్రవ్య పనితీరుకు తోడ్పడుతుంది’’ అని ఎస్‌అండ్‌పీ తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement