ఎడ్యుకేషన్ యాప్స్.. అరచేతిలో సమస్త విజ్ఞానం! | School in Korat pioneers Google Apps for Education | Sakshi
Sakshi News home page

ఎడ్యుకేషన్ యాప్స్.. అరచేతిలో సమస్త విజ్ఞానం!

Published Sun, Dec 7 2014 11:06 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఎడ్యుకేషన్ యాప్స్.. అరచేతిలో సమస్త విజ్ఞానం! - Sakshi

ఎడ్యుకేషన్ యాప్స్.. అరచేతిలో సమస్త విజ్ఞానం!

స్మార్ట్ ఫోన్స్... మరెన్నో స్మార్ట్ ఫీచర్స్.. రోజుకో కొత్త అప్లికేషన్..! నేటి హైటెక్ యుగంలో అత్యాధునిక టెక్నాలజీ, ఆకట్టుకునే ఫీచర్‌‌స కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ను వినియోగించని యువత అరుదు. స్మార్‌‌టఫోన్‌‌స వాడే యువతరం సగటున ప్రతి పది నిమిషాలకు కనీసం ఒక్కసారైనా కీప్యాడ్-అన్‌లాక్ చేస్తున్నట్లు అంచనా! ఇంతలా దైనందిన జీవితంలో చొచ్చుకు వచ్చాయి స్మార్ట్ ఫోన్స్. ఇవి ఇప్పుడు విద్యార్థులకు విజ్ఞానాన్ని,సబ్జెక్ట్ పరిజ్ఞానాన్ని సైతం అందించే అద్భుత సాధనాలుగా మారుతున్నాయి. ఆల్ఫాబెట్స్ మొదలు అత్యున్నత పోటీ పరీక్షలైన సివిల్స్, జీమ్యాట్, జీఆర్‌ఈ, క్యాట్, జేఈఈ వంటి ఎగ్జామ్స్‌కు సిద్ధం చేసే మొబైల్ ఎడ్యుకేషన్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్‌‌ట ఫోన్ ఆధారంగా ఎడ్యుకేషన్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే.. సమస్త విజ్ఞానం మీ అరచేతిలో ఉన్నట్లే!! ఎడ్యుకేషన్ యాప్స్‌తో విద్యార్థులు, ఉద్యోగార్థులకు ప్రయోజనాలపై టాప్ స్టోరీ..
 
ఎం-లెర్నింగ్.. మొబైల్ లెర్నింగ్. అంటే అరచేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్‌నే అధ్యయన సాధనంగా మార్చుకునే వీలు కల్పిస్తున్న విధానం. స్మార్ట్ ఫోన్‌ల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు ఉపయోగపడే పలు మొబైల్ ఎడ్యుకేషన్ యాప్స్‌ను రూపొందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యున్నత శ్రేణి పరీక్షలైన జీమ్యాట్, జీఆర్‌ఈ, టోఫెల్, క్యాట్, సీశాట్, సివిల్స్, జేఈఈ వంటి పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని అందించే యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి.

ఈ యాప్స్ కెరీర్ గెడైన్స్ మొదలు పలు పోటీ పరీక్షల్లో సక్సెస్ టిప్స్ వరకు ఎన్నో అంశాలను తెలుసుకునే వీలు కల్పిస్తున్నాయి. వేగంగా కదిలే కాలాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకు చేయూతనిస్తున్నాయి. ఈ-లెర్నింగ్న్, మూక్స్ వంటి ఆన్‌లైన్ లెర్నింగ్ విధానాల మాదిరిగానే ఎం.లెర్నింగ్ పేరిట మొబైల్ ఎడ్యుకేషన్ యాప్స్ సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నాయి. ఎడ్యుకేషనల్ మొబైల్ యాప్స్ పట్ల ఇటీవల కాలంలో విద్యార్థులు, ఉద్యోగార్థుల ఆదరణ పెరుగుతోంది. 2012 నుంచి సగటున 29.3 శాతం వృద్ధి నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. 2017 నాటికి ఇది 34 నుంచి 37 శాతం మధ్యలో ఉంటుందని అంచనా.
 
అప్లికేషన్స్.. అనేక రకాలు
ఇప్పుడు విద్య, ఉద్యోగ పరీక్షలకు సంబంధించి సమాచారం విషయంలో మొబైల్ అప్లికేషన్స్‌లో పలు రకాలు అందుబాటులోకి వస్తున్నాయి. సదరు పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ మొదలు ప్రిపరేషన్ గెడైన్స్, సక్సెస్ టిప్స్, సక్సెస్ స్టోరీస్, పాత ప్రశ్నపత్రాల విశ్లేషణ వంటి అప్లికేషన్స్ రూపొందిస్తున్నారు. పరీక్ష ప్రిపరేషన్ కోణంలో సబ్జెక్ట్ వారీగా, సెక్షన్‌ల వారీగా మోడల్ కొశ్చన్స్, ప్రాక్టీస్ కొశ్చన్స్ అందిస్తున్నాయి. సబ్జెక్ట్ నిపుణుల లెక్చర్స్ సారాంశాన్ని తెలుసుకునే అవకాశం కూడా లభిస్తోంది. అభ్యర్థులు తమ సందేహాలు నివృత్తి చేసుకునే విధంగా కౌన్సెలింగ్ యాప్స్ సైతం ఆవిష్కృతమవుతున్నాయి.
 
పరీక్ష నిర్వాహక సంస్థలు సైతం
మొబైల్ యాప్స్ ద్వారా నైపుణ్యాలను అందించేందుకు ఆయా పరీక్షల నిర్వాహక సంస్థలు సైతం సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయంగా పలు విదేశీ విశ్వవిద్యాలయాల్లో మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు మార్గమైన జీమ్యాట్‌ను నిర్వహించే జీమ్యాక్ తాజాగా జీమ్యాట్ రివ్యూ పేరిట మొబైల్ ఎడ్యుకేషన్ యాప్‌ను విడుదల చేసింది.

ఔత్సాహిక విద్యార్థులు స్లాట్‌ల వారీగా పరీక్ష శైలి, ప్రశ్నల క్లిష్టత స్థాయి, అభ్యర్థులు పరీక్షలో తమ పనితీరు ఆధారంగా ఆశించదగిన స్కోర్స్ తదితర సమాచారం తెలుసుకోవచ్చు. జీమ్యాక్‌తోపాటు మన్‌హటన్, ప్రిన్స్‌టన్ రివ్యూ, మెక్‌గ్రాహిల్ వంటి ఇతర ప్రముఖ సంస్థలు సైతం తమ అధికారిక వెబ్‌సైట్స్ ద్వారా పలు మొబైల్ ఎడ్యుకేషన్ యాప్స్‌ను రూపొందించి డౌన్‌లోడ్ సౌకర్యం కల్పిస్తున్నాయి.
 
 
అధిక శాతం ఈ-లెర్నింగ్ ట్యూటర్స్
ఈ-లెర్నింగ్ వెబ్‌సైట్స్ ఎడ్యుకేషన్ యాప్స్‌ను ఎక్కువగా రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ పేరుతో వర్చువల్ క్లాస్‌రూమ్స్, రిఫరెన్స్, ఆన్‌లైన్ లెక్చర్స్ వంటి సేవలు అందిస్తున్న ‘ఈ-లెర్నింగ్’ సంస్థలు.. తాజాగా మొబైల్ యాప్స్‌ను అందిస్తున్నాయి. నామమాత్రం రుసుంకే పలు అప్లికేషన్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కొన్ని ఈ-లెర్నింగ్ సంస్థలు తమ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారికి ప్రతిరోజూ ఉచితంగా నిర్దిష్ట సంఖ్యలోని ప్రశ్నలను చూసుకోవడానికి, సమాధానం ఇవ్వడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఉదాహరణకు ఐౌ్కఝౌ వెబ్‌సైట్ పలు పోటీ పరీక్షల సమయంలో గుడ్‌నైట్ టెస్ట్ పేరిట ప్రతిరోజూ పది నిమిషాల పాటు ఉచితంగా 20 ప్రశ్నలతో కూడిన యాప్స్ సర్వీస్‌ను అందించింది.
 
ప్రతి పరీక్షకు ప్రత్యేకంగా
మొబైల్ యాప్స్‌ను రూపొందిస్తున్న వెబ్‌సైట్స్ ప్రతి పరీక్షకు ప్రత్యేకంగా వాటిని రూపొందిస్తుండటం గమనార్హం. ఉదాహరణకు ఇంజనీరింగ్ పోటీ పరీక్షలకు, మేనేజ్‌మెంట్ పోటీ పరీక్షలకు వేర్వేరుగా యాప్స్ అందించే సంస్థలు ప్రత్యేకంగా ఏర్పాటవుతున్నాయి. ఐఐఎంలలో ప్రవేశానికి నిర్వహించే క్యాట్‌కు సంబంధించి ఇఅఖీ్కైఉఖ వెబ్‌సైట్ ప్రత్యేక మొబైల్ యాప్స్‌ను సిద్ధం చేసింది. అదే విధంగా జిప్‌మర్ తదితర మెడికల్ ఎంట్రెన్స్‌లకు సంబంధించి ఐఞౌఝౌ, జీఞటౌజ తదితర వెబ్‌సైట్స్ ప్రత్యేకించి ఉన్నాయి. జేఈఈకి కూడా ప్రత్యేకంగా పలు వెబ్‌సైట్స్ మొబైల్ అప్లికేషన్స్‌ను రూపొందిస్తున్నాయి.
 
ఉద్యోగ పరీక్షలకు సైతం
ఎడ్యుకేషన్ యాప్స్ కేవలం ప్రవేశ పరీక్షలకే కాకుండా నియామక పరీక్షలకు సైతం అందుబాటులో ఉన్నాయి. సివిల్ సర్వీసెస్ మొదలు బ్యాంకుల్లో కొలువులకు నిర్వహించే ఐబీపీఎస్ క్లరికల్ కేడర్ వర కూ.. పలు పరీక్షలకు సంబంధించి ఇప్పుడు ఎన్నో సంస్థల మొబైల్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి కేవలం ప్రాక్టీస్ కొశ్చన్స్‌కే పరిమితం కాకుండా ప్రిపరేషన్ మెటీరియల్, టిప్స్ అండ్ టెక్నిక్స్ వంటి ఇతర సదుపాయాలు కల్పిస్తున్నాయి. కజీజ్ఛఛౌ్ఠ, ్టఛిడౌజ్ఛీ వంటి ప్రొవైడర్స్ సీశాట్, ఐబీపీఎస్ ప్రిపరేషన్ అప్లికేషన్స్‌లో ముందు ఉన్నాయి.
 
ఒక్కసారి డౌన్‌లోడ్‌తో నిరంతర అధ్యయనం
మొబైల్ యాప్స్‌లో ప్రత్యేకత.. ఒకసారి నిర్దిష్ట సదుపాయాలు ఉన్న అప్లికేషన్స్ ఇంటర్నెట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుంటే ఆ తర్వాత ఇంటర్నెట్ అవసరం లేకుండానే దీర్ఘకాలం సదరు అప్లికేషన్‌లో పొందుపరచిన సమాచారాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. ఆన్‌లైన్ ట్యూటర్స్‌తో పోల్చితే మొబైల్ యాప్స్ ద్వారా కలిగే అదనపు ప్రయోజనం ఇదే. ఆన్‌లైన్ ట్యూటర్స్ వెబ్‌సైట్స్ సదుపాయాన్ని పొందాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సిందే. కానీ మొబైల్ యాప్స్ విషయంలో మాత్రం డౌన్‌లోడ్ చేసుకునే సమయంలోనే ఇంటర్నెట్ అవసరం ఉంటుంది.
 
మొబైల్ ఆపరేటర్స్ కూడా
ఎం-లెర్నింగ్ ఆవశ్యకత, పెరుగుతున్న ఆదరణను గమనించిన మొబైల్ ఆపరేటర్స్ సైతం పలు యాప్స్‌ను అందిస్తున్నాయి. ఎయిర్‌సెల్ సంస్థ ఝజఠటఠ్జజీ పేరుతో యాప్స్‌ను రూపొందించింది. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, సివిల్ సర్వీసెస్, మెడిసిన్ తదితర పోటీ పరీక్షలకు సంబంధించి సమాచారం, ప్రాక్టీస్ కొశ్చన్స్, టిప్స్, మాక్ టెస్ట్ వంటి ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈకి సంబంధించి అకడమిక్ ప్రిపరేషన్ విషయాలు, స్కిల్ డెవలప్‌మెంట్ టెక్నిక్స్, వొకాబ్యులరీ బిల్డింగ్, జీకే ట్యుటోరియల్స్‌ను కూడా ఝజఠటఠ్జజీ నుంచి పొందొచ్చు. ఎయిర్‌టెల్ సంస్థ ఝ్ఛఛీఠఛ్చ్టిజీౌ అనే ఎడ్యుకేషన్ యాప్‌తో విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్, ఆయా పరీక్షల ప్రిపరేషన్ టిప్స్‌ను అందిస్తోంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నైపుణ్యాలు పెంచుకునేందుకు మార్గంగా టాటా డొకోమో సంస్థ ఉజజీటజి ్ఛ్ఛజుజిౌ అనే మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించింది.
 
డౌన్‌లోడ్ చేసుకోవాలంటే
ఎడ్యుకేషన్ మొబైల్ యాప్స్‌ను తమ ఫోన్‌లలోకి డౌన్‌లోడ్ చేసుకోవడం సులభమే. ఇందుకు కావలసిందల్లా మొబైల్ ఫోన్స్‌లో జీపీఆర్‌ఎస్, వాప్ సౌకర్యం ఉండటమే. స్మార్ట్ ఫోన్‌ల వినియోగం అధికంగా ఉన్న నేపథ్యంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్స్, మైక్రోసాఫ్ట్ విండోస్ స్టోర్, బ్లాక్‌బెర్రీ యాప్ వరల్డ్, శాంసగ్ యాప్ స్టోర్ వంటి మార్గాలతోపాటు, యాపిల్ ఫోన్స్ వినియోగదారులు యాపిల్ ఐట్యూన్స్ స్టోర్స్ నుంచి అవసరమైన ఎడ్యుకేషనల్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇలా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముందుగా ప్రతి ఒక్కరు సొంతంగా లాగిన్ - ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవడం తప్పనిసరి.  ఎడ్యుకేషన్ యాప్స్‌ను వినియోగించే క్రమంలో మొబైల్ ఫోన్స్‌లో  వై-ఫై సదుపాయం లేదా జీపీఆర్‌ఎస్/డబ్ల్యుఏపీ (ఇంటర్నెట్ సదుపాయం కోసం),  జావా స్క్రిప్ట్,  బీటా వర్షన్స్, మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ టూల్స్, డేటా స్టోరేజ్ కెపాసిటీ టూల్స్ ఉండాలి.
 
యాప్స్ ప్రయోజనాలు
- స్వల్ప ఖర్చుతో విలువైన సమాచారం.
- సమయం వృథా కాకుండా నిరంతరం నైపుణ్యం పెంచుకునే అవకాశం.
-  అకడమిక్ సమాచారాన్ని ఒక్కసారి డౌన్‌లోడ్ చేసుకుంటే సుదీర్ఘకాలం నిక్షిప్తం చేసుకునే సదుపాయం.
- కొన్ని యాప్స్‌లో లభించే ప్రత్యేక సదుపాయాల ఫలితంగా ఎప్పటికప్పుడు తమ సామర్థ్యాన్ని తెలుసుకునే మార్గం.
- బ్లూటూత్ సదుపాయం ద్వారా లెక్చర్స్ వినేందుకు అవకాశం.
 
ఆయా పరీక్షల వారీగా ముఖ్యమైన మొబైల్ యాప్స్ ప్రొవైడర్స్ వివరాలు..

జీఆర్‌ఈ
  www.ets.org
  princetonreview.com
  www.manhattanprep.com
  www.yourteacher.com
  www.magoosh.com
 
 జీమ్యాట్
  www.beatthegmat.com
  www.mba.com
  www.gmac.com
  www.kaplan.com
  www.veritasprep.com
 
 ఐఈఎల్‌టీఎస్
  www.ieltstestonline.com
  www.britishcounsil.it
  www.mcmillaneducationapps.com
  www.freemanmobile.com
  www.udemy.com
 
 సీశాట్
  www.minglebox.com
  www. prepzone.in
  www.tcyonline.com
  www.clearias.com
  www.wiziq.com
 
 జేఈఈ
  www.edusolutions.com
  www.toppr.com
  www.plancessjee.com
  www.edtechreview.in
  www.meritnation.com
 
 క్యాట్
  www.catapp.in
  www.testfunda.com
  www.gradestack.com
  www.cat.jumbotests.com
  www.cat.learnhub.com
 
అవసరాలకు సరితూగేలా

మొబైల్ యాప్స్ ఎడ్యుకేషన్ విభాగంలోనూ ప్రవేశించడం ఆహ్వానించదగిన పరిణామం. నేడు  యువతలో దాదాపు 50 శాతం మేర స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. కొత్తగా వస్తున్న మొబైల్ అప్లికేషన్స్ ద్వారా నెపుణ్యాలను పెంచుకోవడానికి మరింత మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి. ఈ యాప్స్‌ను ఎంపిక చేసుకునేముందు తమ అవసరాలకు సరితూగే విధంగా సదుపాయాలు ఉన్నాయా? లేవా? అని గుర్తించి ఎంచుకోవాలి.
  - జి.హేమంత్, కో-ఫౌండర్, టాపర్ డాట్ కామ్
 
సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు
మొబైల్ ఫోన్స్ నాలెడ్జ్ రిసోర్స్‌గా కూడా ఉపయోగపడుతున్నాయని గుర్తించాలి. గత రెండు, మూడేళ్లుగానే ఎడ్యుకేషన్ మొబైల్ యాప్స్‌కు రూపకల్పన జరిగినప్పటికీ వీటిపై అవగాహన చాలా కొద్ది మందికే ఉంటోంది. ఇంటర్నెట్ సదుపాయంతో ఉన్న మొబైల్ ఫోన్ కలిగిన ప్రతి ఒక్కరూ ఈ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  
 - వంశీచంద్ రెడ్డి, డెరైక్టర్, బ్రేవ్‌మౌంట్ సొల్యూషన్స్
 
లెర్నింగ్‌లో  సరికొత్త విప్లవం
విద్యార్థుల లెర్నింగ్ కోణంలో సరికొత్త విప్లవం ఎం-లెర్నింగ్. ఇదిదినదిన ప్రవర్థమానం అవుతోంది. ఇప్పటికే డెస్క్‌టాప్, ల్యాప్ టాప్‌ల ద్వారా ఆన్‌లైన్ ట్యూటర్ వెబ్‌సైట్స్ సహకారంతో పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మొబైల్ ఫోన్స్ ఆధారంగా ఎడ్యుకేషన్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటూ మరింతగా నైపుణ్యాలను పెంచుకోవచ్చు.
- ఆదిల్ ఉస్మాన్, బిజినెస్ హెడ్, iprof

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement