ఇంటర్వ్యూతో దొరికిపోయాడు | Caught up with Interview | Sakshi
Sakshi News home page

ఇంటర్వ్యూతో దొరికిపోయాడు

Published Mon, Jan 11 2016 9:00 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

ఇంటర్వ్యూతో దొరికిపోయాడు - Sakshi

ఇంటర్వ్యూతో దొరికిపోయాడు

డ్రగ్ డాన్ గుజ్మన్ అరెస్టు వైనం
 
మెక్సికో సిటీ: మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డాన్ జొవాకిన్ ఎల్ చాపో గుజ్మన్ ఓ ఇంటర్వ్యూ కారణంగా పోలీసులకు చిక్కినట్టు మెక్సికన్ అధికారులు తెలిపారు. అతనితో అమెరికా నటుడు సీన్ పెన్ రహస్యంగా చేసిన ఇంటర్వ్యూతో ఆచూకీ దొరికిందన్నారు. గుజ్మన్‌ను శుక్రవారం లోస్ మోచిస్‌లో కాల్పుల తర్వాత అరెస్టు చేయడం, ఈ ఘటనలో ఐదుగురు చనిపోవడం తెలిసిందే.

మెక్సికో అధికారులు తెలిపిన ప్రకారం.. గుజ్మన్ తన జీవితంపై ఒక సినిమా నిర్మాణానికి సంబంధించి సినీనటులు, నిర్మాతలతో నెరిపిన సంబంధాలు అతన్ని పట్టుకోడానికి మార్గం చూపాయి. సీన్ పెన్ గత అక్టోబర్‌లో దురాంగో రాష్ట్రంలో ఈ ఇంటర్వ్యూ చేశాడు. దాని ఆధారంగా బలగాలు ఆచూకీ కనిపెట్టాయి. అయితే అప్పుడు అతడు ఇద్దరు మహిళలు, ఒక చిన్నారితో ఉండడంతో ఆపరేషన్ ఆపేశాయి.

తర్వాత లోస్ మోచిస్ ఆపరేషన్ జరిపి అతని ఆటకట్టించాయి. పెన్‌కు గుజ్మన్ ఇచ్చిన ఇంటర్వ్యూను ‘రోలింగ్ స్టోన్’ పత్రిక ప్రచురించింది. మెక్సికన్ నటి కేట్ డెల్ కాస్టిలో ఈ ఇంటర్వ్యూకు సాయం చేసిందని ఆ పత్రిక తెలిపింది. కాగా, గుజ్మన్‌ను అమెరికాకు అప్పగించడంపై మెక్సికో కోర్టులో విచారణ జరడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement