కొణిదల వారి పెళ్లి సందడి | Sakshi
Sakshi News home page

కొణిదల వారి పెళ్లి సందడి

Published Thu, Mar 24 2016 1:52 PM

కొణిదల వారి పెళ్లి సందడి - Sakshi

కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ అంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం అంగరంగ వైభవంగా జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇప్పటి వరకు అఫీషియల్గా ఎనౌన్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఫోటోలు, వార్తలతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తాజాగా శ్రీజను పెళ్లి కూతురిని చేస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియలో సందడి చేస్తున్నాయి.

మెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బెంగుళూరులోని చిరంజీవి ఫాం హౌజ్లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మార్చి 28న శ్రీజ వివాహం జరగనుంది. తరువాత హైదరాబాద్ లోని ప్రముఖుల కోసం మార్చి 31న గ్రాండ్ రిసెప్షన్ను ప్లాన్ చేస్తున్నారు.


Advertisement
 
Advertisement
 
Advertisement