రచయిత, దర్శకులపై నాగబాబు మండిపాటు
రచయిత, దర్శకులపై నాగబాబు మండిపాటు
Published Sat, Jan 7 2017 7:38 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM
హాయ్‌ల్యాండ్ వేదికగా జరిగిన ఖైదీ నెం. 150 ప్రీ లాంచ్ వేడుకలో మెగా బ్రదర్ నాగేంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ మీద కామెంట్లు చేసిన ఇద్దరు ప్రముఖులపై వాళ్ల పేర్లు ప్రశ్నించకుండానే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చరణ్ ముఖం మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడంటూ ఒక వ్యక్తి గతంలో కామెంట్ చేశారని ముందుగా అన్నారు. ఆయన తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని, గతంలో చిరంజీవి సినిమాలకు కథలు అందించడం, దర్శకత్వం వహించడం కూడా చేశాడని చెప్పారు. వ్యక్తిత్వ వికాస క్లాసులు కూడా చెప్పుకుంటాడని, ఇప్పుడు ఏమీ లేక ఖాళీగా ఉండటం వల్లే ఈ పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడని చెబుతూ.. అంతా 'వాడు.. వాడు' అని ప్రస్తావించారు. తాను ఎవరి గురించి చెబుతున్నానో వాడొక్కడికీ అర్థమైతే చాలని, ఇక్కడ ఉన్నవాళ్లందరికీ అర్థం కాకపోయినా పర్వాలేదని తెలిపారు.
మరోవ్యక్తి ఇక్కడ డైరెక్షన్ చేయడం చేతకాక ముంబై వెళ్లిపోయి అక్కడి నుంచి సోషల్ మీడియాలో కారుకూతలు కూస్తున్నాడని, ఎవరు పడితే వాళ్లు మెగాస్టార్‌ను ఒక మాట అంటే మైలేజి పెరుగుతుందని అనుకుంటున్నారని నాగేంద్రబాబు మండిపడ్డారు.
Advertisement
Advertisement