రాంగోపాల్ వర్మ 'వంగవీటి' ట్రైలర్
'ఒకప్పుడు విజయవాడలో.. భయపడేవాడెప్పుడూ రౌడీ కాలేడు' అంటూ రక్తం పులుముకున్న టైటిల్స్.. 'వంగవీటి.. వంగవీటి.. వంగవీటి.. వంగవీటి కత్తి.. ఇది కాపును కాసే శక్తి.. కమ్మని పౌరుషాసుకి పుట్టిస్తుంది భయమూ భక్తి..' అంటూ బ్యాక్ గ్రౌండ్ లో రాంగోపాల్ వర్మ గంభీర స్వరం.. కత్తులతో పోరాటం.. నెత్తుటితో సమాధానం.. చివరికి ఏం మిగిలిందనేది తెరపై చూడమంటూ టీజింగ్..
టాలీవుడ్ చరిత్రలో వివాదాస్పద సినిమాల్లో ఒకటిగా భావించే 'వంగవీటి' సినిమా ట్రైలర్ ఆదివారం విడుదలైంది. దిగ్గజ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'వంగవీటి'ని రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాపై మార్కెట్ వర్గాల్లో నెలకొన్న ఆసక్తిని రెట్టింపు చేసేలా అత్యంత ర(హిం)సాత్మకంగా ఉన్న ట్రైలర్ మీకోసం..