కోహ్లి రెస్టారెంట్‌లో పసందైన విందు | Sakshi
Sakshi News home page

కోహ్లి రెస్టారెంట్‌లో ఆర్సీబీ సందడి

Published Fri, May 11 2018 3:44 PM

Kohli Gave Feast To Teammates At His Restaurant - Sakshi

న్యూఢిల్లీ : ఇటీవల హైదరాబాద్‌లో మహ్మద్‌ సిరాజ్‌ ఇంట్లో సందడి చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు.. గురువారం రాత్రి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెస్టారెంట్లో సరదాగా గడిపారు. ఐపీఎల్‌లో భాగంగా బెంగళూరు జట్టు శనివారం ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో తలపడనుంది. అందుకోసం బెంగళూరు ఆటగాళ్లు నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. కోహ్లికి దక్షిణ ఢిల్లీలో నూయేవా రెస్టారెంట్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇంకేముంది తన హోం టౌన్‌కు విచ్చేసిన ఆటగాళ్లకు కోహ్లి తన రెస్టారెంట్‌లోనే పసందైన విందు ఏర్పాటు చేశాడు. ఈ విందులో జట్టు సభ్యులు ఏబీ డివిలియర్స్‌, ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌, టిమ్‌ సౌతి, మోయిన్‌ అలీ, యుజువేంద్ర చహల్‌తో పాటు బౌలింగ్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రా కూడా పాల్గొన్నాడు.

రెస్టారెంట్‌కు వచ్చిన ఆర్సీబీ ఆటగాళ్లతో ఫొటోలు దిగేందుకు అక్కడి కస్టమర్లు ఉత్సాహం కనబర్చారు. కోహ్లి సేన కూడా వారితో అంతే సరదాగా గడుపుతూ.. ఫొటోలకు పోజులిచ్చారు. తన జట్టు సభ్యులు తన రెస్టారెంట్‌కు విచ్చేసిన ఫొటోలను కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో కోహ్లి సేన తమ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తూ వస్తోంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. శనివారం ఢిల్లీతో తలపడే మ్యాచ్‌లో గెలిస్తేనే బెంగళూరు ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంటాయి.

With @abdevilliers17 at @nueva.world 🤙

A post shared by Virat Kohli (@virat.kohli) on

Advertisement
 
Advertisement
 
Advertisement