గతంలోనూ ప్రమాదాలు..పట్టించుకోని అధికారులు Masai peta accident: taken place earlier..no action taken | Sakshi
Sakshi News home page

గతంలోనూ ప్రమాదాలు..పట్టించుకోని అధికారులు

Published Thu, Jul 24 2014 10:28 AM

గతంలోనూ ప్రమాదాలు..పట్టించుకోని అధికారులు - Sakshi

మెదక్: మసాయిపేట రైల్వే గేట్ వద్ద గతంలో కూడా ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు వెల్లడించారు. గత ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద కాపాలాదారుడు లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సైరన్ లేకుండా రైలు రావడం, బస్సు డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ఘోర ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 
 
ఇస్లాంపూర్ నుంచి తుఫ్రాన్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే గేటు నుంచి కిలో మీటర్ వరకు బస్సు ఈడ్చుకు వెళ్లినట్టు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement